For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Elimination షాకింగ్.. మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన శ్రీసత్య?.. ఎప్పుడోకావాల్సింది అంటూ!

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికీ ఈ సీజన్ 101 రోజులు 102 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించేందుకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇన్ని రోజుల్లోఅనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, రొమాన్సులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే సాగింది ఈ సీజన్. అలాగే టాప్ లో ఉండే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయి ఇంటి బాట పట్టారు. తాజాగా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా బ్యూటిఫుల్ కంటెస్టెంట్, రామ్ పోతినేని వీరాభిమాని శ్రీసత్య ఎలిమినేట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

  21 మంది సెలబ్రిటీల ఎంట్రీ

  21 మంది సెలబ్రిటీల ఎంట్రీ

  వరుస పెట్టి సీజన్లతో ముందుకు సాగుతున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆరో సీజన్ ను సెప్టెంబర్ 4న ప్రారంభించారు. ఈ 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, సీరియల్ నటి శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు.

  హౌజ్ లో ఆరుగురు..

  హౌజ్ లో ఆరుగురు..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 14 వారాలకు 15 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. తాజాగా 12వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంచారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్ 13 మంది వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు మాత్రమే మిగిలారు.

  గ్రాండ్ ఫినాలే ఐదుగురే..

  గ్రాండ్ ఫినాలే ఐదుగురే..

  బిగ్ బాస్ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మిగిలి ఉన్న ఆరుగురు ఇంటి సభ్యులను ఫినాలే వారంలోకి పంపించారు. అయితే, వీళ్లలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అదే రోజు నుంచి ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంటే.. గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు సభ్యులే ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

  డిసెంబర్ 18న విజేత ప్రకటన..

  డిసెంబర్ 18న విజేత ప్రకటన..

  ప్రస్తుతం ఈ బిగ్ బాస్ తెలుగు ఆరో సీన్ లో టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి (మిడ్ వీక్) ఎలిమినేషన్ ప్రక్రియ బుధవారం రాత్రి జరగబోతుందని కూడా నాగార్జున వెల్లడించాడు. అప్పటి నుంచి టాప్ 5 సభ్యులకు మాత్రమే ఓటింగ్ జరగబోతుంది. వీళ్లలో ఫైనల్ టైటిల్ విన్నర్ ను నిర్ణయించే ఎపిసోడ్ మాత్రం వచ్చే ఆదివారం (డిసెంబర్ 18వ తేదీ) సాయంత్రం ఆరు గంటలను నుంచి ప్రసారం కాబోతుంది.

  చికెన్ అంటే ప్రాణం..

  చికెన్ అంటే ప్రాణం..

  ఇక బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా హౌజ్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ శ్రీ సత్య అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓటింగ్ పోల్స్ లో కూడా చూసుకుంటే చివరి స్థానంలో సత్య ఉన్నట్లే తెలుస్తోంది. సీరియల్ నటిగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ సత్య చికెన్ అంటే పడి చస్తుందని చాలా సార్లు అనిపించుకుంది. అలాగే ఫుడ్ అంటే ఎంతో ఇష్టమున్న శ్రీసత్య తిండిబోతు, సోమరిపోతుగా కూడా సరదాగా అనిపించుకుంది.

  వెటకారంతో నెగెటివిటీ..

  వెటకారంతో నెగెటివిటీ..

  సీజన్ ప్రారంభంలో సైలెంట్ గా ఉన్న శ్రీసత్య తర్వాత తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆమె వెంట అర్జున్ కల్యాణ్ ఎంత పడినా తను మాత్రం హద్దుల్లో ఉంది. కానీ అతన్ని హౌజ్ లో గేమ్ పరంగా శ్రీసత్య బాగా వాడుకుందని విమర్శలు వినిపించాయి. అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయ్యాక రేవంత్, శ్రీహాన్ లతో మంచి ఫ్రెండ్ షిప్ బాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే నామినేషన్స్ లో, టాస్క్ లలో వెటకారం చూపించి ప్రేక్షకుల్లో విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది.

  ఎప్పుడెప్పుడూ వెళ్తుందా అని..

  ఎప్పుడెప్పుడూ వెళ్తుందా అని..

  ఫ్యామిలీ వీక్ నుంచి తన ఆట, ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఏమాత్రం కూడా వెటకారం చూపించకుండా టాస్క్ లలో అద్భుతంగా ప్రదర్శన కనబర్చింది. అయితే ఆమె చూపించిన వెటకారాన్ని భరించలేని ప్రేక్షకులు ఆమె ఎప్పుడెప్పుడు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతుందా అని ఎదురుచూశారు. కానీ ఈ సీజన్ లో ప్రేక్షకులు ఓటింగ్ ను బట్టి కాకుండా బీబీ టీమ్ ఫేవరెట్స్ ని బట్టి, ఒక ప్లాన్ ప్రకారం ఎలిమినేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గత వారం ఇనయాను ఎలిమినేట్ చేసి ఇప్పుడు శ్రీసత్యను కూడా ఎలిమినేట్ చేయడం అందులో భాగంగానే ఇప్పటివరకు శ్రీసత్యను ఉంచి మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

  English summary
  Bigg Boss Telugu 6: Sri Satya Eliminated On 15th Mid Week Elimination Over Grand Finale Week
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X