Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Jabardasth Rating: యాంకర్ అనసూయ, సుమపై రష్మీ గౌతమ్ పైచేయి.. రేంజ్ మామూలుగా లేదుగా!
తెలుగు టెలివిజన్ రంగంలో నాన్ సిరీయల్ విభాగంలో ప్రసారం అవుతున్న రియాలిటీ, గేమ్ షోలకు సంబంధించిన టెలివిజన్ రేటింగ్స్ వెల్లడయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలోని 26వ వారంలో నమోదైన టీఆర్పీ గణాంకాల్లో ఎప్పటిలానే జబర్దస్త్, ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్ అద్భుతమైన రేటింగ్‌తో దూసుకెళ్తున్నాయి. తాజా వారానికి సంబంధించి వివిధ షోలకు సంబంధించిన రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే...

జీటీవీలో డ్రామా జూనియర్స్
జీ టెలివిజన్ తెలుగు ఛానెల్ విషయానికి వస్తే...... అత్యధికంగా డ్రామా జూనియర్స్ అత్యధికంగా టీఆర్పీని సొంతం చేసుకొన్నది. 26వ వారంలో డ్రామా జూనియర్స్ అర్బన్ ప్రాంతంలో 4.21, రూరల్ ప్రాంతంలో 4.43 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. బతుకు జట్కా బండి ఒరిజినల్ అర్భన్ ప్రాంతంలో 2.07, రూరల్‌లో 2.36 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. మిగితా నాన్ సీరియల్ షో పెద్దగా రేటింగ్‌ను రాబట్టలేకపోయాయి.

స్టార్ మాలో సుమక్క స్టార్ మ్యూజిక్
స్టార్ మా తెలుగు ఛానెల్ విషయానికి వస్తే.. సీరియల్ విభాగంలో టాప్ 5 సీరియల్స్‌ను తన ఖాతాలో వేసుకొన్న ఈ ఛానెల్ నాన్ సీరియల్ విభాగంలో సత్తా చాటలేకపోయింద.ి ఈ ఛానెల్‌లో సుమ హోస్ట్‌గా నిర్వహించే స్టార్ మ్యూజిక్ అత్యధికంగా రేటింగ్‌ను సొంతం చేసుకొన్నాయి. ఈ షో అర్బన్ ప్రాంతంలో 5.31, రూరల్‌లో 6.51 రేటింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత ఓంకార్ హోస్ట్‌గా నిర్వహించే సిక్త్స్‌సెన్స్‌కు అర్బన్‌లో 4.54, రూరల్‌లో 6.21 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత కామెడీ స్టార్స్ షో 3.71 అర్బన్‌లో, 4.56 రూరల్‌లో నమోదు చేసింది.

అనసూయను మించిన రష్మీ గౌతమ్
ఇక ఈటీవీ తెలుగు ఛానెల్ విషయానికి వస్తే.. అత్యధికంగా మల్లెమాల ప్రొడక్షన్స్ రూపొందించే ఎక్స్‌ట్రా జబర్దస్త్ టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. 26వ వారంలో ఈ షో అర్బన్ ప్రాంతంలో 6.83, రూరల్ ప్రాంతంలో 9.47 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత స్థానంలో జబర్దస్త్ నిలిచింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అర్బన్‌లో 5.99 రేటింగ్, రూరల్‌లో 8.62 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్, శ్రీదేవి డ్రామా కంపెనీ నాలుగో స్థానంలో నిలిచాయి.

ఎక్స్‌ట్రా జబర్దస్త్ టాప్ రేటింగ్‌తో
ఒక ఓవరాల్‌గా నాన్ సీరియల్స్ విభాగంలో ఎక్స్‌ట్రా జబర్దస్త్ తొలి స్థానంలో, రెండోస్థానంలో జబర్దస్త్, మూడో స్థానంలో ఢీ13, నాలుగో స్థానంలో స్టార్ట్ మ్యూజిక్, ఐదో స్థానంలో శ్రీదేవి డ్రామా కంపెనీలు నిలిచాయి. మిగితా షోలు తమ పరిధి మేరకు ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Recommended Video

స్టార్ మా టాప్ రేంజ్‌లో
ఛానెల్స్‌లో అత్యధిక టీఆర్పీని నమోదు చేసిన ఛానెల్స్ ఏమిటంటే. స్టార్ మా అత్యధికంగా 949 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. జీ తెలుగు ఛానెల్స్ 758తో రెండోస్థానం, ఈ టీవీ తెలుగు 579, జెమినీ తెలుగు 415 రేటింగ్‌తో నాలుగోస్థానంలో నిలిచింది. స్టార్ మాను కార్తీక దీపం, ఇతర సీరియల్స్, అలాగే స్టార్ మ్యూజిక్ లాంటివి అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడ్డాయి.