»   »  వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు టీవీ నటి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు టీవీ నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Telugu tv artist arrested prostitution case hyderabad
హైదరాబాద్‌: మరో వ్యభిచార రాకెట్ బయిటపడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లో చాలా రోజులుగా గుట్టుగా సాగుతున్న హైటెక్‌ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఐటీ కంపెనీలకు కేంద్రమైన మాదాపూర్‌లోని సైబర్‌ టవర్‌‌స ప్రాంతంలో హైటెక్‌ పద్ధతుల్లో సాగుతున్న వ్యభిచార కూపాన్ని ఎస్‌వోటీ(స్పెషల్‌ ఆపరేషన్‌‌స టీమ్‌) పోలీసులు రట్టుచేశారు. 'లయ', 'హిమబిందు' వంటి టీవి సీరియళ్లలో నటించిన శ్రావణితోపాటు ఓ పారిశ్రామికవేత్త పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసు వివరాలను ఎస్‌వోటీ ఓఎస్‌డీ గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు.

కేసు వివరాల్లోకి వెళితే... బంజారాహిల్‌‌సకు చెందిన మధు అలియాస్‌ మదన్‌ మాదాపూర్‌లోని ఫార్చ్యూన్‌ టవర్‌‌సలో ఫ్లాట్‌ నెంబర్‌ 203ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతున్నాడు. సమాచారమందుకున్న ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం ఫార్చ్యూన్‌ టవర్‌‌సపై దాడి చేయగా టీవీ సీరియల్‌ ఆర్టిస్టు, గుంటూరుకు చెందిన శ్రావణి(23), జీడిమెట్లకు చెందిన 'జయరాజ్‌ స్టీల్‌ కంపెనీ' యజమాని సజ్జన్‌కుమార్‌ గోయెంక(55) పట్టుబడ్డారు. దాడిని పసిగట్టిన మదన్‌ పరారయ్యాడు. అతని సహాయకుడు వెంకటరమణ(20)ను పోలీసులు అరెస్టు చేశారు.


టీవీ ఆర్టిస్టుతో ఒక రోజు గడిపేందుకు రూ. లక్ష చెల్లించేలా మదన్‌, గోయెంక మధ్య ఒప్పందం కుదిరింది. పోలీసులు గోయెంక నుంచి రూ.2 లక్షలు, రెండు సెల్‌ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. చూడ్డానికి నీట్ గా ఉండే ఆ భవనంలో ఉన్న ఒక్కో ఫ్లాటు రూ. రెండున్నర కోట్లు పలుకుంది. నెలకు లక్ష రూపాయలు చెల్లిస్తూ ఓ ఫ్లాటును అద్దెకు తీసుకున్న నిర్వాహాకుడు... ఈ బుల్లితెర తారలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. అమ్మాయిల మోజులో అక్కడికి వస్తున్న వారంతా పెద్దపెద్ద వాళ్ళే. ఒక గంట అమ్మాయితో గడుపాలంటే లక్ష రూపాయలు.

వ్యభిచార గృహ నిర్వాహకుడు మధు అలియాస్ మధన్ పరారీలో ఉన్నాడు. వైజాగ్‌కు చెందిన మధు రెండు మూడు నెలలుగా ఈ ఫ్లాట్‌ను నెలకు రూ.లక్షకు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. బడా బాబులు, ప్రముఖులతో సంబంధాలు కలిగి, అందమైన యువతులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మధు, విఠుల నుంచి గంటకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు. నిందితులను పీటీ యాక్టు కింద అరెస్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు, తదుపరి దర్యాప్తు నిమిత్తం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. శ్రావణిని రెస్‌క్యూ హోంకు తరలించారు.

నిర్వాహకుడు మధన్ చిక్కితే మరింత సమాచారం లభిస్తుందని, ఇంకా ఎవవరి పాత్ర ఉందో దర్యాప్తులో వెల్లడవుతుందని గోవర్ధన్‌డ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో ఫ్లాట్ యజమాని పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన మాదాపూర్‌లో సంచలనం రేకెత్తించింది. అంత్యంత సంపన్నులు ఉన్న ఫార్చూన్ టవర్స్‌లో చీకటి బాగోతం సాగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు షాక్‌కు గురయ్యారు.

English summary
Another actress in TV Media Sravani and industrialist Goyanka was arrested by Madapur police for their acts of brothels yesterday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu