For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Suma Adda: అందుకే ఆయనకు ఇద్దరు.. శేఖర్ మాస్టర్ పరువు తీసిన సుమ.. ఖాళీగా ఎప్పుడున్నాడంటూ!

  |

  ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్ గా వెలుగొందుతున్నాడు శేఖర్ మాస్టార్. ఒకప్పుడు డాన్స్ మాస్టర్స్ అంటే కేవలం తెరవెనుక మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టెలివిజన్ తోపాటు సోషల్ మీడియా కారణంగా చాలామంది టాలెంటెడ్ డాన్స్ మాస్టర్స్ ప్రేక్షకులకు దర్శనమిస్తున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనతోపాటు జానీ మాస్టర్ కూడా డౌన్ టు ఎర్త్ ఎదిగాడు. ఒకప్పుడు ఢీ షోలో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా వీళ్లద్దరితో ఒక ఆట ఆడేసుకుంది యాంకర్ సుమ.

  ఎవరికీ దక్కనటువంటి..

  ఎవరికీ దక్కనటువంటి..

  ఇప్పటివరకు తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేశారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇంకొందరు యాంకర్ అంటే ఇలా ఉండాలి, యాంకరింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఎవరు పొందలేని విశేషమైన గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది సుమ కనకాల. యాంకరింగ్ లో సుమ కనకాల తెచ్చుకున్నటువంటి పాపులారిటీ ఎవరు దక్కించుకోలేదనే చెప్పవచ్చు.

  విజయం సాధించడానికి..

  విజయం సాధించడానికి..

  ఎంతో కాలంగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతూ అంతులేని కామెడీని అందిస్తున్న క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవడానికి ప్రధాన కారణం యాంకర్ సుమ కనకాల అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు.

  ఎంతవరకు చేయాలో అంతవరకు..

  ఎంతవరకు చేయాలో అంతవరకు..

  ఎందుకంటే సుమ కనకాల తనదైన కామెడీ పంచ్ లతో హీరో హీరోయిన్లు ఎవరనేది చూడకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఎదుట ఎంత పెద్ద హీరో, హీరోయిన్ ఉన్నా తనదైన స్టైల్ తో పంచ్ లు వేస్తుంది. అలా అని మరి డీగ్రేడ్ పంచ్ లు వేయదు. ఎంతవరకు హాస్యం పండించాలో అంతవరకు అందరు మెచ్చేలా ఉంటాయి సుమ కనకాల కామెడీ పంచ్ లు. సుదీర్ఘమైన కెరీర్‌లో సుమ ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది.

  ఇంకాస్తా డోస్ పెంచుతూ..

  ఇంకాస్తా డోస్ పెంచుతూ..

  సుమ చేసిన అనేక కార్యక్రమాలు, టీవీ షోలు చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తూ ఫన్‌ను పంచుతోంది. ఇప్పుడు తాజాగా 'సుమ అడ్డా' ద్వారా ఇంకాస్తా డోస్ పెంచుతూ సెలబ్రిటీలను రోస్ట్ చేస్తుంది సుమ కనకాల.

  హీరోయిన్లతో ఎక్కువ వర్క్..

  హీరోయిన్లతో ఎక్కువ వర్క్..

  సుమ కనకాల తాజాగా హోస్ట్ చేస్తున్న షో సుమ అడ్డా. ఈ షోకి ఇప్పటికే వాల్తేరు వీరయ్య, కల్యాణం కమనీయం సినిమా టీమ్ వచ్చి సందడి చేశాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వచ్చి సందడి చేశారు. మంచి డ్యాన్స్ తో మాస్టర్స్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చాకా.. ఈ మధ్య శేఖర్ మాస్టర్ హీరోయిన్లతో ఎక్కువ వర్క్ చేస్తున్నట్లు ఉన్నారు అని సుమ అంది. మీరు కూడా హీరోయినే కదా అని శేఖర్ మాస్టర్ అన్నాడు. అది గుర్తు చేసుకుందామనే ఈ ఏడాది ఒక సినిమా చేశాను అని సుమ అంటే.. చేశారా అని పంచ్ వేశాడు శేఖర్ మాస్టర్. దీంతో సుమ షాక్ అయింది.

  ఖాళీగా ఎప్పుడుంటాడు..

  ఖాళీగా ఎప్పుడుంటాడు..


  తర్వాత భార్యాభర్తలుగా కమెడియన్స్ స్కిట్ వేస్తారు. పిల్లలు పుట్టడట్లేదని భర్తను తిడుతుంటుంది బార్య. పక్కింటి వెంకట్రావ్ కు పది మంది పిల్లలు. ఒకసారి ఆయన ఖాళీగా ఉంటే అతని దగ్గర టిప్ అడిగి తెలుసుకోరా అని భార్య అంటే పది మంది పిల్లలు అంటే ఖాళీగా ఎప్పుడుంటాడే వాడు అని భర్త సమాధానం ఇస్తాడు. దీంతో శేఖర్ మాస్టర్ తెగ నవ్వేస్తారు. అప్పుడు మాస్టర్ కి బాగా నచ్చినట్టుంది ఈ జోక్.. అందుకే మాస్టర్ కి ఇద్దరు పిల్లలే అని పంచ్ వేసింది సుమ. దీంతో అందరూ నవ్వేశారు. సుమ కూడా తాను అన్నదానికి నోటిపై చేయి వేసింది మాస్టర్ ను చూసింది. ఇలా శేఖర్ మాస్టర్ పరువును సుమ తీసినట్లయింది.

  English summary
  Suma Kanakala Making Fun With Choreographer Sekhar Master And Jani Master In Suma Adda Show Latest Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X