»   » నేను చచ్చిపోతే ఏడుస్తుందో లేదో.. రష్మీ ఏడిస్తే నేను చచ్చిపోతా.. సుధీర్

నేను చచ్చిపోతే ఏడుస్తుందో లేదో.. రష్మీ ఏడిస్తే నేను చచ్చిపోతా.. సుధీర్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sudigali Sudheer Emotional About Rashmi Guatam

  యాంకర్, సినీ నటి రష్మీ, జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ మధ్య ఉండే రిలేషన్‌‌పై అందరికీ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వారిపై వచ్చే రూమర్లకు బలం కలిగించే మాదిరిగాన పలు కార్యక్రమాల్లో వారి ప్రవర్తన కూడా ఉంటుంది. రష్మీ, సుధీర్‌ అఫైర్ గురించి ఏవేవో వార్తలు వస్తుంటాయి. మీడియాకు క్రేజీ జంటగా మారిన వారు ఇటీవల ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికరమైన అంశానికి తెర లేపారు.

  డ్యాన్స్ షోలో అదుర్స్

  డ్యాన్స్ షోలో అదుర్స్

  ప్రముఖ టెలివిజన్ చానెల్‌లో ప్రజాదరణ పొందిన డ్యాన్స్‌లో వీరిద్దరూ మెంటర్స్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో హాయ్ రే.. హాయ్ రే.. హాయర్ రబ్బా అనే పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. అనంతరం రష్మీ, సుధీర్‌ను కలిపి యాంకర్ ప్రదీప్ ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు.

  చందమామ ఇష్టమని

  చందమామ ఇష్టమని

  సుధీర్ నీకు రష్మీ ఎందుకు ఇష్టం అని అడుగగా.. చందమామ ఎందుకు ఇష్టం అంటే ఏం చెబుతాం. రష్మీ ఎందుకు ఇష్టం అంటే అదే నా సమాధానం అని సుధీర్ కౌంటర్ ఇచ్చారు. దాంతో రష్మీ ఆనందంలో మునిగిపోవడమే కాకుండా తబ్బిబ్బయ్యారు.

   మచ్చలేని చందమామ రష్మీ

  మచ్చలేని చందమామ రష్మీ

  సుధీర్‌ను ఎలాగైనా ఇరుకున పెట్టేందుకు ప్రదీప్ మరో ప్రశ్న వేశాడు. చందమామలో మచ్చ ఉంటుంది కదా.. అంటే.. మచ్చ లేని చందమామ రష్మీ అని సుధీర్ సమాధానం ఇవ్వడంతో మళ్లీ షాకవ్వడం రష్మీ వంతైంది.

  సుధీర్‌పై ఇష్టం ఎందుకంటే

  సుధీర్‌పై ఇష్టం ఎందుకంటే

  సుధీర్ అంటే నీకు ఎందుకు ఇష్టం అని రష్మీని ప్రదీప్ ప్రశ్నించగా.. ఆయన స్పోర్టివ్ యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టం. ఏమన్నా పెద్దగా పట్టించుకోడు. చాలా లైట్ తీసుకొంటాడు. సరదాగా ఉంటాడు అని సుధీర్‌కు రష్మీ కితాబిచ్చింది. దాంతో సుధీర్ మళ్లీ ఫిదా అయ్యాడు.

  ఎమోషనల్‌గా సుడిగాలి సుధీర్

  ఎమోషనల్‌గా సుడిగాలి సుధీర్

  ఆ తర్వాత వేదికపై నుంచి రష్మీని తన సీట్లోకి పంపించి.. రష్మీ గురించి అభిప్రాయం అడుగగా.. నేను చచ్చిపోతే రష్మీ ఏడుస్తుందో లేదో కానీ.. ఆమె ఏడిస్తే నేను చచ్చిపోతాను అని సుధీర్ ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో రష్మీకి మరో షాక్ తగిలినట్టు కనిపించింది. ఏదీ ఏమైనా రష్మీ, సుధీర్ జంట బుల్లితెర మీద కనిపిస్తే ప్రేక్షకులకు చెప్పలేనంత వినోదం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

   సుధీర్ నాకు ఫ్రెండే

  సుధీర్ నాకు ఫ్రెండే

  గత కొద్దికాలంగా సుధీర్, రష్మీ అఫైర్‌పై పలురకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల రష్మీ ఓ సందర్భంలో సుధీర్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చారు. సుధీర్‌తో నా రిలేషన్ గురించి చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ మా మధ్య అలాంటి రిలేషన్ లేదు. వ్యక్తిగతంగా మేము కేవలం స్నేహితులమే అని రష్మీ వివరణ ఇచ్చారు.

  English summary
  Rumours about the romantic relationship between Anchor Rashmi Gautham & 'Jabardasth' fame Sudigali Sudheer have been in circulation since some time. On the talk about marriage with Sudigali Sudheer, Rashmi clarified: 'People keep asking Me about it. But, We are good friends professionally. We are working together for Jabardasth and Dhee apart from hosting many events. Recently Sudheer emotionally bursts about Rashmi Gautam
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more