Just In
- 9 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 10 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 11 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 12 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లేడీ యాంకర్లపై సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్: తలుపులు మూయడం.. గొళ్లాలు వేయడం అంటూ!
బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్. చిన్న ఆర్టిస్టుగా పరిచయం అయిన అతడు.. ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగాడు. అంతేకాదు, యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. ఈ కారణంగానే చేతి నిండా షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. దీంతో ఈ యంగ్ కమెడియన్ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సుడిగాలి సుధీర్ ఇద్దరు లేడీ యాంకర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!

ఆ షోతో మొదలైన కెరీర్.. ఫుల్ ఫేమస్
జబర్ధస్త్ షో ద్వారా కమెడియన్‌గా పరిచయం అయ్యాడు సుడిగాలి సుధీర్. వాస్తవానికి అతడు ఈ షోలోకి రాకముందు మెజీషియన్‌గా పని చేశాడు. ఎన్నో స్టేజ్ షోలు, ఈవెంట్లలో మ్యాజిక్‌లు చేశాడు. ఇక, బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కుర్రాడు వెనుదిరిగి చూడలేదు. డ్యాన్స్, సింగింగ్‌తో పాటు మరికొన్ని విద్యలను చూపిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

యాంకర్‌తో లవ్ ట్రాకుతో హాట్ టాపిక్‌గా
సుడిగాలి సుధీర్.. ఆర్టిస్టుగా ఎంతలా పాపులర్ అయ్యాడన్నది పక్కన పెడితే... యాంకర్ రష్మీ గౌతమ్ కారణంగా మాత్రం బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తల వల్ల ఈ జబర్ధస్త్ కమెడియన్ ఊహించని స్థాయిలో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, రష్మీని పెళ్లి చేసుకుంటున్నాడన్న ప్రచారం జరగడం వల్ల చాలా లాభ పడ్డాడు కూడా.

పలువురితో ప్రేమాయణం.. అలా హైలైట్
సుదీర్ఘమైన తన కెరీర్‌లో సుడిగాలి సుధీర్ ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో పలువురు స్టార్ యాంకర్లతో లవ్ ట్రాకులు నడుపుతున్నాడని కూడా పేరు తెచ్చుకున్నాడు. జబర్ధస్త్ స్కిట్లలోనూ అతడికి అదే తరహా పాత్రలు ఇస్తుండడంతో ప్లేబాయ్ అన్న బిరుదును అందుకున్నాడు.

అలా సక్సెస్.. హీరోగా మాత్రం విఫలం
బుల్లితెరపై తనదైన శైలి టైమింగ్‌తో కామెడీని పండిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లోనూ అడుగెట్టాడు. ఈ క్రమంలోనే ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ అతడికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి.

లేడీ యాంకర్లపై సుధీర్ షాకింగ్ కామెంట్స్
నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఈటీవీ ప్రతి ఏడాది ఒక ప్రత్యేక ఈవెంట్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సారి ‘DJ 2021 New Year Special Event' అనే కార్యక్రమం ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌లో భాగంగా జరిగిన సంభాషణ సమయంలో సుడిగాలి సుధీర్.. ఇద్దరు యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తలుపులు మూయడం.. గొళ్లాలు వేయడం
రష్మీ - అనసూయ గొడవ పడుతోన్న సమయంలో ‘నేనైతే మీ ఇద్దరిలో ఎవరినీ వదిలిపెట్టను' అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత నేను పులి అంటే నేను పులి అని వాళ్లు అనుకుంటుండగా.. మధ్యలో ఎంటరై ‘నేను పులిరాజా'ను అని పంచ్ విసిరాడు. ఆ తర్వాత హైపర్ ఆది మాట్లాడుతూ.. తలుపులు మూయడం.. గొళ్లాలు వేయడం చేసేది సుధీర్ అని గాలి తీశారు.