For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సునీతకు దారుణ అవమానం: అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి తనే.. సీక్రెట్ రివీల్ చేసి బాధ పడిన సింగర్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఏళ్లుగా తనదైన శైలి పాటలతో అలరిస్తూ.. చాలా కాలంగా నెంబర్ వన్ సింగర్‌గా వెలుగొందుతున్నారు ప్రముఖ గాయని సునీత. అద్భుతమైన స్వరంతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసే ఈమె.. సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వేల పాటలను ఆలపించారు. అదే సమయంలో ఎంతో మందికి గాత్ర దానం చేసి ఔరా అనిపించారు.

  ఇక, ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సునీత.. ప్రస్తుతం 'డ్రామా జూనియర్స్ ద నెక్ట్స్ సూపర్ స్టార్' షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన జీవితంలో జరిగిన దారుణమైన అనుభవం గురించి వెల్లడించారామె. ఇది చెప్తోన్న సమయంలో సునీత కన్నీటి పర్యంతం అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వార్తను పూర్తిగా చదవండి!

  చిన్న వయసులోనే ఎదిగిపోయిన సునీత

  చిన్న వయసులోనే ఎదిగిపోయిన సునీత

  గాయని అవ్వాలన్న లక్ష్యంతో చాలా చిన్న వయసులోనే సంగీతం మీద పట్టు సాధించాలని శిక్షణ తీసుకున్నారు సునీత. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో పాటలు పాడారు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో భాషల్లో కొన్ని వేల పాటలను పాడారామె. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఇలా సుదీర్ఘ కాలంగా తన ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తున్నారు.

  SR Kalyanamandapam Twitter Review: ఇద్దరే నిలబెట్టారు.. మూవీ హైలైట్స్ అవే.. అవి లేకుంటే వేరే లెవెల్

  అప్పుడే వివాహం.. విబేధాలతో విడాకులు

  అప్పుడే వివాహం.. విబేధాలతో విడాకులు

  వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో సింగర్ సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అలా చాలా కాలం పాటు సవ్యంగానే సాగిన వీళ్ల కాపురం.. ఆ తర్వాత మనస్ఫర్థల కారణంతో విభేదాలు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ న్యాయ పరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను తీసుకున్న ఆమె.. వాళ్లను పెంచి పోషిస్తూ వచ్చారు.

  రెండో వివాహం చేసుకున్న సింగర్ సునీత

  రెండో వివాహం చేసుకున్న సింగర్ సునీత

  భర్తతో విడిపోయిన తర్వాత సింగర్ సునీత చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె రెండో పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తుండేవి. కానీ, అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆమె ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అమ్మపల్లిలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో సంబరంగా వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా హాట్ టాపిక్ అయిపోయింది.

  అరాచకమైన ఫొటోలతో సెగలు రేపుతోన్న యువరాజ్ మాజీ ప్రేయసి.. ఇంత ఘాటుగా ఎవరినీ చూసుండరు!

  ఫుల్ యాక్టివ్ అయిన సునీత.. కెరీర్ కూడా

  ఫుల్ యాక్టివ్ అయిన సునీత.. కెరీర్ కూడా

  రామ్‌ వీరపనేని పెళ్లాడిన తర్వాత సింగర్ సునీత జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తన భర్తతో కలిసి సునీత.. భూలోక స్వర్గంగా పేరున్న మాల్దీవులు టూర్ వెళ్లారు. అక్కడి రిసార్టులు, బీచ్‌లలో తెగ ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అలా గతంతో పోలిస్తే ఇప్పుడామె ఎంతో యాక్టిగ్‌గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటున్నారు.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  చేతి నిండా ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సింగర్ సునీత సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు, వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటున్నారు.

  ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం వాళ్ల టచ్‌లో ఉంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. అలాగే, తన అభిప్రాయాలను కూడా నిర్భయంగా చెబుతున్నారు. దీంతో ఈమె ఎన్నో సార్లు వార్తల్లో కూడా నిలిచారు.

  సినీ ప్రియులకు ఇక పండుగే: ఒకేరోజు ఏడు సినిమాలు రిలీజ్.. టాలీవుడ్‌లో తొలిసారి ఈ రేంజ్‌లో!

  సింగర్ సునీతకు దారుణమైన అవమానం

  సింగర్ సునీతకు దారుణమైన అవమానం

  సింగర్ సునీత ప్రస్తుతం 'డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే పిల్లల షోను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఆమెతో పాటు అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా చేస్తున్నాడు. ఇక, వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సీనియర్ కమెడియన్ బాబు మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్‌లో సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటోన్న సమస్యల గురించి పిల్లలు స్కిట్ చేశారు. ఈ సందర్భంగా సునీత తన గతం గురించి రివీల్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి తనే అంటూ

  అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి తనే అంటూ

  పిల్లల స్కిట్‌లో భాగంగా ఓ అమ్మాయిని స్నేహితురాలి తల్లి తీవ్రంగా అవమానిస్తుంది. ఆ తర్వాత ఆఫీస్‌లో బాస్ సూటిపోటి మాటలతో బాధ పెడతాడు. ఇది చూసి సింగర్ సునీత చలించిపోయారు. స్కిట్ తర్వాత ఆమె మాట్లాడుతూ.. 'అందులో చూపించిన ఆంటీలా, ఆఫీస్‌లో బాస్‌లా నా జీవితంలో ఒకరు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే స్వచ్ఛంగా ఎవరైనా ఉంటారా అంటే అది స్నేహితులు మాత్రమే' అంటూ ఎమోషనల్ అయ్యారామె. దీంతో ఇంతకీ సునీత ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్లు చేశారు అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

  English summary
  Telugu Famous Singer Sunitha Now Doing Drama Juniors – The NEXT Superstar Show. She Revealed her Personal Problems In This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X