twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గేమ్ అంటే అంత నీచంగానా? బ్రాత్రూంలో కూడా అలానా?.. ఆ కంటెస్టెంట్‌ను కడిగిపడేసిన శ్వేతా వర్మ

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటి షోలో ఆరోవారం నామినేషన్లు ముగిసిన తర్వాత ఇంటిలో గంభీరమైన వాతావరణం నెలకొన్నది. ఇంటి సభ్యులందరూ నామినేషన్ల ప్రక్రియలో జరిగిన వాదనలపై తమ గ్రూప్‌తో చర్చించుకొంటూ కనిపించారు. నామినేషన్లు అనేసరికి ఇంటి సభ్యులు అన్నీ మరిచిపోయి దారుణంగా వ్యవహరిస్తుంటారనే అభిప్రాయాన్ని ప్రతీ ఒక్కరు తమ సన్నిహితులతో పంచుకొన్నారు. అయితే తనను నామినేషన్ల ప్రక్రియలో తనను టార్గెట్ చేయడంపై శ్వేతా వర్మ ఘాటుగా స్పందించారు. ఇంటి సభ్యుల్లో అందర్నీ కడిగిపడేస్తూ వారి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. శ్వేత వర్మ ఎవరిపై మండిపడిందంటే..

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

    శ్వేతా వర్మ ఘాటుగా

    శ్వేతా వర్మ ఘాటుగా

    నామినేషన్ల ప్రక్రియలో తమకు ఇష్టం వచ్చినట్టు.. శ్వేత వర్మ అంటే నాకు తెలుసు. ఆమె గురించి నాకు అంతా తెలుసు. నేను ఎలా ఉండాలో అలా ఉంటున్నాను. నేను ఒకరికి ఇష్టం వచ్చినట్టు నా ప్రవర్తనను మార్చుకోలేను. నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను. ముఖం ముందు ఒక మాట.. ఆ తర్వాత ఒక మాట్లాడే వాళ్లు ఇంటిలో ఉన్నారు. వారి ప్రవర్తన నాకు నచ్చడం లేదు అంటూ శ్వేతా వర్మ ఘాటుగా స్పందించారు.

    వాష్ రూమ్‌లో అలా చేస్తారా?

    వాష్ రూమ్‌లో అలా చేస్తారా?

    వాష్‌రూమ్‌లో యాంకర్ రవి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చి రవి అన్న అంటూ మళ్లీ ప్లేట్ ఫిరాయిస్తారు. ఒక మనిషి గురించి చెడుగా ఇలా పబ్లిక్ ముందు ఎలా చెబుతారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి చెడుగా ఎలా మాట్లాడుతారు. అది ఎప్పుడూ సరికాదు. అందుకే నేను కొందరికి నేను దూరంగా ఉంటాను. అంత మాత్రాన నేను అందరికి అంటిముట్టనట్టు ఉంటానని ఎలా చెబుతారు అంటూ శ్వేత ఘాటుగా స్పందించింది.

    నామినేట్ చేయడమంటే నీచంగా మాట్లాడటమా?

    నామినేట్ చేయడమంటే నీచంగా మాట్లాడటమా?

    నామినేషన్ల ప్రక్రియ అంటే ఒక మనిషి గురించి ఆ ప్రదేశంలో ప్రపంచం ముందు ఎలా నోరు పారేసుకొంటారు. అలాంటి వారంటే నాకు పడదు. నేను వారికి దూరంగా ఉంటాను. దానిని నా తప్పుగా వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తే నేను ఒప్పుకొను. అలాంటి వారిని సహించను అని శ్వేతా వర్మ అంటే... ప్రియాంక సింగ్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అలా కోపంతో ఊగిపోయిన శ్వేత.. ఇంటిలోని కొందరిని టార్గెట్ చేసి గట్టిగా క్లాస్ పీకింది. అయితే ఆర్జే కాజల్‌ను ఉద్దేశించి కామెంట్ చేసిందా అనే విషయంపై క్లారిటీ కనిపించలేదు.

    నాకు గ్రూప్ రాజకీయాలు చేయడం రాదు

    నాకు గ్రూప్ రాజకీయాలు చేయడం రాదు

    ఆ తర్వాత అనీ మాస్టర్‌తో మాట్లాడుతూ.. నేను టాస్క్ ఇస్తే 100 శాతం ప్రయత్నిస్తాను. నాకు ఒకరికి బిస్కెట్లు వేయడం రాదు. నేను వ్యక్తిగతంగా వచ్చాను. వ్యక్తిగతంగా వెళ్లిపోతాను. నాకు గ్రూప్‌ రాజకీయాలు చేయడం తెలియదు. ఒకరికి బిస్కెట్లు వేసి.. ఇంటిలో ఉండటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ కొందరు ఎలా ఆడుతున్నారో నాకు తెలుసు. గేమ్ అంటే ఇతరుల గురించి నీచంగా మాట్లాడుకోవడమా అంటూ శ్వేత వర్మ ప్రశ్నించింది.

    Recommended Video

    Bigg Boss లో ఇలా ఆడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. Mind It | SRC ఫ్యాన్స్ స్ట్రాటజీ || Filmibeat Telugu
    ఎలిమినేషన్ ప్రక్రియలో శ్వేత వర్మ

    ఎలిమినేషన్ ప్రక్రియలో శ్వేత వర్మ

    ఇది ఇలా ఉండగా, శ్వేతా వర్మ ప్రస్తుతం ఆరో వారం ఎలిమినేషన్‌ కోసం నామినేట్ అయ్యారు. ఆమెను ఎలిమినేషన్ నుంచి కాపాడాలనుకొంటే 888 6658 218 టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. లేదా హాట్ స్టార్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ వారం యాంకర్ రవి, శ్రీరామచంద్ర, జెస్సీ, సిరి హన్మంతు, లోబో, వీజే సన్నీ, మానస్, ప్రియాంక, విశ్వ నామినేషన్‌లో ఉన్నారు.

    English summary
    Actor Swetaa Varma serious on Back stabbers in Bigg Boss Telugu 5. She was upset with some contestant's behaviour in the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X