అమ్మాయిలతో సెల్ఫీలు, టీవి నటుడి అరెస్టు
కువైట్: టీవీ అయినా సినిమా అయినా సెలబ్రిటీలు అంటే అందరికీ అభిమానమే. వారు బయిట కనబడితే చాలు.. అభిమానులు ఆగలేరు. ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు తీసుకుంటారు. దానికి తోడు ఇప్పుడు సెల్ఫీ ట్రెండ్ నడుస్తూండటంతో...తమకు నచ్చిన హీరో పొరపాటున కనబడితే చాలు. సెల్ఫీ తీసుకుని ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పెట్టుసుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఓ నటుడు కొంప ముంచింది.
ఈ సంఘటన చోటు చేసుకుంది సౌదీఅరేబియాలో ఓ టీవీ నటుడికి. కానీ ఆ అనుభవమే అతన్ని జైలుకి తీసుకెళ్లింది. దానికి కారణం సౌదీ చట్టం ప్రకారం తెలియని అమ్మాయిలతో ఫొటోలు దిగడం నేరమట.

పూర్తి వివరాల్లోకి వెళితే..
కువైట్‌కు చెందిన అబ్దుల్ అజీజ్ అల్ కస్సార్ స్థానిక టీవీ ఛానల్‌లోపాపులర్ నటుడు. అజీజ్ గత అక్టోబర్ 23న రియాద్‌లోని ఓ షాపింగ్‌మాల్ నుంచి బయటకు వస్తుండగా.. ఒక్కసారిగా అతని అభిమానులు గుమిగూడారు.
అందులో చాలా మంది అమ్మాయిలో ఉన్నారు. కొందరు అమ్మాయిలు అజీజ్‌తో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో సౌదీ చట్టం ప్రకారం.. తెలియని అమ్మాయిలతో ఫొటోలు తీసుకోవడం నేరంగా పరిగణిస్తూ.. అజీజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే దీనిపై అజీజ్ స్పందిస్తూ.. తన కోసం అభిమానులు వేచిఉన్న సంగతి తనకు తెలియదని, షాపింగ్‌మాల్ యాజమాన్యం కూడా తనకేమీ చెప్పలేదన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారంతా తనతో ఫొటోలు దిగారని అజీజ్ అన్నాడు.

మరోవైపు అజీజ్ సోషల్ మీడియా ద్వారా మహిళా అభిమానులను షాపింగ్‌మాల్‌కు ఆహ్వానించాడని, వారితో కావాలనే ఫొటోలు దిగాడని ఆరోపణలు వస్తున్నాయి. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అజీజ్ బెయిల్‌పై విడుదలయ్యారు.


Click it and Unblock the Notifications











