»   »  మినిమం జనరల్ నాలెడ్జ్ కూడా మన స్టార్స్ కు లేదు

మినిమం జనరల్ నాలెడ్జ్ కూడా మన స్టార్స్ కు లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మన హీరో,హీరోయిన్స్ లో చాలా మందికి జనరల్ నాలెడ్జ్ కూసింత తక్కువే అని తెలుసు కానీ, మరో ఇంత తక్కువ అని తెలియదా అని ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తన అమాయకత్వాన్ని బయటపెట్టింది. ఇంతకీ అలియాను ఆ కార్యక్రమంలో అడిగిన ప్రశ్న ఏమిటి? ఆమె ఏం సమాధానం చెప్పింది వింటే మనకు నవ్వు..తర్వాత జాలి వేస్తుంది.

మన రాష్ట్రపతి ఎవరు? అని వ్యాఖ్యాత కరణ్‌ జోహార్‌ ప్రశ్న అడిగితే.. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ అని అలియా సమాధానం చెప్పింది. ఈమె తరహాలోనే హీరో వరుణ్‌ ధావన్‌ ఏకంగా మన్మోహన్‌ సింగ్‌ పేరు చెప్పడం కొసమెరుపు. వీరిద్దరితోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా ఒక్కడే ప్రణబ్‌ ముఖర్జీ అని కచ్చితమైన సమాధానం చెప్పాడు. అలియా అమాయకంగా చెప్పిన సమాధానానికి స్పందిస్తూ సామాజిక సైట్లలో ఆమె మీద సరదా వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి.

Shocking goof-ups on 'Koffee with Karan'

దీంతో అలియాపై ఛలోక్తులు విసురుతున్నారు నెటిజన్లు. సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో ఇప్పుడు బాలీవుడ్‌ నాయిక అలియా భట్‌ మీద ఒకటే జోక్‌లు. వీటిపై అలియా స్పందిస్తూ... ''నా మీద జోకులు వేసినా నేనేమీ బాధపడను. ముఖ్యంగా నా లోకజ్ఞానం మీద సరదా కామెంట్లు చేస్తే అస్సలు పట్టించుకోను. వాటిని నేను కూడా ఆస్వాదిస్తాను''అని స్పష్టం చేసింది.

'హైవే', 'టూస్టేట్స్‌' సినిమాల విజయం.. అలియా ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చిందన్న విమర్శపై స్పందిస్తూ... ''అస్సలు నేను విజయాల్ని చూసి పొంగిపోయే రకం కాదు. నాకు తెలిసిన వాళ్లకు ఆ విషయం బాగా తెలుసు. ఎందుకంటే ఆ రెండు సినిమాలు విజయం సాధించినా.. ఇంత సాధారణంగా ఎలా ఉంటున్నావ్‌? అని చాలా మంది సన్నిహితులు నన్ను అడిగారు తెలుసా'' అని ముగించింది.

English summary
when Alia Bhatt appeared on Koffee With Karan, she became a butt of jokes on the web, thanks to her IQ. When she first appeared on Koffee With Karan this season, she gave some funny answers on the rapid fire round which made her a butt of jokes on the internet. For example, when asked Who is the President of India, she instantly replied Prithviraj Chauhan! Seriously Alia?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu