For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షన్ముఖ్-దీప్తి బ్రేకప్ గురించి నోరు విప్పిన సిరి.. నాకు షన్నుకి అది కాస్త ఎక్కువైంది, కానీ అంత వీక్ కాదంటూ!

  |

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. స్నేహితులం అని చెప్పుకునే వీరిద్దరు హగ్గులు తీసుకున్న విధానం చూసి చాలా మంది వారిద్దరిని చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన అయితే బ్రేక్ అప్ చెప్పింది. తాజాగా ఈ బ్రేకప్ వ్యవహారం మీద సిరి హనుమంతు నోరు విప్పింది.. ఆ వివరాల్లోకి వెళితే

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి

  షణ్ముఖ్ జస్వంత్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన షణ్ముఖ్ జస్వంత్ ముందుగా కవర్ సాంగ్స్ చేసే వాడు.. ఆ తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలు పెట్టి వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సిరి హనుమంతు కూడా దాదాపు అలాగే తన కెరీర్ ప్రారంభించింది. ఆమె నటిగా నిలదొక్కుకోవడం కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు వచ్చింది. ఇద్దరూ కూడా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి ఎంపికయ్యారు.

  ఎందుకు చెప్పిందో తెలియదు

  ఎందుకు చెప్పిందో తెలియదు

  ముందు హౌస్ లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇద్దరూ తమకు ఒకరంటే ఒకరికి పడదు అన్నట్లు జనానికి కలరింగ్ ఇద్దామనుకున్నారు కానీ ఆ తర్వాత మేము స్నేహితులమే అని ఓపెన్ అయిపోయారు. అంతేగాక ఒకరంటే ఒకరు విడవ లేని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయారు. ఈ సమయంలో లోపలికి వచ్చిన సిరితల్లి మీరిలా హగ్గులు ఇచ్చుకోవడం బయటకు చూసేవాళ్ళకి ఏమాత్రం బాలేదని షణ్ముఖ్ జస్వంత్ ముఖం మీద చెప్పింది. ఆమె ఎందుకు చెప్పిందో తెలియదు కానీ ఆమె చెప్పిన తర్వాత సిరి హనుమంత ఇంకా ఎక్కువగా ఇవ్వడం మొదలు పెట్టింది.

  బ్రేక్ అప్

  బ్రేక్ అప్

  ఆఖరికి సిరి ప్రియుడు శ్రీహాన్ హౌస్ లోపలి వచ్చి నేనొకడ్ని ఉన్నానని గుర్తు పెట్టుకోమనే అర్ధం వచ్చేలా కోరడం అందరినీ కదిలించింది. ఇక వీళ్ళ హగ్గుల వ్యవహారం చూసేవాళ్లకు కూడా వెగటు పుట్టించడంతో చాలా మంది చాలా రకాలుగా ఈ వ్యవహారాన్ని ట్రోల్ చేస్తూ వచ్చారు. కానీ షణ్ముఖ్ జస్వంత్ లోపల ఉన్నంతవరకు అతనికి సపోర్ట్ చేస్తూ వచ్చిన దీప్తి సునైనా అతను బయటకు వచ్చిన పది రోజుల తర్వాత అతనితో తన రిలేషన్ కి బ్రేక్ అప్ చెబుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.

  అది కాస్త ఎక్కువైంది

  అది కాస్త ఎక్కువైంది

  దానికి షణ్ముఖ్ జస్వంత్ కూడా ఆమె చాలా రకాల ఇబ్బందులు పడింది ఇకమీదట అయినా సంతోషంగా ఉంటే అదే నాకు చాలు అన్నట్లుగా ఆ విషయం మీద స్పందించాడు. ఇక తాజాగా ఈ విషయం మీద సిరి హనుమంతు స్పందించింది. తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ తనపై ట్రోలింగ్ రావడంతో డిప్రెషన్‌కి గురయ్యానని సిరి చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజుల్లో కంటెస్టెంట్స్ మధ్య చాలా ఎమోషన్స్ ఉంటాయని అదే తనకు, షణ్ముఖ్ మధ్య అది కాస్త ఎక్కువైందని చెప్పుకొచ్చింది.

  లవ్ వీక్ కాదు

  లవ్ వీక్ కాదు

  కానీ అది కేవలం హౌస్ వరకు మాత్రమేనని పేర్కొంది. షణ్ముఖ్, దీప్తి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని ఇక వారిద్దరూ తనవల్ల విడిపోయారని అనడం సరికాదని ఆమె చెప్పుకొచ్చింది. వారి లవ్ కేవలం వంద రోజుల్లో విడిపోయేంత వీక్ కాదని తెలిపింది. సోషల్ మీడియాలో పుట్టించిన వాటిని తాను పుకార్లుగానే పరిగణిస్తా అని కూడా సిరి చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే షణ్ముఖ్‌ జశ్వంత్‌‌‌‌, దీప్తి సునయన మళ్ళీ కలుస్తారని, కానీ దానికి కొద్దిగా సమయం పడుతుందని షణ్ముఖ్‌ తండ్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

  English summary
  Siri Hanmanth responds on Shanmukh Jaswanth and deepthi sunaina breakup.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X