»   » తాళం వేసిన ఎన్టీఆర్: బిగ్ బాస్ ఇంటి నియమాలు అతిక్రమిస్తే కఠిన శిక్ష!

తాళం వేసిన ఎన్టీఆర్: బిగ్ బాస్ ఇంటి నియమాలు అతిక్రమిస్తే కఠిన శిక్ష!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 'బిగ్ బాస్' తెలుగు షో ఆదివారం గ్రాండ్‌‌‌గా ప్రారంభం అయింది. మొత్తం 14 మంది పోటీ దారులను పరిచయం చేసిన అనంతరం ఎన్టీఆర్ ఈ షోలో అతి ముఖ్యమైన ఘట్టానికి తెరతీశారు.

14 మంది పోటీదారులను బిగ్ బాస్ ఇంట్లోకి పంపిన అనంతరం ఇంటికి తాళం వేశారు. తాళం వేసింది కేవలం బిగ్ బాస్ ఇంటికే.. ఆయన కంటికి కాదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

నిర్ణయించేది ప్రేక్షకులే

నిర్ణయించేది ప్రేక్షకులే

ఈ తాళాలు ఇపుడు ప్రేక్షకుల సొంతమని, ఎవరు, ఎప్పుడు బయటకు రావాలనేది నిర్ణయించేది ప్రేక్షకులే అని ఎన్టీఆర్ తెలిపారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో షో చూస్తుంటే మీరే అర్థమవుతుందని తెలిపారు. బిగ్ బాస్ చూస్తూనే ఉండండి, వచ్చే వారం కలుద్దామని చెప్పి ఎన్టీఆర్ వెళ్లి పోయారు. అనంతరం బిగ్ బాస్ ఇంటి నియమాలను సభ్యులకు వెల్లడించారు.

రూల్ నెం. 1

రూల్ నెం. 1

బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా ఎల్లప్పుడూ మైక్ ధరించి ఉండాలి. ఈ మైక్ ద్వారా వారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలను బిగ్ బాస్ ఎప్పటికప్పుడు వింటూ ఉంటాడు.

రూల్ నెం.2

రూల్ నెం.2

ఇంట్లో అందరూ కేవలం తెలుగులోనే మాట్లాడాలి. బిగ్ బాస్ షో కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాబట్టి....ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ మాట్లాడటానికి వీల్లేదనే కండీషన్ పెట్టారు.

రూల్ నెం. 3

రూల్ నెం. 3

బిగ్ బాస్ ఇంట్లో లైట్లు ఆర్పక ముందు నిద్ర పోవడం నిశిద్దం. పోటీ దారులపై బిగ్ బాస్ చాలా ఖర్చు పెడుతున్నాడు కాబట్టి షో జరిగే సమయంలో వారు నిద్ర పోతే తమ మనీ వేస్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ ఈ రూల్ పెట్టినట్లు తెలుస్తోంది.

రూల్ నెం. 4

రూల్ నెం. 4

బిగ్ బాస్ ఇంట్లో సభ్యులు ఎటువంటి హింసకు పాల్పడరాదు. షోలో ఇదే అతి ముఖ్యమైన రూల్. ఎవరైనా హింసకు పాల్పడితే వారిని షో నుండి ఎలిమినేట్ చేయడం ఖాయం. వీటితో పాటు ఏ రూల్ అతిక్రమించినా కఠిన శిక్ష తప్పదని బిగ్ బాస్ తెలిపారు.

రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్... బిగ్‌బాస్ షోలో ధన్ రాజ్ మీద ఎన్టీఆర్ ఆగ్రహం!

రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్... బిగ్‌బాస్ షోలో ధన్ రాజ్ మీద ఎన్టీఆర్ ఆగ్రహం!

రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్... బిగ్‌బాస్ షోలో ధన్ రాజ్ మీద ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంట్రీ లెవల్లోనే ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Telugu Bigg Boss rules revealed. The entry of the housemates was followed by Bigg Boss laying out the rules, which the contestants have to follow in the coming days. The rules, so far, consist of the contestants not removing their mikes, conversing only in Telugu and not sleeping before the lights are switched off.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu