»   » మనసు దోచుకొన్న మధుప్రియ.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అవుతూ..

మనసు దోచుకొన్న మధుప్రియ.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అవుతూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'ఆడపిల్ల' అంటూ తన పాటతో సినీ సంగీతాభిమానులను ఆకట్టుకొన్న గాయని మధుప్రియ బిగ్‌బాస్‌ తెలుగు వెర్షన్‌లో తళుక్కున మెరవడంతో బుల్లితెర వీక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే బిగ్‌బాస్‌లో తోటి సభ్యుల ముందు వెలవెలబోయిన ఈ గాయని ఇంటి నుంచి బయటకు వచ్చింది. కానీ బిగ్‌బాస్‌లో చివరి రోజున ఆమె వ్యవహరించిన తీరు బుల్లితెర వీక్షకుల మనసును దోచుకొన్నది.

  తొలుత ఆకట్టుకోలేకపోయిన మధుప్రియ

  తొలుత ఆకట్టుకోలేకపోయిన మధుప్రియ

  తొలివారంలో అంతగా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మధుప్రియ రెండోవారంలో ఆ వాతావరణానికి కొంత అలవాటు పడినట్టు కనిపించింది. అయితే అంతలోనే ఎలిమినేషన్‌కు నామినేట్ కావడం బిగ్‌బాస్ నుంచి బయటకు రావడం కూడా జరిగిపోయాయి.

  Bigg Boss Telugu : Madhupriya And Sampoornesh Babu Nominated by many for Elimination
  నవ్వడం తక్కువ.. ఏడ్వడం ఎక్కువ

  నవ్వడం తక్కువ.. ఏడ్వడం ఎక్కువ

  బిగ్‌బాస్ హౌస్‌లో మధుప్రియ నవ్వడం తక్కువ.. ఏడ్వడం ఎక్కువపోయింది. వినోద కార్యక్రమంగా రూపొందిన బిగ్‌బాస్ కార్యక్రమం ఆమె ఏడుపులతో తెలుగు సీరియళ్లు కూడా వెలవెలబోయింది. ఏందిరా నాయనా ఈ ఏడుపు అనే మాటలు కూడా బుల్లితెర ప్రేక్షకుల నుంచి వినిపించాయి.

  అందుకే ఎలిమినేషన్‌కు నామినేట్

  అందుకే ఎలిమినేషన్‌కు నామినేట్

  ఇంటి సభ్యులతో మధుప్రియ కలివిడిగా ఉండలేకపోవడం స్పష్టంగా కనిపించింది. కత్తి కార్తీక, సింగర్ కల్పనతోనే చనువుతో మధుప్రియ వ్యవహరించింది. వారితో కూడా ఎక్కువగా రాసుకొని, పూసుకొని ఉన్న సంఘటనలు తక్కువగానే కనిపించాయి. దాంతో బుల్లితెర ప్రేక్షకులకు మధుప్రియపై ఆసక్తి తగ్గింది. అందుకే ఎక్కువ మంది మధుప్రియ ఎలిమినేషన్‌కు ఓటు వేయాల్సి వచ్చిందనే మాట వినిపిస్తున్నది.

  చాలా మంది తగువులాడి..

  చాలా మంది తగువులాడి..

  బిగ్‌బాస్‌ ఇంటిలోని సభ్యుల్లో చాలా మందితో కొన్ని విషయాల్లో గొడవ పెట్టుకొన్నారు. వారితో తగువులాడుకొన్నారు. హోమం వద్ద మంట రాజేసే సమయంలో హరితేజతో జరిగిన గొడవ అనంతరం ఇక ఇక్కడ ఉండటం నా వల్ల కాదు అనే వాదన వినిపించారు. కుటుంబాన్ని వదిలి ఉండలేకపోతున్నాను. అమ్మను చూడాలని ఉంది. ఇలాంటి వాతావరణంలో నేను ఉండలేను. నాకు ఇంటి వాతారణం నచ్చడం లేదు. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించండి అని పలుమార్లు బిగ్‌బాస్‌ను వేడుకొన్నారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి మధుప్రియ బయటకు వచ్చారు.

  అందరికీ పాదాభివందనం

  అందరికీ పాదాభివందనం

  బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లిపోవడం బాధగా ఉందా అని ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తూ.. బిగ్‌బాస్ నుంచి నన్ను ఎలిమినేట్ చేయనందుకు ప్రేక్షక దేవుళ్లకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను. ఏది ఉన్నా లేకపోయానా బతుక వచ్చు. బతుకగలం అని బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది అని తొలి పలుకుతోనే మధుప్రియ ఆకట్టుకన్నది.

   నేను ఆ రకంగా విజయం సాధించా..

  నేను ఆ రకంగా విజయం సాధించా..

  డబ్బు ఉన్నా లేకపోయినా.. మనుషులు ఉన్నా లేకపోయినా.. మానవత్వం ఉన్నా లేకపోయినా, మొబైల్ ఫోన్లు, టెక్నాలజీ లేకపోయినా బిగ్‌బాస్‌లో రెండు వారాలపాటు ఉన్నానంటే అది నేను విజయం సాధించినట్టే అనే మధుప్రియ చెప్పడంతో ఎన్టీఆర్ చప్పట్లతో స్వాగతించారు. కల్పన గారూ అస్వస్థతకు గురైతే ఆమెను కొందరు పట్టించుకోలేదు. కనీసం పలకరించకుండానే ఆమెను చూస్తూ అన్నం తిన్నారు. అప్పుడు అనుకొన్నాను కొంచెం మానవత్వం కూడా లేదాయే అని కార్తీకతో అని బాధపడ్డాను.

  బ్యాడ్ బాయ్ సమీర్

  బ్యాడ్ బాయ్ సమీర్

  బిగ్‌బాస్‌లో చాలా మంది ఆటను బాగా ఆడుతున్నారు. ఈ ఆటలో ధన్‌రాజ్‌కు గెలిచే సత్తా ఉన్నది. అత్యంత బ్యాడ్ క్వాలిటీ ఉన్న వ్యక్తి సమీర్ అని వెల్లడించింది. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో మాత్రం చలాకీగా మాటలు చెబుతూ అందరిని ఆకట్టుకొన్నది. బిగ్‌బాస్ హౌస్‌లోని ప్రతీ ఒక్కరి ప్రవర్తన, వారి మనస్తత్వం గురించి పలకలపై రాయడమే కాకుండా వారికి రేటింగ్ కూడా ఇచ్చింది. అత్యధికంగా కత్తి కార్తీకకు పదికి ఎనిమిదిన్నర మార్కులు, అర్చనకు పదికి ఐదున్నర మార్కులు ఇచ్చారు.

  అర్చనపై బిగ్‌బాంబ్

  అర్చనపై బిగ్‌బాంబ్

  రియాలిటీ షోలో భాగంగా సెలబ్రిటీలపై బిగ్ బాంబును విసిరే ప్రక్రియలో మధుశాల తనదైన శైలిలో వ్యవహరించింది. కల్పనకు అర్చన అన్ని రకాల సేవలు చేయాలని సూచించింది. ఏఏ సేవలు చేయాలో చెప్పాలని ఎన్టీఆర్ సూచించగా.. అందుకు జవాబుగా ఓ రమ్మో.. ఓరి దేవుడో అంటూ దీర్ఘాలు తీసింది. కల్పన ఉదయం లేవగానే ఆమె బెడ్ చక్కగా చేయాలి. ప్లేట్‌లో వడ్డించి అన్నం తినిపించాలి. కల్పనకు కెప్టెన్ సూచించే పనులను కూడా అర్చన చేయాలి అని చెప్పింది.

  చాలా నేర్చుకొన్నాను..

  చాలా నేర్చుకొన్నాను..

  బిగ్ బాస్‌ హౌస్‌ను వదిలి వెళ్లేటప్పుడు భావోద్వేగానికి గురైంది. బిగ్‌బాస్‌లోనే చాలా నేర్చుకొన్నాను. మీ యాక్టింగ్‌కు పాదాభివందనం అంటూ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది. అందుకు జవాబుగా నీ పాటలతో అందరిని ఆలరించాలి. మహిళలకు అండగా నిలిచే విధంగా మీ పాటలు ఉండాలి అని మధుప్రియను ఎన్టీఆర్ సాగనంపారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మధుప్రియ చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ.. అందరిని ఆకట్టుకొన్నారు.

  English summary
  Telugu Version of Bigboss started with High Energy. House filled with emotions. As a bad performer Madhupriya was eliminated from the show. but end of the moments she attracts everyone. She sizzles her behaviour with NTR.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more