Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అభిజిత్ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి.. నాకు అలాంటివి నచ్చవు.. లైవ్‌లో సోహెల్ కామెంట్స్
బిగ్ బాస్ షోలో సోహెల్, మెహబూబ్ చేసిన స్కాం వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మెహబూబ్ ఏదో సిగ్నల్ ఇచ్చాడని, దాని వల్లే 25 లక్షల డబ్బు తీసుకుని బయటకు వచ్చాడని ట్రోల్స్ నడిచాయి. అయితే వాటిపై సోహెల్ క్లారిటీ ఇచ్చాడు. ట్రోల్స్ చేస్తోన్న అభిజిత్ ఫ్యాన్స్ వేడుకున్నాడు. తప్పు చేయనప్పుడు తనను ఎవరైనా ఏదైనా అంటే సమాధానం ఇచ్చుకోవాల్సిన బాధ్యత తనది అంటూ లైవ్‌లోనే క్లారిటీ ఇచ్చాడు.

లైవ్‌లో సోహెల్ రియాక్షన్..
సోహెల్ లైవ్‌లోకి వచ్చి.. మెహబూబ్ ఇచ్చిన హింట్‌పై స్పందించాడు. అదేదో స్కాం వీడియో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. అది నిజం కాదు.. నా పదేళ్ల కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా అందులో ఎలాంటి నిజం లేదని సోహెల్ క్లారిటీ ఇచ్చాడు.

ఫ్యాన్స్ వార్ వద్దు..
అభిజిత్ అభిమానులు ఈ విషయం అర్థం చేసుకోండి.. అందులో ఎలాంటి నిజం లేదు.. అభిజిత్ గెలవడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది.. మేమంతా బాగానే ఉన్నాం.. మేం స్నేహితులమే.. అభిజిత్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ గొడవలు పడకండని సోహెల్ కోరాడు.

నాకు అలాంటివి నచ్చవు..
ఫ్యాన్స్ అలా కొట్టుకోవడం, కామెంట్లతో తిట్టుకోవడం నాకు నచ్చదు.. అందరూ పాజిటివ్ స్ప్రెడ్ చేయాలి.. ప్రేమను పంచాలని సోహెల్ చెప్పుకొచ్చాడు. ఇక నేను చెప్పాల్సింది.. చెప్పాను.. మీరు అర్థం చేసుకుని శాంతించండి.. అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు.

అభిజిత్‌తో ముచ్చట్లు..
అభిజిత్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఉండగా సోహెల్ కూడా లైవ్‌లొకి వచ్చాడు. ఇదే వీడియో గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మనం బాగానే ఉన్నాం.. మన ఫాలోవర్స్, ఫ్యాన్స్ మాత్రం అలా కొట్లాడుతున్నారు.. నీ ఫ్యాన్స్‌కి నువ్ చెబితే కూల్ అవుతారు అభి అంటూ వివాదాని పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంచేశాడు సోహెల్.

కలిసి పార్టీలు..
ఫాం హౌస్‌లోపార్టీ ఎప్పుడు చేసుకుందాం అంటూ అభిజిత్‌తో సోహెల్ క్లోజ్‌గా ఉన్నట్టు అందరికీ చెప్పకనే చెప్పేశాడు. మిస్టర్ కూల్‌తో బిగ్ బాస్‌లో ఉన్నందుకు, నా ఫ్రెండ్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ.. అభిజిత్ ఫ్యాన్స్‌ను కూల్ చేసేందుకు సోహెల్ ప్రయత్నించాడు.