షణ్ముఖ్, శ్రీహాన్‌లో నాకు ఎవరు కావాలంటే.. షాకింగ్‌గా కామెంట్ చేసిన సిరి హన్మంతు
బిగ్‌బాస్ తెలుగులో హాట్ కంటెంట్‌తో ఆకట్టుకొన్న సిరి హన్మంతు సెన్సేషనల్‌గా మారింది. బిగ్‌బాస్ ఇంటి ప్రయాణంలో షన్నుతో ఎమోషనల్ కంటెంట్ బాగా వైరల్ అయింది. వారిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్ పేలాయి. బిగ్‌బాస్ తెలుగు ఫైనలిస్టులో ఒకరిగా ఘనతను సొంతం చేసుకొన్న సిరి హన్మంతు.. అరియానా గ్లోరితో మాట్లాడుతూ..
Recommended Video

గెలువాలనే పట్టుదలతో
టాప్ 5లో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇంటిలోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లు అందరూ తమకు సంబంధించిన రంగాల్లో టాలెంటెడ్ సెలెబ్రిటీలు. వారందరిని దాటుకొని టాప్ 5లో చేరడం హ్యాపీగా ఉంది. గెలువాలనే పట్టుదలతో ఆడాలని అనుకొన్నాను. కానీ టైటిల్ గెలువాలని ఉన్నప్పటికీ.. గెలిచే అంత సత్తా లేదు. నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే వారి కోసం ఏదైనా చేస్తాను అని సిరి హన్మంతు అన్నారు.

ఆ ముగ్గురితో నాకు మంచి రిలేషన్
బిగ్‌బాస్ ఇంటిలో నాకు ముగ్గురితో మంచి రిలేషన్ ఉంది. షణ్ముఖ్, జెస్సీతోపాటు యాంకర్ రవితో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను ఓ చెల్లెలుగా రవి చూసుకొన్నారు. స్నేహితుడంటే.. మంచి చేస్తే మంచిగా.. చెడు చేస్తే చెడు అని ముఖం మీద చెప్పే వాళ్లే నిజమైన స్నేహితులు. ఒకరికి ప్రాబ్లెం వస్తే.. ఆదుకొనే వాడే నిజమైన స్నేహితుడు అని అభిప్రాయం. ఇంటిలో నేను మానసికంగా చాలా డిప్రెషన్ గురై తలబాదుకోవడం చాలా నాకు మంచిగా అనిపించలేదు అని సిరి హన్మంతు తెలిపారు.

మాది జెన్యూన్ రిలేషన్
షణ్ముఖ్‌తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. మా మధ్య జెన్యూన్ రిలేషన్, ఫ్రెండ్‌షిప్ ఉంది. ఒకరికొకరం చాలా హెల్ప్ చేసుకొన్నాం. షణ్ముఖ్ చేతుల మీదుగా నేను టాప్ 5లో చేరడం నాకు మరిచిపోలేని మూమెంట్. గేమ్‌లో నేను ఒంటరిగానే ఆడాను. రవి ఎలిమినేషన్ నాకు పెద్ద షాక్. నేను నామినేట్ చేయడంతో కొంత బాధపడ్డాను. రవి టాప్ 5లో ఉంటాడని అనుకొన్నాను. కానీ ఆ వారం నాతో గొడవ పడ్డారు. దాంతో రవిని నేను నామినేట్ చేయాల్సి వచ్చింది. రవి ఎలిమినేట్ అయిన తర్వాత చాలా బాధపడ్డాం అని సిరి హన్మంతు అన్నారు.

ఎమోషనల్ బాండింగ్‌తో
షణ్ముఖ్‌తో ఎమోషనల్ బాండింగ్ లేకపోయినా టాప్ 5లో ఉండే దానిని. షణ్ముఖ్ సపోర్ట్ నేను తీసుకోలేదు. వీడు లేకపోతే నేను ఇలా ఆడేదానిని అనుకోలేదు. షన్ను దూరం పెట్టినా నాకు అలా దూరం పెట్టారని అనుకోలేదు. గేమ్ సమయంలో నేను ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. జెస్సీతో కూడా ఎమోషనల్ బాండింగ్ ఉంది. నీవు ఎందుకు బాయ్‌ఫ్రెండ్‌తో కమిట్ అయ్యావు అని ఏడిపించేవాడు. మనసులో ఏమనిపిస్తే అది బయటకు చెప్పేవాడు అని సిరి హన్మంతు చెప్పారు.

సన్నీతో ఎందుకు కనెక్ట్ కాలేకపోయానంటే
బిగ్‌బాస్ హౌస్‌కు రాకముందు వీజే సన్నీ నాకు మంచి ఫ్రెండ్. ఇంట్లోకి వెళ్లిన తర్వాత నాతో చాలా గొడవలు పడ్డారు. ప్రతీ టాస్క్‌లో నాకు సన్నీకి గొడవ జరిగేది. బయట ఫ్రెండ్ అయినప్పటికీ.. ఇంటిలో కనెక్ట్ కాలేకపోయాను. శ్రీరామచంద్రతో పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను. ఇక కాజల్ నాతో బిహేవ్ చేసిన విధానం బాగాలేదు. నన్ను సేవ్ చేస్తానని చెప్పి సన్నీని కాపాడింది. అప్పటి నుంచే ఆమెతో నాకు కుదర్లేదు. వాళ్లిద్దరూ కంటెంట్ ఇవ్వడానికే వచ్చారు. బరాబర్ ఇస్తున్నారని మానస్ అనడం నేను చాలా హర్ట్ అయ్యాను అని సిరి హన్మంతు అన్నారు.

షన్ను, శ్రీహాన్ ఎవరు కావాలంటే..
షణ్ముఖ్ జస్వంత్, ఛోటూ (శ్రీహాన్)లో ఎవరో ఒకరు కావాలంటే నేను శ్రీహాన్ కావాలని కోరుకొంటాను. శ్రీహాన్‌తో నా అనుబంధం వేరు, రిలేషన్ వేరు. నా జీవితంలోకి ముందుగా వచ్చాడు. షణ్ముఖ్ లేటుగా వచ్చినా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇద్దరికి నా ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రీహాన్ వదిలేస్తావా? అని అడిగినప్పుడు బయట ఏదో తెలియనిది జరుగుతుంది అనే ఫీలింగ్ కలిగింది అని సిరి హన్మంతు వెల్లడించింది.


Click it and Unblock the Notifications











