Don't Miss!
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- News
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సురేఖవాణి మెడలో మంగళసూత్రం.. ఫోటో షేర్ చేయడంతో రెండో పెళ్లి అంటూ రూమర్లు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అంటే తెలియని తెలుగు వారు ఉండరు. తెలుగులో ఎక్కువగా అమ్మ, అక్క, వదిన తదితర పాత్రలు చేసే ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్లతో సమానంగా క్రేజ్ సంపాదించింది. ఆమె సోషల్ మీడియా లో ఏదైనా ఫోటో పెట్టింది అంటే వెంటనే వేలల్లో లైకులు కామెంట్స్ వస్తూ ఉంటాయి.. అయితే సురేఖ వాణి రెండో వివాహం గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. తాను చేసుకోవడానికి రెడీ అయినట్లు కూడా ఆ మధ్య ఆమె కామెంట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో మాత్రం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రేమలో పడి
సురేఖ వాణి చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడి వివాహం చేసుకుంది.. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖ వాణి ఆ తర్వాత సీరియల్స్ లో నటించి నెమ్మదిగా సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో సీరియల్స్ కి దర్శకత్వం వహించే సురేష్ తేజ అనే దర్శకుడుతో ప్రేమలో పడి ఆయననే పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకుంది. దురదృష్టవశాత్తూ సురేష్ తేజ కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్య కారణాలతో మరణించారు. అయితే చాలా కాలం పాటు భర్త మరణం నుంచి కోలుకోలేక పోయింది సురేఖ వాణి.

నెగిటివ్ కామెంట్లు
క్రమక్రమంగా కోలుకుని ఇప్పుడు తన సినిమాలు తను చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి ఎప్పటికప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అయితే సినిమాల్లో చేసేది సంప్రదాయమైన పాత్రలే కానీ బయట మాత్రం ఆమె మోడరన్ డ్రెస్సుల్లోనే కనబడడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అలా మోడరన్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉండడంతో ఆమెకు హాట్ బాంబ్ అంటూ కామెంట్లు రావడం సహజం అయిపోయాయి. పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉన్నా సరే ఆమె తో పోటీ పడుతూ హాట్ డ్రస్సులు వేసుకోవడం ఏమిటి? అని కొంత మంది నెగిటివ్ కామెంట్లు పెట్టినా సరే సురేఖ వాణి మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.

రెండో వివాహం ఏమైనా?
అయితే ఎప్పటికప్పుడు తన ఫోటోలు, తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, అలాగే వెకేషన్ లో వున్న ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండే సురేఖ వాణి తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో బ్లూ కలర్ సారీ లో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఫోటోలో సురేఖ వాణి మెడలో తాళిబొట్టు కనిపించడమే. సాధారణంగా భర్త చనిపోయిన తరువాత స్త్రీలు తాళిబొట్టు తీసివేస్తారు. కానీ సురేఖ వాణి మెడలో తాళిబొట్టు కనిపిస్తూ ఉండటంతో ఒకవేళ ఆమెకు రెండో వివాహం ఏమైనా జరిగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పెళ్లి చేసుకుంటుందా ?
కొంతమంది ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమె స్వతహాగా నటి కావడంతో ఏదైనా సినిమాకు సంబంధించిన పాత్ర అయ్యుండొచ్చు అని కామెంట్ చేస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికితే అలా ఫోటో తీసుకుని అప్లోడ్ చేసి ఉండొచ్చని దానికి రెండో పెళ్లి అని కొత్త ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదని ఆమె మద్దతుదారులు కామెంట్ చేస్తున్నారు. ఆ మధ్య ఆ ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటూ ఒక ఒక పోస్ట్ షేర్ చేయడంతో అప్పట్లోనే ఆమె చిన్న వయసు వారిని ఏమైనా పెళ్లి చేసుకుంటుందా అన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే తాను పెళ్లి చేసుకోవడం లేదు అని రెండు మూడు సార్లు సురేఖ వాణి ఖండించింది. కానీ పద్దాక ఇదే విషయం మీద కామెంట్లు వస్తూ ఉండటంతో ఆ మధ్య ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొన్న సమయంలో నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదని మళ్ళీ ఆమె చెప్పుకొచ్చింది.
Recommended Video

బ్లూ కలర్ సారీ ఫోటో షేర్ చేయడంతో
మీ రెండో పెళ్లి ఎప్పుడు అని అప్పట్లో అలీ అడగగా నాకేం తెలుసు అని ఆమె ప్రశ్నించింది. ఎవరో వార్తలు రాస్తే నాకెలా తెలుస్తుంది? అని ప్రశ్నించిన సురేఖ వాణి ఆయన ఎవరో తెలిస్తే మీరే చెప్పండి అని కూడా ఆలీకి షాక్ ఇచ్చింది. అంతే కాక ఆ చూసేది ఏదో కొంచెం డబ్బు ఉన్న వాళ్ళని చూడమని కూడా సురేఖ వాణి చెప్పుకొచ్చింది. అదే సమయంలో అలీ డబ్బు ఉన్న వాళ్ళు కావాలా? లేక మనసు ఉన్న వాడు కావాలా అని ప్రశ్నిస్తే మనసుతో పనేముంది పనులేమీ జరగవు కదా! డబ్బు ఉన్న వాళ్ళు కావాలి అని సురేఖ వాణి కామెంట్ చేయడం కూడా అప్పట్లో చర్చనీయాంశం అయింది.
దేనికైనా డబ్బే మూలం కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది. అప్పట్లో సరదాగా ఇదేదో పెద్ద స్టోరీ లాగానే ఉంది అంటే అవును పెద్ద స్టోరీ అంటూ ఆమె నవ్వేసింది.. అయితే ఇప్పుడు బ్లూ కలర్ సారీ ఫోటో షేర్ చేయడంతో ఇప్పుడు ఆమె పెళ్లి వ్యవహారాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చినట్టు అయింది.