Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
సమయం చూసి షన్ను మీద ప్రతీకారం తీర్చుకున్న సిరి బాయ్ ఫ్రెండ్.. అప్పుడే పోస్టులు పెట్టి డిలీట్?
షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను బిగ్ బాస్ తెలుగు 5 యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పోటీదారులలో ఒకడు. షణ్ముఖ్ తెలుగు రాష్ట్రాల్లో భారీ అభిమానుల ఫాలోయింగ్ మరియు ప్రజాదరణ కారణంగా బిగ్ బాస్ తెలుగు 5ని గెలుస్తాడని ప్రతి BB తెలుగు వీక్షకుడు భావించారు. షోపై మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగానే షణ్ముఖ్ జస్వంత్ ట్రోఫీని కోల్పోయాడని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ పాత్ర ఎంత? అంటే సింహ భాగమే అంటున్నారు నెటిజన్ లు.. మరి ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

అలాంటి స్నేహమే
బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ నిలిచాడు. రన్నరప్ గా షణ్ముఖ్ నిలిచాడు. నాగార్జున చేతుల మీదుగా సన్నీ ట్రోఫీ అందుకున్న సన్నీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ విన్నర్ అన్న మూమెంట్ మాటల్లో లేదు మచ్చా.. అంటూ ప్రేక్షకులకు పాదాభివందనం చేశాడు. ఇక్కడ వరకు రావడానికి కారణం ప్రేక్షకులే అని.. వాళ్ళని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని అన్నారు.
కప్పు ముఖ్యం బిగిల్ అంటూ మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసిందని చెప్పారు. ట్రోఫీ నాది అంటూ ప్రౌడ్ గా చెప్పేకంటే అని తన తల్లి చేతిలో ట్రోఫీ పెట్టాడు సన్నీ. అందరం ట్రావెల్ చేశాం కానీ షణ్ముఖ్ చాలా కూల్ పర్సన్ అని.. షణ్ముఖ్-సిరి లాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టమని నాది, మానస్ ది కూడా అలాంటి స్నేహమే అని చెప్పుకొచ్చాడు.

సిరి హన్మంత్‌తో ఉన్న సంబంధం కారణంగా
ఇక రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్.. ''ఏం పర్లేదు.. ఏం పర్లేదు.. ఏం పర్లేదు.. విన్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు.. ఎలా ఆడామనేదే ముఖ్యం. నేను అదే నమ్ముతా.. కప్పు ఈరోజు కాకపోతే రేపు.. అమ్మానాన్నను ఇక్కడ వరకు తీసుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పుకొచ్చాడు. అయితే సిరి హన్మంత్‌తో ఉన్న సంబంధం కారణంగా షణ్ముఖ్ ట్రోఫీని కూడా కోల్పోయాడని పుకార్లు షికారు చేస్తున్నాయి.

బాధ పడుతూ కూర్చుంటే
ఎందుకంటే సిరితో ఎక్కువ కనెక్ట్ అయిన షన్ను ఆమెతో హగ్స్ విషయంలో ఆమె తల్లితో మాటలు కూడా పడ్డాడు. దానికి బాధ పడుతూ కూర్చుంటే మళ్ళీ సిరి స్వయంగా వచ్చి హగ్గులు ఇవ్వడంతో కాదనలేక పోయాడు. అయితే ఆమె కారణంగా షన్ను అందరికీ నెగటివ్ అయ్యాడు. అందుకే గత వారం, సిరిని షన్ను ఫాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ఓట్ల కోసం సిరి షణ్ముఖ్‌తో ఉందని ఆమెను దారుణంగా ట్రోల్స్ చేసారు.

ఫినాలే ఎపిసోడ్‌కు రెండు రోజుల ముందు
అయితే ఇదంతా మనసులో పెట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు రెండు రోజుల ముందు, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహన్ షణ్ముఖ్‌ను నిందించాడు, బిగ్ బాస్ హౌస్‌లో సిరి కనుక లేకుండా ఉంటే షణ్ముఖ్ పిచ్చి వాడిలా అయ్యే వాడని, అతను మిగతా వాళ్ళతో అంత తేలికగా కలవడు అని కూడా చెప్పాడు. అంతే కాక తన దగ్గర ఏవో స్క్రీన్ షాట్లు ఉన్నా బయట పెట్టలేదని అన్నాడు.

సిరి బాయ్‌ఫ్రెండ్ కూడా
ఇప్పుడు, చివరి నిమిషంలో శ్రీహాన్ షణ్ముఖ్‌ను నిందించడం గేమ్‌లో ఓడిపోవడానికి ఒక కారణం కావచ్చు అని బిగ్ బాస్ ప్రేక్షకులు అంటున్నారు. షన్ను ట్రోఫీని కోల్పోవడానికి సిరి బాయ్‌ఫ్రెండ్ కూడా ఒక కారణమని బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. షన్ను ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి శ్రీహాన్ ఫైనల్స్ వరకు వేచి ఉన్నాడా అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఫైనల్స్‌కు కేవలం రెండు రోజుల ముందు అతను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు. ఈలోపే అది వైరల్‌గా మారింది, ఇది షన్ను ఇమేజ్‌ను దెబ్బతీసింది, అని వారు భావిస్తున్నారు.

ఫైనల్ గా
అయితే ప్రేక్షకుల నుండి తగినంత ఓట్లు పొందడంలో విఫలమైనందున, షన్ను రేసులో ఓడిపోయాడు. నెటిజన్ల వ్యాఖ్యల ఆధారంగా మనం ఎలాంటి నిర్ధారణలకు వెళ్లలేము. షణ్ముఖ్ ప్రజాదరణ క్షీణించడానికి సరిగ్గా దారితీసినది ఏమిటో మనం ఖచ్చితంగా చెప్పలేము? ఫైనల్ గా చాలా హైప్ క్రియేట్ చేయబడిన తర్వాత షన్ను కప్ గెలవలేక పోయారు.