మరో తెలుగు సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్.. లక్షణాలు లేకపోయినా..

సినిమా ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర నటులు కూడా వైరస్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ వైరస్ ఉహీంచని స్థాయిలో దెబ్బ కొడుతోందని సినీ తారలు షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల మరొక తెలుగు టీవీ ఆర్టిస్ట్ కూడా కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది.

Recommended Video

Telugu TV Actor Tests Covid-19 Positive మొగలి రేకులు ఫేమ్ నటుడికి కరోనా || Oneindia
స్వాతి చినుకులు యాక్టర్..

స్వాతి చినుకులు యాక్టర్..

స్వాతి చినుకులు, బంధం వంటి సీరియల్స్ ద్వారా తెలుగు జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరద్వాజ్ ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకోగా అతనికి పాజిటివ్ అని తేలింది. అయితే అతనికి కరోనా లక్షణాలు పెద్దగా కనిపించడం లేదట. అయినప్పటికీ టెస్ట్ చేయించుకోగా వైరస్ ఉన్నట్లు తెలిపాడు. భరద్వాజ్ ఒక వీడియో ద్వారా తనను కలిసిన వారు కూడా టెస్ట్ చేయించుకోవాలని కోరాడు.

లక్షణాలు లేకపోయినా..

లక్షణాలు లేకపోయినా..

భరద్వాజ్ మాట్లాడుతూ..నాకు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఏమి లేదు. అయినప్పటికీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంలో సమాధానం లేదు. అయితే ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. ఇది నిజంగా దాచాల్సిన విషయం కాదు. స్వాతి చినుకులు, బంధం సీరియల్స్ షూటింగ్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను.

ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోండి

ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోండి

ప్రతి ఒక్కరు మర్చిపోకుండా టెస్ట్ చేయించుకోండి. ఇది బయటకు చెప్పాల్సిన బాధ్యత అందరిలో ఉంది. చుట్టూ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన ఎవరితో ఉండకూడదు. పానిక్ అవ్వకుండా ముందుజాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. సమయానికి మెడిటేషన్, ఆహారం క్రమంగా తీసుకుంటే ఎలాంటి అపాయం ఉండదు. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ గా ఉండి ఇతరులను కూడా భయానికి గురి చేయవద్దు.

 సోషల్ డిస్టెన్స్ అవసరం..

సోషల్ డిస్టెన్స్ అవసరం..

జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ.. మీ అంతట మీరే జాగ్రత్తగా ఉంటే వైరస్ భారిన పడకుండా ఉండవచ్చని తనకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భరద్వాజ్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. భరద్వాజ్ కి కరోనా పాజిటివ్ అని తెలియడంతో బంధం, స్వాతి చినుకులు సిరియాల్ టీమ్ లలో ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X