డబ్బు కోసం అలా పడుకోలేను.. నటి బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్త ఇండియా మొత్తంగా పాపులారిటీని దక్కంచుకుంది. 2004 నుంచి సినీ ప్రపంచంలో యాక్టివ్ అయిన ఈ బ్యూటీ 2013 వరకు వరుస చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం 12 ఏళ్లుగా ఆమె చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనలో జీవనం సాగిస్తుంది. ఆమె సినిమాలకు దూరమైన తర్వాత ఇక యూఎస్ లోనే పూర్తిగా సెటిల్ అయ్యింది. అయితే తనుశ్రీ దత్త రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ప్రస్తుతం ఇండియాలో అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక హిందీలో ఈ రియాలిటీ షో అన్ని భాషల్లో కంటే ముందుగానే ప్రారంభం అయ్యింది. 2006 నుంచి హిందీ టెలివిజన్ ప్రేక్షకులను బిగ్ బాస్ హౌజ్ అలరిస్తోంది. ఇప్పటికే 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఆసక్తకరింగా కొనసాగుతోంది. ఈ షోకు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Tanushree Dutta 11 Times Rejected Bigg Boss Hindi

అయితే, బిగ్ బాస్ హౌజ్ హిందీలో 19 ఏళ్లుగా కొనసాగుతోంది. కాగా ఈ హౌజ్ లోకి సెలబ్రెటీ కంటెస్టెంట్ గా స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్తకు బిగ్ బాస్ హిందీ నిర్వాహకులు ఆహ్వానం పలుకుతూనే ఉన్నారంట. అది కూడా ఒకటి రెండు సార్లు కాదండోయ్. ఏకంగా 11 ఏళ్లుగా తనుశ్రీ దత్తను బిగ్ బాస్ హౌస్ లోకి స్వాగతం పలుకుతూనే ఉన్నారంట. ఈ విషయాన్ని హీరోయిన్ తనుశ్రీ దత్తనే స్వయంగా వెల్లడించారు. ఇక తను రిజెక్ట్ చేసుకుంటూనే వస్తున్నానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తను బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడానికి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. అందుకే 11 ఏళ్లుగా 11 సార్లు బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించినట్లు చెప్పింది. అందుకు మరో బలమైన కారణం కూడా ఉందని వెల్లడించింది. హౌజ్ లో అందరూ ఒకే దగ్గర పడుకోవడం. ముఖ్యంగా స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఒకే దగ్గర కలిసి పడుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అలాగే పోట్లాడుకోవడం కూడా, అవన్నీ నేను చేయలేనంటూ ఇటీవల బాలీవుడ్ కు చెందిన ఒక ఛానెల్ కు తెలియజేసింది.

ఇక బిగ్ హౌజ్ లోకి వస్తే తనకు రెమ్యునేషన్ గా రూ.1.65 లక్షలు ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్టు చెప్పింది. అయినా కూడా అలా పురుషులతో కలిసి ఒకే బెడ్ పంచుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తిరస్కరించినట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తనుశ్రీ దత్త బౌద్ధ ధ్యానం, విపశ్యన ధ్యానాన్ని అభ్యసించడం ఈ షోకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇక తనుశ్రీ దత్త బాలీవుడ్ లో ఆషిక్ బనాయా ఆప్నే , భాగమ్ భాగ్, ధోల్, ఓకే వంటి చిత్రాలతో అలరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X