Just In
- 19 min ago
Master Collections: తెలుగులో మాస్టర్ రికార్డు.. కేవలం మూడు రోజుల్లోనే.. షాకిస్తోన్న లెక్కలు!
- 1 hr ago
ఎయిర్‌పోర్టులో మోనాల్‌కు ఊహించని షాక్: ఆ పేరుతో కామెంట్స్ చేయడంతో తట్టుకోలేక ఇలా!
- 2 hrs ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 3 hrs ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
Don't Miss!
- Automobiles
మార్కెట్లో కొత్త 2021 స్కొడా సూపర్బ్ విడుదల: ధర, ఫీచర్లు
- Sports
India vs Australia: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. భారత్ 62/2!!
- News
సొంత లాభం కొంత మానుకో: ప్రధాని మోడీ నోట గురజాడ సాహిత్యం: పొరుగు వారికి వ్యాక్సిన్ అందుకే
- Lifestyle
మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి రోజుకు ఎన్నిసార్లు తినాలో మీకు తెలుసా?
- Finance
సరికొత్త రికార్డును తాకిన HCL టెక్, కొత్తగా 20,000 ఉద్యోగాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు చెప్పిన సోహెల్: డేటింగ్ గురించి కూడా బయట పెట్టేశాడు
తెలుగులో చాలా కాలంగా సినిమాలు చేస్తున్నా.. అంతగా గుర్తింపును అందుకోలేకపోయాడు యాంగ్రీ యంగ్ మ్యాన్ సయ్యద్ సోహెల్ రియాన్. ఈ క్రమంలోనే సీరియళ్లలో నటించినా అంతగా పాపులర్ కాలేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడతను. ఏమాత్రం అంచనాలు లేకుండా షోలోకి ప్రవేశించిన ఈ కుర్రాడు.. ఫినాలోకు చేరుకున్నాడు. తుది పోరులో నిలవలేకపోయినా.. ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన డేటింగ్, పెళ్లి గురించి విషయాలను బయట పెట్టేశాడు. ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చాడు.. తర్వాత బడా హీరోలతో
‘కొత్త బంగారు లోకం' సినిమాతో నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్న అతడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ చిత్రం ‘సరైనోడు' వంటి బడా మూవీలలో కీలక పాత్రలు పోషించాడు. అదే సమయంలో కొన్ని సీరియళ్లలోనూ నటించి మెప్పించాడీ యంగ్ యాక్టర్.

రహస్యంగా ఎంట్రీ.. సత్తా చాటిన సోహెల్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంపికైన సయ్యద్ సోహెల్ రియాన్.. ప్రీమియర్ ఎపిసోడ్‌లో అందరు కంటెస్టెంట్లలా కాకుండా సీక్రెట్ రూమ్‌లోకి ప్రవేశించాడు. అతడితో పాటు ఆరియనా గ్లోరీ కూడా అందులోకి వెళ్లింది. వీళ్లిద్దరూ కలిసి రెండు రోజుల పాటు రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో మిగిలిన కంటెస్టెంట్లతో ఓ ఆట ఆడుకున్నారు. తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

అన్నింట్లో ఆకట్టుకుని... హాట్ టాపిక్‌గా
బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం మేరకు గొడవతోనే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు సోహెల్. ఆ తర్వాత అన్ని టాస్కుల్లో ముందుంటూ తన మార్క్ చూపించాడు. ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు.. ఎలాంటి గేమ్ అయినా తానే కింగ్ అనిపించుకున్నాడు. అయితే, ‘కథ వేరే ఉంటది' అంటూ తరచూ గొడవలకు దిగడం అతడికి మైనస్‌గా మారినా.. తర్వాత దాన్ని అధిగమించి సత్తా చాటాడు.

ఫినాలేకు ఎంట్రీ... ఆఫర్‌కు ఒప్పుకుని
ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన సోహెల్.. ఊహించని విధంగా ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఎలిమినేషన్ తప్పించుకుని గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టాడు. ఫినాలేలో అభిజీత్, అఖిల్‌తో కలిసి టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్.

పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు చెప్పి
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహెల్ ఫుల్ బిజీగా తిరుగుతున్నాడు. ఇప్పటికే సినిమాను ప్రారంభించిన అతడు.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఓ ఛానెల్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్‌లోని లేడీ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని యాంకర్ అడగగా.. ఆరియానా గ్లోరీ పేరు చెప్పాడు.

డేటింగ్ గురించి కూడా బయట పెట్టేశాడు
ఇదే ఇంటర్వ్యూలో డేటింగ్ ఏ కంటెస్టెంట్‌తో చేస్తావని యాంకర్.. సోహెల్‌ను ప్రశ్నించాడు. దీనికి వెంటనే దేత్తడి హారిక పేరు చెప్పాడతను. ఇది సరదాగానే జరిగినప్పటికీ.. దీనిపై ఎన్నో రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆరియానాతో పెళ్లైతే ఎలా ఉంటుందన్న దానిపై కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. దీంతో సోహెల్ ట్రెండ్ అవుతున్నాడు.