14వ ఏటే లైంగిక వేధింపుల అనుభవం ఉందన్న టీవీ నటి

By Srikanya

Saakshi Tanwar
ముంబై: డిల్లీ గ్యాంగ్ రేప్ జరిగిన నేపధ్యం లో పలువరు తమ తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మన సమాజంలో సంఘటనలు జరుగతున్నాయని, అయితే తాము ఎదుర్కోలేకపోతున్నామని అంటున్నారు. తాజాగా ప్రముఖ టీవి నటి సాక్షి తన్వర్‌ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

సాక్షి మాట్లాడుతూ... ''రాజధానిలో డీటీసీ బస్సులో ప్రయాణం అంత సులభం కాదు, 14వ ఏటే లైంగిక వేధింపులు అంటే ఏమిటో తెలుసుకున్నా'' అని తెలిపారు. ముంబైలోని ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇలా స్పందించారు. అయితే నా కుటుంబం నాకు తోడు ఉన్నా సరైన అవగాహన లేకపోవటంతో ఇలాంటివి ఎదుర్కోలేకపోయానని గతం గుర్తు చేసుకున్నారు.

ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ.... ''ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ వ్యక్తి అలా అసభ్యంగా ప్రవర్తించగానే ఇంటికి వెళ్లి ఏడ్చాను. అప్పుడు, అమ్మా, అక్కా ఏం జరిగిందని అడిగారు. జరిగింది చెప్పిన తర్వాత ఆ సమయంలో ఎందుకు వాడిని కొట్టలేదు? గట్టిగా ఎందుకు అరవలేదు అని అడిగారు. కానీ, అలాంటి సందర్భాలను ఎలా ఎదుర్కోవాలో నాకు అప్పట్లో అవగాహన లేదు. ఆ సంఘటన తర్వాత ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మౌనంగా ఉండలేదు అన్నారు.

ఇక ఈ విషయంలో నా కుటుంబ సభ్యుల అండగా ఉండటం కూడా ధైర్యాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ తమ అమ్మాయికి తగిన సూచనలు ఇవ్వాలి. ఈవ్‌ టీజింగ్‌లను చూసీ చూడనట్లు వదిలేయాలని కొంతమంది తమ అమ్మాయిలకు చెబుతారు. ఆ మార్గంలో వెళ్లొద్దని అంటారు. అయితే 'మార్గాలు, దుస్తులు, సమయాన్ని మార్చడం అనేది సరైన పరిష్కారం కాదు' అని సాక్షి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X