బాధాకర విషయమే, కానీ చెప్పక తప్పడం లేదు: యాంకర్ సుమ
Recommended Video

యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న 'స్టార్ మహిళ' కార్యక్రమం దశాబ్ద కాలంగా ప్రసారం అవుతూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. సుధీర్ఘ కాలం పాటు సాగిన ఈ షోకు త్వరలో ముగింపు పలకనున్నారు. ఈ విషయం బాధాకరమే అయినా చెప్పక తప్పడం లేదు అంటూ సుమ ఓ వీడియో పోస్టు చేశారు. ఈ షోను ఆపడం నాకు కూడా బాధగానే ఉందని చెబుతూనే, నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో కూడా చెప్పే ప్రయత్నం చేశారు.

ముగింపు పలుకుతున్నాం
సుమ మాట్లాడుతూ... ‘ఏకదాటిగా 12 సంవత్సరాల నుండి ఈ లేడీస్ గేమ్ షో రన్ చేస్తున్నాం. ఇది వన్ అండ్ ఓన్లీ లేడీస్ గేమ్ షోగా ఇండియాలో పేరు తెచ్చుకుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అయితే వినూత్నమైన కార్యక్రమాలను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతానికి స్టార్ మహిళకు ఒక చిన్న ముగింపు పలుకుతున్నామని సుమ తెలిపారు.

బాధ కలుగుతుంది కానీ...
ఈ విషయం మీకు కొంచెం బాధ కలుగిస్తుందని తెలుసు, ఎందుకంటే స్టార్ మహిళ మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అవుతుంది. మీ పిల్లలకు అన్నం తినిపిస్తూ, లేదా మీరు భోజనం చేస్తూ సరదాగా చూస్తూ గడిపే టైం. ఈ కార్యక్రమంతో మీకు మంచి అనుబంధం ఏర్పడింది అని సుమ గుర్తు చేసుకున్నారు.

మీ ప్రేమను వీడియో రూపంలో
మీరు స్టార్ మహిళ అభిమానులైతే, స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రేమించిన ప్రేక్షకులైనట్లయితే, నేనంటే ఇష్టపడే ప్రేక్షకులు అయినట్లయితే ఒక చిన్న వీడియోను, మీ ప్రేమను మాకు పంపించండి. బెస్ట్ వీడియోస్‌ను గ్రాండ్ ఫినాలెలో ప్రసారం చేయడం జరుగుతుంది.
నా గుండెల్లో దాచుకుంటా
ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్లందరినీ నాకు చాలా దగ్గర చేసినటువంటి ఏకైక కార్యక్రమం స్టార్ మహిళ. నేనెప్పటికీ ఈ కార్యక్రమాన్ని నా గుండెల్లో దాంచుకుంటాను అని సుమ తెలిపారు.


Click it and Unblock the Notifications











