»   » తెలుగు టీవీ సీరియల్ నిర్మాత మృతి...ఆందోళన

తెలుగు టీవీ సీరియల్ నిర్మాత మృతి...ఆందోళన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన టెలివిజన్ సీరియల్ నిర్మాత పీ శంకర్ బుధవారం సాయత్రం మృతిచెందాడు. సకాలంలో వైద్యం అందలేదని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శంకర్ మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన పీ శంకర్ (37) కొన్ని సీరియళ్లకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా,ఛానెల్ కు నిర్మాతలకు మధ్య వారధిగానూ వ్యవహరించారు. మొగలి రేకులు, గోరంత దీపం సీరియల్స్ కు ఆయన పనిచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Telugu tv serial producer died

శంకర్‌కు తీవ్ర కడుపునొప్పి రావటంతో బుధవారం అతన్ని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శంకర్‌కు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించి, స్లైన్ ఎక్కించారు. మూడుగంటలపాటు శంకర్‌కు వైద్యం అందించిన తర్వాత పరిస్థితి విషమించిందని చెప్పారు.

నగరంలోని మరో ఆస్పత్రికి తరలించాలని చెప్పడంతో ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి శంకర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. శంకర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Telugu tv serial producer Shankar died hyderabad.
Please Wait while comments are loading...