పెళ్లికి ముందే బ్రేకప్.. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బు అలా ఖర్చు చేశా: బిగ్ బాస్ 1 విన్నర్ శివ బాలాజీ

నటుడిగా పలు సినిమాలతో ఒకప్పుడు మంచి క్రేజ్ అందుకున్న శివబాలాజీ బిగ్ బాస్ ద్వారా మరో లెవెల్లో గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. అయితే శివబాలాజీ నటుడిగా క్రేజ్ బాగానే అందుకున్నప్పటికి అవకాశాలు మాత్రం అనుకున్నంత రేంజ్ లో అందుకోలేదు. అంతే కాకుండా మధ్యలో ఒక సినిమాను నిర్మించి కాస్త దెబ్బతిన్నాడు కూడా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శివబాలాజీ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు.

Leaked Shocking Pictures of Indian Celebs Photos

బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా

బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో శివబాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. జనాల్లో మంచి క్రేజ్ కూడా అందుకున్న శివబాలాజీ ఆ తరువాత ఇండస్ట్రీలో కూడా మళ్లీ నటుడిగా బిజీ అవ్వాలని అనుకున్నాడు కానీ ఆ ఫేమ్ అతనికి అవకాశాలు పెద్దగా అంధించలేదు.

అలీతో సరదాగా షోలో..

అలీతో సరదాగా షోలో..

శివబాలాజీ భార్య మధుమిత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళ్ తెలుగు సినిమాలతో ఆమె కూడా మంచి క్రేజ్ అందుకున్నవారు. అయితే చాలా రోజుల తరువాత ఈ జంట ఒకటిగా కనిపించి అలీతో సరదాగా షోలో సందడి చేశారు. వారి లవ్ స్టోరీని అలాగే పెళ్లికి ముందు జరిగిన సంఘటనలను గురించి చెప్పుకున్నారు.

పెళ్లికి ముందే బ్రేకప్

పెళ్లికి ముందే బ్రేకప్

నిజానికి మాకు పెళ్లి కంటే ముందే బ్రేకప్ అయ్యిందని చెప్పున శివబాలాజీ అదొక బాధాకరమైన సంఘటన అని అన్నాడు. నాపై ఇష్టం కలిగేలా చేసిన నేను చివరికి జాతకాలు కలవడం లేదని చెప్పాను. పరిస్థితులు సహకరించకపోవడం వలన డిస్టన్స్ పెరిగింది. ఏడాది వరకు దూరంగానే ఉన్నాము. ఆ గ్యాప్ లో తనకు పెళ్లి సెట్టయితే వదిలేద్దాం అనుకున్నాను. కానీ జాతకాలు మళ్ళీ చూపించడంతో సెట్టయ్యాయి. వెంటనే మూడు ముళ్ళు వేశానని శివబాలాజీ వివరణ ఇచ్చారు.

Recommended Video

Dirty Hari Movie Trailer | చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వం లో..!!
నిర్మాతగా సమస్యలు..

నిర్మాతగా సమస్యలు..

శివబాలాజీ బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను డబ్బును ఒక సినిమాకు ఉపయోగించి హిట్ అందుకోవాలని అనుకున్నాడు. స్నేహమేరా జీవితం అనే సినిమాను మొదట వేరే నిర్మాత మొదలు పెట్టినప్పటికి అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయాడు. దీంతో శివబాలాజీ బిగ్ బాస్ లో గెలిచిన 50లక్షలను ఆ సినిమా కోసం ఖర్చు చేయగా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ సినిమా విడుదల విషయంలో నటుడు రాజీవ్ కనకాల కొంచెం సపోర్ట్ కూడా చేసినట్లు చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X