»   » నడిరోడ్డుపై మీడియాపై సుడిగాలి సుధీర్ వీరంగం

నడిరోడ్డుపై మీడియాపై సుడిగాలి సుధీర్ వీరంగం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ఫేమ్ కమిడయన్స్ అంతా ఏదో విదంగా తమదైన శైలిలో నోరు జారి లేదా వింత చేష్టలతో వివాదంలో ఇరుక్కుంటున్నారు. తాజాగా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యి ఇప్పుడిప్పుడే సినిమాల్లో చిన్న చిన్న కామెడి వేషాలు వేషాలు వేస్తున్న ఆయన నిన్న రాత్రి మీడియాపై ఇదిగో ఇలా రెచ్చిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..సుడిగాలి సుధీర్.. నిన్నరాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డుపై హల్ చల్ చేసారు. తన కారుని ఢీ కొట్టారంటూ హాస్పటిల్ కు వెళ్తున్నవారిపై దాడి చేసారు.

Sudigaali Sudheer hungama at Hyderabad road

క్షమించమని కాళ్లు పట్టుకుని వేడినా వదలలేదు. దాంతో నడిరోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిపోయింది. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ విరుచుకుపడ్డాడు. ఈలోగా ఇదంతా అటుగా వెళ్తున్న ఓ మీడియా ఛానెల్ వాళ్లు రికార్డ్ చేస్తూండటంతో కోపం వచ్చి బూతులు మొదలెట్టాడు.

మీరు మీడియా అయితే ఏంటి..నన్నేం పీకలేరు..అంటూ ఆ మీడియా వారిపై కూడా వచ్చారు. దాంతో చుట్టూ వెళ్తున్న వారంతా చూసి షాక్ అయ్యారు. జబర్దస్త్ లో నవ్వించే సుధీర్ ఇలా నడిరోడ్డుపై ఇలా హంగామా చేయటం అందరినీ ఆశ్చర్యపోయింది. హాస్పటిల్ కు వెళ్తున్నా, క్షమింపమని అడిగినా వదలక పోవటం స్దాకులను షాక్ చేసింది.

English summary
In Eetv's Extra Jabardasth show, Sudigali Sudheer is one team and Sudheer is the team leader for that team.They all got the good name and fame with Jabardasth. But today Sudigali Sudheer hulchal at Hyderabad roads create some bad name to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu