»   » 2000 వేల కోట్లకు, ఛానెల్ ని అమ్మకానికి పెట్టిన జీ టీవి

2000 వేల కోట్లకు, ఛానెల్ ని అమ్మకానికి పెట్టిన జీ టీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిల్లీ: ఛానెళ్లు కొనుగోళ్లు, అమ్మకాలు, ఇండియన్ టెలివిజన్ రంగంలోనూ చాలా కామన్ విషయాలుగా మారుతున్నాయి. పెద్ద ఛానెల్స్ లాభసాటి బేరాలకు కొత్త ఛానెల్స్ ని తమలో కలుపుకోవటం, భారం అనిపించే ఛానెల్స్ ని అమ్మేయడం చేస్తున్నాయి.

Sony likely to buy Ten Sports from Zee for about Rs 2000 cr

తాజాగా ఇండియా మీడియా రంగంలో మరో భారీ అమ్మకానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జడ్‌ఈఈఎల్‌) టెన్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ను వెల్లడించిన ధరకు అమ్మకానికి పెట్టింది. ఈ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు జీ సంస్థ బీఎస్‌ఈకి తెలిపింది.

కాగా ఛానళ్లను ఎవరికి విక్రయిస్తున్నారనేది మాత్రం రహస్యంగా ఉంచింది. దీనికి సంబంధించిన ఆర్థిక వివరాలను సైతం సంస్థ వెల్లడించలేదు.

Sony likely to buy Ten Sports from Zee for about Rs 2000 cr

టెన్‌ స్పోర్ట్స్‌ను రూ.2000 కోట్లకు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దుబాయ్‌కి చెందిన అబ్దుల్‌ రహ్మాన్‌ తాజ్‌ గ్రూప్‌ నుంచి టెన్‌స్పోర్ట్స్‌ను జీ సంస్థ 2006లో కొనుగోలు చేసింది.

English summary
Sony is likely to buy Ten Sports from Zee Entertainment for nearly Rs 2,000 crore, reports CNBC-TV18 and the deal could be announced this week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu