»   » బుల్లితెర యాంకర్ ప్రదీప్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బుల్లితెర యాంకర్ ప్రదీప్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు ఎంటర్టెన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్. అటు బుల్లితెర కార్యక్రమాలు, ఇటు ఆడియో ఫంక్షన్లతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు.

సాధారణంగా మహిళలకు సంబంధించి బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల్లో ముందు నుండీ మహిళా యాంకర్ల హవా కొనసాగుతోంది. మేల్ యాంకర్స్ ఆ కార్యక్రమాలకు సెట్టడం చాలా అరుదు. అయితే ప్రదీప్ అలాంటి షోలను సైతం ఆసక్తికరంగా హ్యాండిల్ చేస్తుండటంతో అతనికి డిమాండ్ పెరిగింది.

అలా మొదలైంది

అలా మొదలైంది

ప్రదీప్ పూర్తి పేరు ప్రదీప్ మాచిరాజు. హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజర్ కెరీర్ మొదలు పెట్టాడు. తనకున్న టాకింగ్ స్కిల్స్ రేడియో జాకీగా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. రేడియో జాకీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

టీవీ రంగంలోకి

టీవీ రంగంలోకి

అందరినీ ఆకర్షించేలా మాట్లాడే నేర్పరితనంతో పాటు యాంకరింగుకు సూటయ్యేలా గుడ్ లుకింగ్ ఉండటంతో లోకల్ టీవీ ఛానల్ లో అవకాశం వచ్చింది. ఆ షో సక్సెస్ కావడంతో ప్రదీప్ కు అవకాశాలు పెరిగాయి.

లేడీస్ ఫ్రోగ్రామ్స్

లేడీస్ ఫ్రోగ్రామ్స్

పూర్తిగా మహిళలకు సంబందించిన... ‘గడసరి అత్త-సొగసరి కోడలు' లాంటి టీవీ షోలు కూడా ప్రదీప్ విజయవంతంగా హ్యాండిల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతని యాంకరింగుకు డిమాండ్ పెరిగింది.

తొలి రెమ్యూనరేషన్

తొలి రెమ్యూనరేషన్

కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఈవెంట్ ఆర్గనైజర్ గా నెలకు రూ. 25 వేలు సంపాదించాడట. తర్వాత తొలిసారి రేడియో జాకీగా అవకాశం వచ్చినపుడు రూ. 20 వేలు అందుకున్నాడట. తొలి టీవీ షోకు రూ. 15వేలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది.

ఇపుడు భారీగా సంపాదిస్తున్నాడు

ఇపుడు భారీగా సంపాదిస్తున్నాడు

ప్రస్తుతం ప్రదీప్ ఒక్కో టీవీ షో ఎపిసోడ్‌కు రూ. 50వేల వరకు తీసుకుంటున్నాడట. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికైతే ఎపిసోడ్ కు రూ. లక్ష వరకు తీసుకుంటున్నాడని టాక్. నెలకు యావరేజ్ గా ప్రదీప్ సంపాదన రూ. 20 లక్షల వరకు ఉంటుందని టాక్.

English summary
Telugu TV anchor Pradeep charged Rs. 50000 for episode. Machiraju Pradeep is Most Popular and Loved TV Anchor, Praeep Started career as RJ in Radio Mirchi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu