Wild Card Entry: బిగ్ బాస్ 9 హౌజ్‌లోకి ముగ్గురు కామనర్స్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఛాన్స్.. కానీ ట్విస్ట్ ఇదే!
తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కు తెలుగు టీవీ ఆడియెన్స్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇక్కడ 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరింత ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ గేమ్ షో అప్పుడే 2 వారాలను కూడా పూర్తి చేసుకుంది. అంతే కాదు ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కూడా జరిగిపోవడంతో ఆట మరింత రసవత్తరంగా కొనసాగుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం చాలా ఆసక్తికరంగా సాగింది. హౌజ్ లోకి మొత్తం 15 మంది ఎంట్రీ ఇచ్చారు. అందులో 9 మంది సెలబ్రెటీ కంటెస్టెంట్స్, 6 గురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా మొత్తం 15 మంది హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఇద్దరు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 13 మంది ఉన్నారు. దీంతో వీరిలో నుంచి 3వ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నామినేషన్స్ లో 6 గురు కంటెస్టెంట్స్ ఉండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌజ్ లో ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అస్త్రాన్ని వాడబోతున్నారు. కానీ చిన్న ట్విస్ట్ ఉంది. ఈసారి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేది మాత్రం సెలెబ్రెటీ కంటెస్టెంట్ కాదు. ఆ అవకాశాన్ని కామనర్స్ కు అందించారు బిగ్ బాస్. అది కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎంతో పోరాడి టాప్ 13లో నిలిచి తిరిగి వెళ్లిపోయిన 7 గురిలో ముగ్గురిని సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. వారు ఎవరో కాదు. షెకీబ్, దివ్య, నాగ ప్రశాంత్ కావడం విశేషం.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. వీరిలో వైల్డ్ ఎంట్రీ ద్వారా ముగ్గుగు హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తారా? అంటే కాదు. వీరిలో ఒక్కరిని మాత్రమే హౌజ్ లోకి పంపిచబోతున్నారు బిగ్ బాస్. బుధవారం రాత్రి లేదంటే గురువారం ఉదయం వీరి ముగ్గురిలో ఒకరు మాత్రమే హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తారు. అంతే కంటే ముందు ఆ ముగ్గురు కామనర్స్ కు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వబోతున్నారంట. అందులో గెలిచిన మొదటి కామనర్ ను హౌజ్ లోకి పంపించబోతున్నారు. మిగిలిన ఇద్దరు ఎప్పటి లాగే వెనుదిరిగాల్సి ఉంటుంది.
ఇక వీరి ముగ్గురులోకి ఎవరు హౌజ్‌లోకి ఎవరు వెళ్లబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటికే మొదటి వారంలో టాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది. ఇక 2వ వారంలో కామనర్ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక 3వ వారం నామినేషన్ లో రీతూ చౌదరి, రాము రాథోడ్, ఫ్లోరా షైనీ, డాక్టర్ ప్రియా, కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీశ్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











