మాటీవీ స్పందించడం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... ఈటీవీ వెంటనే స్పందించి అనువాదాలను ఆపివేసిందన్నారు. జీటీవీ, జెమినీ టీవీ స్పందించాయన్నారు. హోలీ ఆడటం తెలుగువారి సంప్రదాయం కాదని, అనువాద ధారావాహికలను చూసి మనవాళ్లు సైతం హోలీ జరుపుకుంటున్నారన్నారు.
ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన పండుగలు అన్ని కలగూరగంపలాగా కలగాపులగం అవుతాయని పేర్కొన్నారు. మన సంసృతి, సంప్రదాయాలు అన్ని మంటగలిసిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంపన్నులైన ఉత్తరాది అత్తలు కోడళ్లకు పరీక్షలు పెడుతుంటారని నేడు మన దగ్గర అదే ధోరణి ప్రబలుతోందని అన్నారు.
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యను సాగదీయకుండా టీవీ చానళ్ల యజమాన్యాలు స్పందించాలని కోరారు. సీనియర్ డైరెక్టర్ అశోక్, కళాకారులు ప్రసన్న, వైభవ్, మాణిక్‌ప్రభు తదితరులు పాల్గొన్నారు. బిందు, నాగబాబు, బృంద, రాజశేఖర్, భార్గవరావు, శశాంక్, విజయ్‌యాదవ్, కిశోర్, శివరాం, కృష్ణచైతన్య తదితరులు దీక్షలు చేసినవారిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











