బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త సెలబ్రిటీ! ఇంట్లోకి దొంగలా.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended Video

బిగ్‌బాస్ నుంచి తేజస్వి మదివాడ ఎలిమినేషన్ తర్వాత ఇంట్లోకి కొత్త సెలబ్రిటీ ప్రవేశించింది. అయితే ఆమె ఎవరనే విషయాన్ని బిగ్‌బాస్ సీక్రెట్‌గా ఉంచారు. హౌస్‌లోకి ప్రవేశించిన ఆమె ఎవరన్నది ప్రేక్షకులు, నెటిజన్లలో ఆసక్తి నెలకొన్నది. ఇంతకి ఆమె ఎవరంటే..

దొంగలా.. గుట్టుచప్పుడు కాకుండా
బిగ్‌బాస్ హౌస్‌లోకి తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఓ అమ్మాయి దొంగలా ప్రవేశించారు. గుట్టు చప్పుడు కాకుండా రగ్గు కప్పుకొని సోఫాలో పడుకొంది. అలా సీక్రెట్‌గా ప్రవేశించడాన్ని ఇంటి సభ్యుడు కౌశల్ ఒక్కడే చూశాడు.

కొత్త సెలబ్రిటీ ఎవరంటే
బిగ్‌బాస్ హౌస్‌లోకి సీక్రెట్‌గా ప్రవేశించింది ఎవరో కాదు. స్వామి రా రా చిత్ర హీరోయిన్ పూజా రాంచంద్రన్. తెలుగులో లవ్ ఫెయిల్యూర్. అడవి కాచిన వెన్నెల. త్రిపుర, దోచెయ్. దళం, సిద్ధార్థ, కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నటించారు.

ఇంట్లో పూజ రాంచంద్రన్
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ముక్కు ముఖం తెలియని పూజా రాంచంద్రన్ బిగ్‌బాస్‌లోకి రావడం ఆశ్చర్యం కలిగింది. అయితే ఆమె తన లగేజ్‌తో రాకపోవడంతో మళ్లీ అనుమానాలు తలెత్తాయి. ఆమెది వైల్డ్ కార్డు ఎంట్రీనా? లేక గెస్టా అనే విషయంపై క్లారిటీ లేకుండా బిగ్‌బాస్ సస్పెన్స్‌లో పెట్టారు.

దుప్పటి లాగిన కౌశల్
అయితే సోఫాలో పడుకొన్న కొత్త వ్యక్తిని గమనించిన కౌశల్.. ఆమె ముఖంపై ఉన్న దుప్పటిని లాగేందుకు ప్రయత్నించారు. అయితే కౌశల్ లాగుతుంటే ముఖం కనిపించకుండా గట్టిగా దుప్పటి కప్పుకొని దాచుకొన్నది.

మూడు రోజులుగా నిద్ర లేదు
బిగ్‌బాస్ ఇంట్లోకి వస్తున్న సంగతి తెలిసినప్పటి నుంచి మూడు రోజులుగా నాకు నిద్ర పట్టలేదు. చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎట్టకేలకు నేను ఇంట్లోకి ప్రవేశించాను అని గుసగసలాడింది. ఇంతకీ ఇంట్లో మంగళవారం ఎపిసోడ్‌లో ఏమి జరిగిందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











