For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg BossTelugu 5కి సురేఖ వాణి..విషయం రివీల్ చేసేసిన కూతురు!

  |

  సురేఖ వాణి తెలుగు వారు అందరికీ సుపరిచితమే. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వచ్చని ప్రచారామయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. దానికి తగ్గట్టే ఆమె తాను బిగ్ బాస్ లోకి వెళ్ళడం లేదని ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేయడంతో దానికి మీద ఆసక్తికర చర్చ జరుగింది. దానికి సంబంధించిన అంశం మీద ఆమె కుమార్తె సుప్రీత క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  బాధ పడుతూనే

  బాధ పడుతూనే

  నిజానికి సురేఖ చేసేది సాంప్రదాయబద్ధమైన పాత్రలు అయినా బయట మాత్రం ఆమె చాలా కూల్. ఎవరూ ఊహించని విధంగా అల్ర్టా మోడరన్ లుక్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆమె తన కూతురితో పోటీపడుతూ హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుని సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించింది. నిజానికి కెరీర్ మొదట్లోనే ఆమె సురేష్ తేజ అనే సీరియల్ డైరెక్టర్ తో ప్రేమలో పడిన సురేఖ వాణి ఆయనను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆయన అనుకోకుండా కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు. అయితే భర్త మరణంతో చాలా రోజులు బాధలో మునిగిపోయిన ఆమె ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ కూడా అయ్యారు.

  ఆ పోస్ట్ తో

  ఆ పోస్ట్ తో

  అయితే పెళ్లీడుకొచ్చిన కూతురితో పోటీ పడుతూ హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుని సోషల్ మీడియాలో పొట్టి పొట్టి బట్టల్లో కనిపిస్తూ ఉండడంతో ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయినా సరే ఆమె ఏ మాత్రం ఆ విషయాలను పట్టించుకున్నట్టే కనిపించదు. ఎప్పటికప్పుడు తన పని తాను చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో మాత్రం అదే రీతిలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, అప్ డేట్స్ ఇస్తూ ఉండే సురేఖ వాణి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ఒకటి చర్చనీయాంశంగా మారింది.

  పోస్ట్ పెట్టి డిలీట్

  పోస్ట్ పెట్టి డిలీట్

  అసలు విషయం ఏమిటంటే గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ 5 కి సంబంధించిన అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళే వారి పేర్లలో ప్రముఖంగా సురేఖ వాణి పేరు కూడా వినిపించింది. ఆమె ముందు కాదని చెప్పిందని, అయితే తరువాత అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుండగా ఈ విషయం మీద ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తాను బిగ్ బాస్ ఫైవ్ లో పాల్గొనడం లేదని వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం అంటూ ఆమె ఒక స్టేటస్ పెట్టింది. అదంతా ఫేక్ న్యూస్ ఆ వార్తల్లో నిజం లేదు అని కూడా ఆమె కామెంట్ చేసింది. ఇక్కడ దాకా అంతా బాగానే ఉన్నా ఆమె పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసింది.

  అమ్మకి ఇంటరెస్ట్ లేదు

  అమ్మకి ఇంటరెస్ట్ లేదు

  దీంతో అసలు ఈ పోస్టు ఎందుకు పెట్టింది ? ఎందుకు డిలీట్ చేసింది ? అనే సందేహాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో అభిమానులతో చేసిన ఒక చాట్ సెషన్ లో తన తల్లి బిగ్ బాస్ ఎంట్రీ విషయం గురించి మీడియాలో వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చింది. మమ్మీకి బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ లేదని.. ఆమెకు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ మీదే అసలు ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు ఆమె చేపుకొచ్చింది. అయితే ఈ విషయం మీద క్లారిటీ రావడంతో లోపలి ఎవరెవరు వెళ్లనున్నారు అనే దాని మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  వాళ్ళేనా

  వాళ్ళేనా

  ఇక ఈ సారి డజను మంది పేర్లు ఎక్కువగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వారు వీరే అంటూ ప్రచారం జరుగుతోంది. అందులో ముఖ్యంగా యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, టీవీ నటి నవ్య స్వామి, యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్, ఒకప్పటి హీరోయిన్ ఇషా చావ్లా, యూట్యూబ్ యాంకర్ శివ, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ దుర్గారావు, ఆట అందీప్ దంపతులు అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే కంటిస్టెంట్స్ ను క్వారెంటైన్ కు పంపించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అంతే కాక బిగ్ బాస్ కు సంబంధించిన సెట్ పునః నిర్మాణం జరుగుతోందని అంటున్నారు.

  Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
  మళ్ళీ నాగ్

  మళ్ళీ నాగ్

  ఇక బిగ్ బాస్ నిర్వాహకులు లోగో విడుదల చేశారు కానీ ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుంది అనే అంశం మీద క్లారిటీ ఇవ్వలేదు. తే ఒకసారి కరోనా పరిస్థితుల్లో షో పూర్తి చేశారు కాబట్టి ఈసారి మరింత అనుభవంతో షో ప్లాన్ చేస్తున్నారని అలాగే ఈసారి ఫిజికల్ టాస్క్ లు పెద్దగా ఇవ్వకుండానే షో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. గత రెండు సీజన్లు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారని అంటున్నారు. ఇక చూడాలి ఈ సీజన్ ఎలా అలరించబోతోంది అనేది.

  English summary
  Surekha Vani's daughter Supritha clarified that Surekha Vani was not interested in going to Bigg Boss.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X