Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రంగంలోకి దిగిన సింగర్స్.. రాహుల్, శ్రీముఖి మధ్యే పోరు.. కౌసల్య, హేమచంద్ర మద్దతు ఎవరికంటే..?
బిగ్‌బాస్ హౌస్ మిగిలిన టాప్ 5 కంటెస్టెంట్లు టైటిల్ కోసం ప్రైజ్ మనీ కోసం పోటీ పడుతున్నారు. పది హేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఒక రీ ఎంట్రీలను తట్టుకుని చివరకు శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా మిగిలిపోయారు. వీరందరిలో అలీ రీఎంట్రీ ఇవ్వడంతో అతనికి కొంత మైనస్ అవుతోంది. షో ముగిసేందుకు రోజులు దగ్గరపడుతుండటంతో ఎవరు విజేతగా నిలుస్తారన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.
జోరుగా కొనసాగుతున్న ప్రచారం..
ఓటింగ్ ముగిసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నారు. తమ తమ అభిమాన కంటెస్టెంట్ల తరుపున ప్రచారం చేస్తూ ఓట్లను కూడగడుతున్నారు. ర్యాలీలు, ఫ్లెక్సీలు కడుతూ తమ అభిమాన కంటెస్టెంట్లకు మద్దతు తెలుపుతున్నారు. ఓట్లు వేసి గెలిపించాలని సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల ఫ్యాన్స్ కోరుతున్నారు.
|
టాప్‌లో ఉన్న రాహుల్, శ్రీముఖి..
ఇప్పటి వరకు వినిపిస్తున్న టాక్ ప్రకారం, నడుస్తున్న ట్రెండ్ ప్రకారం రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి మధ్యే ప్రధాన పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిజాయితీ ఆట ఆడుతూ మనసులో ఏది ఉంటే అదే మాట్లాడుతూ ఉండే రాహుల్‌కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. మా రాహుల్ చిచ్చా బిగ్‌బాస్ విన్నర్ అంటూ అతని ఫాలోవర్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు శ్రీముఖి ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. డ్యాన్సులు, టాస్క్‌లు, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని కోణాల్లో అందరి మనసులను దోచుకుందని తమ రాములమ్మే విజేత అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రాహుల్‌కు సింగర్స్ మద్దతు..
వృత్తిరిత్యా సింగర్ అయిన రాహుల్‌కు ఆ ఫ్యామిలీకి చెందిన నోయన్, కౌసల్యా అతనికి మద్దతు తెలుపుతున్నారు. నోయెల్ అయితే మొదటి నుంచి రాహుల్ వెనకే ఉన్నాడు. రాహుల్ తరుపున విపరీతమైన ప్రచారం చేస్తున్నాడు. అతని తరుపున బిగ్‌బాస్ స్టేజ్‌పైనా దర్శనమిచ్చాడు. తాజాగా సింగర్ కౌసల్యా.. తాను రాహుల్‌కు ఓటు వేశానని తెలుపుతూ అందరూ అతన్ని సపోర్ట్ చేయండంటూ తెలిపింది.
ఇద్దర్నీ సపోర్ట్ చేస్తోన్న గీతా మాధురి, హేమచంద్ర
అయితే సింగర్స్ క్యాటగిరీలో ఉన్నవారంతా ఒక్కరికే మద్దతు తెలపకపోవడం అంతా గందరగోళానికి దారి తీస్తోంది. గత సీజన్లో రన్నర్‌గా నిలిచిన గీతా మాధురి.. ఈ మూడో సీజన్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. టాప్ 5లో నిలిచిన రాహుల్, శ్రీముఖిలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. మీకు నచ్చిన వారికి ఓటు చేయండంటూ పోస్ట్ చేసింది. హేమచంద్ర కూడా అదే వైఖరి అవలంభిస్తూ.. తనకు ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆ ఇద్దర్నీ సపోర్ట్ చేయండంటూ వీడియో ద్వారా తెలిపాడు. ఇలా ఇద్దర్నీ సపోర్ట్ చేయడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు వారి అభిమానులు.