»   »  సుకుమార్ తో రాజమౌళి ఇంటర్వూ

సుకుమార్ తో రాజమౌళి ఇంటర్వూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '1'నేనొక్కడినే పై రాజమౌళి ప్రశంసలు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన మరో అడుగు ముందుకేసి సినిమా ప్రమోషన్ లో భాగంగా సుకుమార్ ని ఇంటర్వూ చేస్తున్నారు. ఈ ఇంటర్వూ ఈ రోజు మాటీవిలో 11.30 కు టెలీకాస్ట్ కానుంది.

ఓటమి అంటూ ఎరుగని హిట్ చిత్రాల దర్శకుడిగా,ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాలు తీసే దర్శకుడిగా రాజమౌళి పేరుంది. మరి అలాంటి దర్శకుడు ఏదైనా సినిమా చూసి బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తే.....ప్రేక్షకుల్లోనూ ఆ సినిమాపై ఆసక్తి కలుగడం మామూలే. గతంలో రాజమౌళి ప్రశంసలు అందుకున్న సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్టయ్యాయి. మంచి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు.

SS Rajamouli interviews Sukumar about 1 Nenokkadine

రాజమౌళి ట్వీట్ చేస్తూ...' రివ్యూలకు సంభంధం లేకుండా నేను సినిమాని బాగా ఎంజాయ్ చేసాను(ఛేజ్ సీన్స్ తప్ప). సుకుమార్ మరోసారి నాకు ఫేవెరెట్ అయ్యారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,రత్నవేల్ విజువల్స్ ఎక్సటార్డినరీగా ఉన్నాయి.నాజర్ ,కెల్లీ చనిపోయే సీన్స్, మహేష్ తల్లితండ్రులను వెతికే సన్నివేశాలు నా బెస్ట్ మూమెంట్స్. అలాగే ఇప్పటివరకూ మహేష్ చేసిన వాటిల్లో పోకిరీలో నాజర్ మరణం తర్వాత చేసేదే బెస్ట్ ఫెరఫార్మెన్స్. అయితే వన్ క్లైమాక్స్ ఇంకా బెటర్ గా ఉంది" అన్నారు.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, దర్శకత్వం : సుకుమార్.

English summary
SS RAJAMOULI has interviewed One [Nenokkadine] film director: SUKUMAR for a special program by Maa Tv. Sukumar speaks in detail about the technology they have used for Nenokkdine and also about the film’s hero, heroine, music and producers. The telecast will be done on 15th jan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu