»   »  మర్డర్ కేసు లో పాపులర్ కామెడీ షో స్క్రిప్టు రైటర్ అరెస్ట్

మర్డర్ కేసు లో పాపులర్ కామెడీ షో స్క్రిప్టు రైటర్ అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ప్రముఖ హిందీ కమెడియన్‌ కపిల్‌ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కొత్త షో 'ద కపిల్‌ శర్మ షో' ఆ మధ్యన ప్రారంభమై హై సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోకు సంభందించిన ఓ విషయం ఇప్పుడు అందరినీ షాక్ ఇచ్చింది. ఈ షోకు స్క్రిప్టు రైటర్ గా పనిచేస్తున్న రామ్ అభిషేక్ సింగ్ ..ఓ మర్డర్ కేసులో అరెస్టు అయ్యాడు.

అందుతున్న సమాచారం ప్రకారం...రామ్ అభిషేఖ్ సింగ్ అలియాస్ కేరా సింగ్...ఓ క్రిమినల్..యుపి నుంచి పారిపోయి వచ్చాడు. దాదాపు ఏడు సంవత్సరాలుగా తను ఎవరో ఐడింటెండీ దాచుకుని బ్రతుకుతున్నారు.

Shocking! The Kapil Sharma Show’s Scriptwriter Arrested!

మనం నమ్మగలమా ఓ క్రిమినల్ రాసి ఇచ్చిన స్క్రిప్టుతో మనం ఇన్నాళ్లూ నవ్వుతున్నాం. ముంబైలోని ఓ లీడింగ్ దిన పత్రిక ఇచ్చిన సమాచారం ప్రకారం..., " యుస్ స్పెషల్ ఫోర్స్ రామ్ అభిషేక్ సింగ్...ముంబైలోని అతని రెసిడెన్స్ లో అరెస్ట్ చేసారు. రోహిత్ సింగ్ గా ఐడిండెటీ మార్చుకున్నాడు. అక్టోబర్ 2009 లో అజగ్రామ్ లో ఓ షూట్ అవట్ లో పాల్గన్నాడు. ఆ షూట్ అవుట్ ఇద్దరు మరణించారు. అతని తలపై ముప్పై వేలు రివార్డ్ ఉంది.."

ఇక ఈ షోని కపిల్‌ సీజన్ల వారీగా చేస్తున్నారు. గతంలో కామెడీ నైట్స్‌ షోని సిరీస్‌గా చేశామని, ప్రస్తుత షో అలా కాదని, 13 వారాల్లో 26 ఎపిసోడ్స్‌ మాత్రమే ఉంటాయని కపిల్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ తర్వాత విరామం తీసుకుని మరో సీజన్‌ కొనసాగిస్తామని చెప్పాడు. అయితే ప్రస్తుత షోకి రేటింగ్స్‌ అంత బాగా రాలేదని తెలుస్తోంది.

మొదటి ఎపిసోడ్‌ దిల్లీలో ప్రారంభమైంది. దానికి అతిథిగా షారుక్‌ వచ్చాడు. షారుక్‌ వల్ల ఆ ఎపిసోడ్‌ కాస్త హుషారుగా కొనసాగిందే కానీ కార్యక్రమంలోని మిగతా బృందం మాత్రం ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయింది. సంభాషణల్లో హాస్యం లోపించిందనే విమర్శలు వచ్చాయి.

Shocking! The Kapil Sharma Show’s Scriptwriter Arrested!

మరో ప్రక్క ఆ మధ్యన 'ద కపిల్ శర్మ షో'లో నర్సును చూపించిన తీరుపై దుమారం రేగుతుండటంతో దీనిపై ఈ షో వ్యాఖ్యాత, హాస్య నటుడు కపిల్ శర్మ స్పందించాడు. తమ షోను ఆందోళనకారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు.

షోలో భాగంగా నర్సు గురించి జోకులు వేసినంతమాత్రాన.. అది నర్సులందరికీ వర్తిస్తుందని భావించడం సరికాదన్నాడు. నర్సులను అసభ్యంగా షో చూపిస్తున్నారన్న వివాదం నేపథ్యంలో నర్సు పాత్రను షో కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు తప్పకుండా కొనసాగిస్తామని బదులిచ్చాడు. ఆ క్యారెక్టర్‌తో షోలో తాము కామెడీ మాత్రమే చేస్తున్నామని, అందులో అసభ్యత లేదని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చాడు.


'ద కపిల్ శర్మ షో'లో 'హాట్‌' నర్సుగా రోచెల్లా రావును, స్థూలకాయమున్న నర్సుగా కికు శార్దాను చూపిస్తూ వెకిలీ హాస్యాన్ని ప్రదర్శిస్తున్నారని అమృత్‌సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు ఇటీవల రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.

ఆయనకు వ్యతిరేకంగా నర్సులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్‌-ఎంపీ నవజోత్‌ సింగ్‌ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు.

English summary
The scriptwriter of The Kapil Sharma Show, Ram Abhishek Singh was arrested on charges of murder on Wednesday (August 3). According to the reports, Ram Abhishek Singh alias Kera Singh is a criminal and absconded from UP. Apparently, he had also hidden his identity for the past seven years!!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu