»   »  ‘సరైనోడు’ శాటిలైట్ రైట్స్ షాకయ్యే రేటు...రీజన్ ఇదీ

‘సరైనోడు’ శాటిలైట్ రైట్స్ షాకయ్యే రేటు...రీజన్ ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం 'సరైనోడు'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించారు. థమన్‌ సంగీతం సమకూర్చారు. ఈ నెల 22న 'సరైనోడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్మకం జరిగింది.

అందుతున్న సమాచారం ప్రకారం సన్ టీవి వారు...16 కోట్లు ఇచ్చి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్ లో తెలుగు, హింది, మళయాళం వెర్షన్స్ శాటిలైట్ రైట్స్ కూడా కలిసి ఉన్నాయని టీవి మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

సరైనోడు చిత్రం మళయాళంలో కూడా భారీ ఎత్తున విడుదల కానుండటం, తమిళంలోనూ ఈ సినిమాకి క్రేజ్ రావటం, ముఖ్యంగా తమిళంల మార్కెట్ ఉన్న ఆది పినిశెట్టి, అంజలి కూడా ఈ సినిమాలో ఉండటం ఈ స్దాయిలో శాటిలైట్ రైట్స్ పలకటానికి కారణం అయ్యింది. అంతేకాదు...హిందీ డబ్బింగ్ లో కూడా బన్ని సినిమాలకు మంచి ఆదరణ తొలి నుంచీ ఉంటూ వస్తోంది.

చిరంజీవి మాట్లాడుతూ '' అల్లు అర్జున్‌ విజయాలు చూస్తుంటే గర్వంగా ఉంటుంది. అవకాశాలు రావడం ఒకెత్తు. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. బన్నీ వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకొని విజయాలు సాధిస్తున్నాడు. బన్నీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక, కేరళలోనూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

బయట సరదాగా, చిలిపిగా ఉండే బన్నీలో హుందాతనం, పక్కా ప్రొఫెషనలిజం కనిపిస్తోంది. 'రుద్రమదేవి'లోని గోన గన్నారెడ్డి పాత్రను అద్భుతంగా చేశాడు. ఆ తర్వాత 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో పరిణితి ఉన్నపాత్ర చేశాడు. ఇప్పుడు 'సరైనోడు' వూర మాస్‌ అంటూ అలరిస్తాడు.

బోయపాటి శ్రీను అంటే పక్కా మాస్‌ దర్శకుడే కాదు. సెంటిమెంట్‌, డ్రామా, యాక్షన్‌ సన్నివేశాలు, పంచ్‌ డైలాగ్‌లు.. ఇలా అన్నీ ఉండేలా సినిమా తీయగలుగుతాడు. తమన్‌ అందించిన ప్రతి పాట ఆణిమత్యం లాంటిదే. ఈ నెల 22న వస్తోన్న 'సరైనోడు' అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను''అన్నారు.

Sun TV bagged Sarrainodu satellite for high price

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''తమన్‌ ఎంత సాలిడ్‌గా ఉంటాడో పాటలు అంతే. ఈ సినిమాకు సరైన పాటలు అందించిన సరైనోడు తమన్‌. 'ఆర్య' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆర్‌.కె.బీచ్‌ దగ్గర నా సినిమా పాటల వేడుకో లేదంటే ఇంకేదైనా కార్యక్రమమో జరగాలనుకున్నాను. ఈ సినిమాతో అది సాధించాను.

నేను, ఆది కలసి చిన్నతనంలో కరాటే శిక్షణ తీసుకున్నాం. అలాంటి ఆదితో ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒకవేళ ఈ సినిమా ఇతర భాషలో ఎవరైనా చేస్తే నేను ఆది పాత్ర చేస్తా. అంతగా నచ్చిందా పాత్ర. బోయపాటి శ్రీను హీరోను బట్టి సినిమాలు డిజైన్‌ చేస్తారు.

ఈ సినిమా విడుదలయ్యాక ఆయన కేవలం మాస్‌ డైరక్టరే కాదు అన్ని రకాల సినిమాలూ చేయగలరని మరోసారి తెలుస్తుంది. ఈ రోజు నేనిలా ప్రేక్షకుల ముందు నిలబడ్డాను అంటే అది చిరంజీవిగారి వల్లే. నేనే కాదు పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, శిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌... ఇలా మా కుటుంబం ఎవరు వచ్చినా అది చిరంజీవిగారు వేసిన దారి వల్లే. ఆయన లేకపోతే మేం లేం'' అన్నారు.


అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''బోయపాటి శ్రీను ఈ సినిమా పరిశ్రమకు సరైనోడు అని ఈ సినిమాతో మరోసారి రుజువు చేస్తాడు. తమన్‌ అందించిన పాటలు శ్రోతలకు బాగా నచ్చాయి''అన్నారు.

తమన్‌ మాట్లాడుతూ ''సంగీత దర్శకుడికి మంచి డ్యాన్సర్‌ దొరికితే ఎలా ఉంటుందనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. నేను అందించిన పాటలకు బన్ని సూపర్‌ స్టెప్పులేశాడు. పాటలు బాగా కుదిరాయి''అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ ''సరైనోడు' బృందంలో అందరూ సరైనోళ్లే. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. బన్నీ ఇంత పెద్ద హీరో అయినా నిత్యం అభిమానులను ఎలా అలరించాలా అనే తపన పడుతుంటాడు''అన్నారు.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ ''అల్లు అర్జున్‌ నా అభిమాన నటుడు అని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. బన్నీతో పని చేయడం మంచి అనుభవమ''న్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ''న్యాయం నాలుగు కాళ్ల మీద నిలబడాలి... అన్యాయానికి అసలు కాళ్లే ఉండకూడదు అని నమ్మే ఒక కుర్రాడి కథ ఈ సినిమా. కృషి, కసి కలిపితే అది బన్నీ. అంతటి సత్తా ఉన్న వ్యక్తి అతను. అభిమానులకు నేను చెప్పే విషయం ఒక్కటే 'గుండె మీద చెయ్యేసుకొని ఈ సినిమా చూడండి'' అన్నారు.

English summary
Sun TV bagged the satellite rights of Allu Arjun's ‘Sarainodu’film for a whopping Rs.16 Crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu