Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఏమి అనుభవించానో నాకు మాత్రమే తెలుసు.. సోల్ మేట్ గురించి సిరి ఆసక్తికర వ్యాఖ్యలు.. బ్రేకప్ అయినట్టేనా?
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సిరి హనుమంతు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు, సీరియల్స్ చేసే ఆమె అనుకోకుండా అవకాశం దక్కించుకొని బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. అయితే ఆ షో ద్వారా పాపులారిటీ దక్కించుకోవాలిసింది పోయి అనవసరమైన నెగిటివిటీ మాత్రం దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ప్రియుడు శ్రీకాంత్ దూరంగా ఉంటున్న ఆమె ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

మైనస్ అయి
బిగ్బాస్ సీజన్ 5లో అందరికంటే ఎక్కువగా నెగిటివిటి మూటగట్టుకున్నారు షణ్ముఖ్, సిరి. హౌస్ లో ప్రతి రోజూ సిరి, షణ్ముఖ్ హగ్గులు, ముద్దులు చూసి చూసి ప్రేక్షకులు చీదరించుకునే పరిస్థితి. సిరి మొదటి నుంచి కూడా షణ్ముఖ్ జస్వంత్ తో ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటూ రావడం మైనస్ అయింది. సిరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక హైలెట్ కాబోతోంది అని ప్రశంసలు అందుకుంది.

నెగిటివ్ కామెంట్స్
కానీ ఆమె క్యారెక్టర్ ను చూసిన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఏకంగా సిరి తల్లి లోపలికి వచ్చి ఈ దరిద్రం ఆపండి అని హెచ్చరిక చేసే వరకు వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సిరి మధ్యలో ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ చాలా తెలివిగా టాస్క్ లు పూర్తి చేస్తూ టాప్ 5 కి చేరింది.

త్వరలోనే బ్రేకప్
షో ముగిసిన తర్వాత షన్ను-దీప్తి బ్రేకప్ చెప్పుకోగా ఇదే బాటలో సిరి, శ్రీహాన్ లు.. త్వరలోనే బ్రేకప్ చెప్పుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీని మీద అధికారిక ప్రకటన వెలువడలేదు. బిగ్ బాస్ సీజన్ 5లో ఇమేజ్ డ్యామేజ్ కావడంతో కొన్నాళ్ల నుంచి సిరి హనుమంత్ సైలెంట్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా తన యాక్టివ్‌నెస్ తగ్గించేసిన ఈ భామ ఇప్పుడు మళ్ళీ హడావుడి చేయడం మొదలు పెట్టింది.

మేడ్ ఫర్ ఈచ్ అదర్
తన బిగ్ బాస్ మేట్ జెస్సీతో కలిసి రీల్స్ చేయడం మొదలు పెట్టింది.ఆలా ఆమె ఒక రీల్ చేసింది. 'నువ్వు కాల్ చేస్తే నేను కట్ చేసే పొజిషన్ నుంచి.. నేను కాల్ చేస్తే నీకు బిజీ వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్థమైంది. నువ్వు దేన్నో గోకుతున్నావ్ అని. ఎనీవే నేను నీకు దొరకడం నీ అదృష్టం.. నువ్వు ఇంకోదాన్ని తగులుకోవడం నా అదృష్టం.. నీకు సిగ్గులేదు.. దానికి బుద్ధి లేదు.. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ సిరి-జెస్సీలు పెర్ఫామెన్స్‌తో ఇరగదీసేశారు.
Recommended Video

నాకు మాత్రమే తెలుసు
ఆ రీల్ బాగా వైరల్ అయింది. అయితే ఆమె తాజాగా మరో రీల్ చేసింది. అందులో మీ సోల్ మేట్ ఎక్కడ ఉన్నారు? అని అడిగిన ప్రశ్నకు మీతోనే ఉన్నారని పేర్కొంది. దానికి ప్రజలు నా గురించి ఏమి చెప్పినా నేను పట్టించుకోను, నా కథ నాకు మాత్రమే తెలుసు, నేను ఏమి అనుభవించానో నాకు మాత్రమే తెలుసు, నేను నిజమైన వ్యక్తిగా పుట్టాను మరియు అందరినీ మెప్పించడానికి కాదు !! అంటూ కామెంట్ కూడా చేసింది.