»   » మహేష్ బాబు సిస్టర్‌ఇన్‌లా కు గాయాలు!

మహేష్ బాబు సిస్టర్‌ఇన్‌లా కు గాయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు సిస్టర్‌ఇన్‌లా(వదిన), మాజీ హీరోయిన్ శిల్పా శిరోద్కర్ షూటింగులో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె హిందీ సీరియల్ ‘సిల్ సిలా ప్యార్ కా'లో నటిస్తోంది. షూటింగులో భాగంగా డైలాగ్స్ చెబుతూ మొట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు ఆమె కిందపడిపోయారు.

Shilpa Shirodkar Injured In Sets

వెంటనే ఆమెను యూనిట్ మెంబర్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ఇంద పెద్ద ప్రమాదం జరిగినా అదృష్ట వశాత్తు ఆమె వెన్నుముఖకు ఎలాంటి ప్యాక్చర్ కాలేదు. ఒక వేళ వెన్నుముఖకు ఫ్యాక్చర్ అయి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేది.

Shilpa Shirodkar Injured In Sets

ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో బెడ్ మీదనే రెస్టు తీసుకుంటున్నారు. గాయపడ్డ తన సోదరిని చూసేందుకు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ వెళ్లినట్లు సమాచారం. సమయం చూసుకుని మహేష్ బాబు, గౌతం, సితార కూడా వెళ్లి శిల్ప శిరోద్కర్ ను పరామర్శించే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Mahesh Babu's sister-in-law and former heroine Shilpa Shirodkar had a major fall from the stairs on the location of her latest Hindi TV series Silsila Pyaar Ka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu