»   » టీవీ సీరియల్ ని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి

టీవీ సీరియల్ ని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇప్పుడు ఈటీవీ త్వరలో ప్రసారం కానున్న మేఘమాల సీరియల్ ప్రమోషన్ కి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆయన వీడియో బైట్ ని ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. రాజమౌళి మాట్లాడుతూ...సినిమా అనేది రంగుల ప్రపంచం. చాలా కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్...ఏ కథకైనా సరే.. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తోంది మేఘమాల..ఈటీవిలో ...మీరు ఇష్టపడతారని ఆశిస్తున్నాను అన్నారు. దగ్గుపాటి రానా సైతం ఈ చిత్రం కోసం ప్రమోషన్ వీడియాకు బైట్ ఇచ్చి సహకరించారు.

ఇక ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

SS Rajamouli

ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని,విశ్వరూపం ప్రదర్శశిస్తోంది.

English summary
Meghamala, new TV serial which will soon be aired on ETV cameout with the official teaser. Though nothing much cameout, ace director Rajamouli and hot hunk Rana came out to promote the serial.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu