Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రొమాన్స్‌లో మునిగితేలారు.. ‘బొమ్మ అదిరింది’లో శ్రీముఖి జానీ మాస్టర్ రచ్చ
ప్రస్తుతం బొమ్మ అదిరింది షో ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ కంటెంట్ విషయంలో జబర్దస్త్ షోను మించిపోయిందనే అపవాదు మూటగట్టుకున్నా సరే బొమ్మ అదిరింది మాత్రం బాగానే క్లిక్ అయింది. అదిరింది షోకు చేసిన రిపేర్లు బాగానే పని చేశాయి. అదిరిందికి వర్షెన్ 2.ఓగా వచ్చిన బొమ్మ అదిరింది ప్రస్తుతం జనాల్లోకి బాగా ఎక్కేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో బాగానే వైరల్ అవుతోంది.

వారితో వైరల్..
బొమ్మ అదిరింది షోలో శ్రీముఖి, జానీ మాస్టర్, డ్యాన్సర్ పండు, గల్లీ బాయ్స్ అందరూ కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. వీరి కాంబోలో వచ్చే స్కిట్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అవుతుంటాయి. ముఖ్యంగా డ్యాన్సర్ పండు లవ్ అండ్ కామెడీ ట్రాక్ బాగా వైరల్ అయింది.

రియాజ్ రచ్చ..
బొమ్మ అదిరింది బాగా క్లిక్ అవ్వడానికి మరో కారణం.. రియాజ్ వేసే స్కిట్లు. మొదటి ఎపిసోడ్‌లో వైఎస్ జగన్‌లా ఇమిటేట్ చేయడంతో ప్రపంచమంతా ఫేమస్ అయ్యాడు. జగన్ అభిమానులు రియాజ్ బాగా ఆడుకున్నారు. అలా రియాజ్ ప్రతీ వారం వేసే స్కిట్లు ఓ రేంజ్‌లో పేలుతుంటాయి.

ఇక రొమాంటిక్ ట్రాక్..
బొమ్మ అదిరిందిలో రొమాంటిక్ ట్రాక్ శ్రీముఖి జానీ మాస్టర్, పండు, గెస్ట్‌లు, లేడీ డ్యాన్సర్లతో రొమాంటిక్ ట్రాకులు బాగానే నడిపిస్తుంటారు. పండు అప్పుడప్పుడు శ్రీముఖి, జానీ మాస్టర్‌లపై పరోక్షంగా కామెంట్లు చేస్తుంటారు. తన పెళ్లి గోలతో పండు చేసే కామెడీలో రొమాంటిక్ ట్రాక్‌ను మిక్స్ చేస్తుంటారు.

తాజాగా అలా..
తాజాగా శ్రీముఖి జానీ మాస్టర్‌లపై ఓ ప్రోమోను వదిలారు. గుండెల్లో ఏముందో అనే రొమాంటిక్ పాటకు.. జానీ మాస్టర్, శ్రీముఖి కూల్ స్టెప్పులు వేశారు. మోస్ట్ రొమాంటిక్ పెయిర్ అనేట్టుగా ఈ ఇద్దరూ డ్యాన్స్ అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.