For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ సుమపై సినీ నటి షాకింగ్ కామెంట్స్: వయసు పెరిగినా తీరు మారలేదు.. చాలా అసూయ అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై చక్రం తిప్పుతూ.. ఎంతో కాలంగా టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ. పేరుకు కేరళ అమ్మాయే అయినా.. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉండే ఆమె.. అనర్గళంగా మాట్లాడుతూ మాయ చేస్తోంది. అదే సమయంలో అద్భుతమైన టైమింగ్‌తో అదరగొడుతూ ప్రతి కార్యక్రమాన్ని వన్ ఉమెన్ షోగా మార్చేస్తుంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ సినీ నటి రాజ్యలక్ష్మీ యాంకర్ సుమపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

   ఆల్‌రౌండర్‌... టాప్ యాంకర్ సుమ

  ఆల్‌రౌండర్‌... టాప్ యాంకర్ సుమ

  దాదాపు రెండు దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో హవాను చూపిస్తూ.. దూసుకుపోతూనే ఉంది యాంకర్ సుమ. అద్భుతమైన హోస్టింగ్‌తో కట్టి పడేసే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగులో ఉన్న అన్ని ఛానెళ్లలోనూ వరుసగా షోలు చేస్తోంది. తద్వారా ఎన్నో ఘనతలను అందుకుంటోంది.

   అది ఇది తేడా లేదు.. ఆమెదే హవా

  అది ఇది తేడా లేదు.. ఆమెదే హవా

  బుల్లితెరపై టాప్ యాంకర్‌గా ఉన్న సుమ కనకాల.. వెండితెరపైనా తన మార్క్ చూపిస్తోంది. టీవీ షోలతో పాటు సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. సుమ వస్తే మా సినిమా హిట్టే అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతూ ముందుకెళ్తోందామె.

  సీరియల్ నటిపై అవినాష్ నాటీ కామెంట్స్: ఎప్పుడు చూసినా అదే ఫీలింగ్.. ఆ హీరోపై మరీ దారుణంగా!
  https://telugu.filmibeat.com/television/mukku-avinash-shocking-comments-on-serial-actress-and-hero-101156.html

  సుమ షోలలో దానికి భారీ రెస్పాన్స్

  సుమ షోలలో దానికి భారీ రెస్పాన్స్

  దీర్ఘకాలికమైన ప్రయాణంలో సుమ ఎన్నో షోలను హోస్ట్ చేసింది. అందులో ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకున్న కార్యక్రమాల్లో 'క్యాష్' ఒకటి. ఇందులో సినీ, టెలివిజన్ ప్రముఖులు గెస్టులుగా వస్తారు. ఇందులో ఈ యాంకరమ్మ చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అందుకే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ వీడియోలకు భారీ స్థాయిలో స్పందన వస్తుందన్న విషయం తెలిసిందే.

  Recommended Video

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  సీనియర్ నటులతో సుమ సందడిగా

  సీనియర్ నటులతో సుమ సందడిగా

  వచ్చే వారం ప్రసారం కానున్న 'క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రతివారం సెలెబ్రిటీలతో సందడి చేసే సుమ.. ఈ సారి సీనియర్ నటులు బాబు మోహన్, రాజ్యలక్ష్మీ, గౌతం రాజు, శివ పార్వతిలతో కలిసి ఆడిపాడింది. వాళ్లంతా కూడా ఈ టాప్ యాంకరమ్మకు ధీటైన ఆన్సర్లు చెబుతూ పంచులు వేశారు. దీంతో ఈ ప్రోమో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

   సుమపై సినీ నటి షాకింగ్ కామెంట్స్

  సుమపై సినీ నటి షాకింగ్ కామెంట్స్

  'క్యాష్' షోలో సాధారణంగా యాంకర్ సుమ కనకాలే అందరిపై పంచులు వేస్తూ చుక్కలు చూపిస్తుంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఆడడానికి వచ్చే సెలెబ్రిటీలు సైతం ఆమెపై పంచుల వర్షం కురిపిస్తూ షాకిస్తున్నారు. దీంతో ఈ షో మరింత ఫన్నీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం ఎపిసోడ్‌లో సినీ నటి రాజ్యలక్ష్మీ యాంకర్ సుమపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఆశ్యర్యపరిచింది.

  నగ్నంగా హీరో, హీరోయిన్ హగ్: ఘాటు ఫోజును ట్రై చేసిన సుడిగాలి సుధీర్.. అసలు ట్విస్ట్ అక్కడే!

  వయసు పెరిగినా తీరు మారలేదని

  రాజ్యలక్ష్మి షోలోకి ఎంట్రీ ఇవ్వగానే అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ.. 'ఈరోజు మీరు నాకు కాంపిటీషన్‌గా రెడీ అయి వచ్చారు' అంది. అప్పుడు రాజ్యలక్ష్మి 'నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది. మేమెప్పుడో మా చిన్నప్పుడు ఇలా లంగావోణీలు వేశాము. కానీ నువ్వు మాత్రం ఇప్పటికీ అవే వేస్తున్నావు' అంటూ ఊహించని విధంగా కామెంట్ చేశారు.

  మీ అర్థం ఏంటి? అంటూ సుమ ప్రశ్న

  మీ అర్థం ఏంటి? అంటూ సుమ ప్రశ్న

  రాజ్యలక్ష్మి మాట్లాడిన తర్వాత స్పందించిన యాంకర్ సుమ కనకాల 'అంటే.. ఇందులో ఏమిటి మీ అర్థం? నాకు ఇంత పెద్ద వయసు వచ్చినా ఇంకా లంగావోణీలు వేసుకుంటున్నాననా' అని ప్రశ్నించింది. దీంతో అంతా నవ్వుకున్నారు. ఇక, ఇందులో బాబు మోహన్ చేసిన కామెడీ పాత రోజులను గుర్తు చేసింది. అలాగే, శివ పార్వతి, గౌతంరాజు కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.

  English summary
  Babu Mohan, Rajyalakshmi, Gautam Raju and Siva Parvathi participants in Anchor Suma Cash Show Upcoming Episode. In This Show Rajyalakshmi Shocking Comments on Suma Dressing.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X