Just In
- just now
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 1 hr ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 1 hr ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 2 hrs ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
Don't Miss!
- Finance
రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?
- News
Bigg Boss కంటెస్టెంట్ నటి ఆత్మహత్య , కారణం ఇదే..!
- Automobiles
సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్కు వస్తుందా..?
- Sports
India vs England: వారికి ఐదు రోజులు.. వీరికి మాత్రం మూడు రోజులే!!
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతి విన్నర్: అఫీషియల్ లెక్కలు ఇవే... ఊహించని ఫలితాలు!

2018 సంక్రాంతి సందర్భంగా వెండితెరపై పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', బాలయ్య 'జై సింహ' పోటీ పడ్డ సంగతి తెలిసిందే. వీటితో పాటు సూర్య నటించిన డబ్బింగ్ మూవీ 'గ్యాంగ్', రాజ్ తరుణ్ 'రంగులరాట్నం' బరిలో నిలిచాయి. వెండితెరకు సంబంధించిన పోటీలో విజేత బాలయ్యే అని తేలిపోయింది. అయితే బుల్లితెరపై కూడా ఈ సంక్రాంతికి మరో నందమూరి హీరో విజయఢంకా మ్రోగించారు.

బుల్లి తెరపై పోటీ పడ్డ సినిమాలు ఇవే
2018 సంక్రాంతికి బెల్లితెరపై ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ', మహేష్ బాబు మూవీ ‘స్పైడర్', రవితేజ ‘రాజా ది గ్రేట్', శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు' చిత్రాలు పోటీ పడ్డాయి.

అపుడు దసరా, ఇపుడు సంక్రాంతి
మహేష్ బాబు ‘స్పైడర్', జూ ఎన్టీఆర్ ‘జై లవ కువ' చిత్రాలు 2017 దసరా సీజన్లో బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. ఆ సమయంలో తారక్ నటించిన ‘జై లవ కుశ' చిత్రం విజేతగా నిలవగా, ‘స్పైడర్' మూవీ భారీ నష్టాలు మూటగట్టుకుని అట్టర్ ప్లాప్ అయింది.

బెల్లితెరపై కూడా ‘స్పైడర్' ప్లాప్
‘స్పైడర్' మూవీ ప్లాప్ టాక్ రావడంతో వెండితెరపై ఎవరూ చూడలేదు. మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని బెల్లితెరపై ఎక్కువ మంది చూస్తారని అంచనా వేశారు. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. బుల్లితెరపై కూడా ఈ చిత్రం పెద్ద ప్లాప్ అని తేలి పోయింది.

విజేతగా నిలిచిన తారక్ ‘జై లవ కుశ'
‘జై లవ కుశ' మూవీ సంక్రాంతికి టీవీలో ప్రదర్శించగా 17.7 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తారక్ కెరీర్లోనే ఇది సెకండ్ హయ్యెస్ట్ రేటింగ్. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్' 20.69 రేటింగ్ సాధించింది. తారక్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్.

‘జై లవ కుశ'తో సమానంగా ‘రాజా ది గ్రేట్'
రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్' చిత్రం కూడా ఈ సంక్రాంతికి టీవీ ప్రీమియర్ వేశారు. ఈ చిత్రం కూడా ‘జై లవ కుశ' చిత్రంతో సమానంగా 17.7 టీఆర్పీ రేటింగ్ సాధించింది. వెండితెరపై కూడా ఈ మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఎవరూ ఊహించలేదు
సంక్రాంతికి బెల్లితెరపై విడుదలైన ‘జై లవ కువ', ‘రాజా దిగ్రేట్' చిత్రాలకు ఒక్క పాయింట్ కూడా అటూ ఇటూ కాకుండా సేమ్ టీఆర్పీ రేటింగ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ రెండు చిత్రాలకు 17.7 రేటింగ్ రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

మహేష్ కెరీర్లోనే ‘స్పైడర్' దారుణమైన రిజల్ట్స్
‘స్పైడర్' మూవీ బెల్లితెరపై దారుణమైన రిజల్ట్స్ నమోదు చేసింది. కేవలం 6.7 రేటింగ్ రాడంతో బుల్లితెరపై కూడా డిజాస్టర్ అయి తేలిపోయింది. మహేష్ బాబు మరో ప్లాప్ మూవీ ‘బ్రహ్మోత్సవం'(7.12) కూడా ఇంత దారుణమైన రేటింగ్స్ నమోదు చేయలేదు. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో ‘శ్రీమంతుడు' 21.84 రేటింగుతో నెం.1 స్థానంలో ఉంది.

మహానుభావుడు
శర్వానంద్ మూవీ ‘మహానుభావుడు' చిత్రం 8.3 రేటింగ్ సొంతం చేసుకుంది. వెండి తెరపై కూడా ఈ చిత్రం పెద్దగా ఆడలేదనే సంగతి తెలిసిందే.

చిన్న సినిమానే కానీ
ఈ సంక్రాంతికి టీవీలో ప్రదర్శితం అయిన మరో మూవీ ‘నిర్మలా కాన్వెంట్'. ఈ చిత్రం 8.1 రేటింగ్ సాధించింది. ఆ సినిమా స్థాయితో పోలిస్తే ఇది మంచి రేటింగే.