For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani 4 August Episode : గంగయ్య గుట్టు పట్టేసిన యజ్ఞ... గండంలో జాస్మిన్ అండ్ కో?

  |

  తెలుగు లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ నెంబర్ గా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నది. బెంగాలీ లో సూపర్ హిట్ గా నిలిచిన త్రినయని సీరియల్ ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో మంచి రేటింగ్స్ రావడంతో దీనిని కన్నడ భాషలోకి కూడా డబ్బింగ్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్ కు సంబంధించి తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  photos courtesy : zee telugu+ zee5 app

  నిన్న ఏమైదంటే

  నిన్న ఏమైదంటే

  నిజానికి నిన్నటి ఎపిసోడ్ ప్రకారం నయనీ కాళ్లకు గాజు పెంకులు గుచ్చువడంతో ఇంటికి వచ్చాక ఆమె తన కాళ్లకు పసుపు పూసుకుంటూ ఉంటుంది. విశాల్ కూడా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చి స్వయంగా తన చేతులతో ఆమె కాళ్ళకు పసుపు వస్తాడు. ఇక ఆ తర్వాత హాసిని తనకు దేవత పూనాలేదని అయినా సరే జాస్మిన్ ఆట కట్టించాలని దేవత పోలినట్లుగా నాటకం ఆడి ఆమెను దెబ్బలు కొట్టానని వెల్లడిస్తుంది. ఇక నయని తన భర్త విశాల్ కి దిష్టి చుక్క పెట్టి ఆయన మీద ఉన్న దిష్టి అంతా పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. అలా నిన్నటి ఎపిసోడ్ మొత్తం ముగించారు.

  పరశురామ్ ఎంట్రీ

  పరశురామ్ ఎంట్రీ

  ఇక తాజా ఎపిసోడ్ లో గంగాధర్ విశాల్ తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. గంగయ్య వేషంలో ఉన్న తాను ఎప్పటికీ గంగాధర్ గా మారతానో తెలియడం లేదని అంటాడు. అయితే ఈ విషయాలన్నీ నాకు తెలిసినా నేను ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నా అని నువ్వు అనవసరంగా తిలోత్తమని చంపే ప్రయత్నం చేసి దొరికిపోయే వాడివని హెచ్చరిస్తాడు. అయితే వీళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను పరశురామ్ దొంగచాటుగా వినేందుకు ప్రయత్నం చేస్తాడు.. ఈ విషయం తెలిసిన వెంటనే విశాల్ తండ్రి తన చేతిలో ఉన్న కాఫీ కప్పు విసిరికొట్టి గంగాధర్ కు పరశురాం వింటున్నాడు అని తెలిసేలా చేస్తాడు. మళ్లీ పిచ్చివాడిలా నటిస్తూ నాకు కాఫీ ఎందుకు తెచ్చావు నాకు ఇది నచ్చలేదు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు.

  యజ్ఞ ఫోన్ స్విచ్ ఆఫ్

  యజ్ఞ ఫోన్ స్విచ్ ఆఫ్


  లోపలకు వచ్చిన పరశురాం ఇలా ఎందుకు సేవలు చేస్తున్నావు నువ్వు కూడా నా లాగా తిని కూర్చోవచ్చు కదా అంటే తాను తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ కూర్చోలేను అని ఏదో ఒక పని చేస్తేనే తనకు ఆనందంగా ఉంటుందని గంగయ్య చెబుతాడు. మరోపక్క జాస్మిన్ స్నేహితురాలు యజ్ఞ అజ్ఞాతంలో ఉండడంతో ఏం చేయాలో పాలుపోక సోషల్ మీడియా మొత్తం తిరగేస్తూ ఉంటుంది.

  అదే సమయంలో జాస్మిన్ ఒక సెల్ఫీ ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంతో ఆ సెల్ఫీ లో ఉన్న ఒక ముసలాయన ఎవరూ అంటూ ఆమెకు యజ్ఞ ఫోన్ చేసి అడుగుతుంది. ఎవరో దారిన పోయే దానయ్య లాంటి వాడని ఇంట్లో ఉంటున్నాడని చెప్పడంతో నీలాగే ఉంటూన్నాడు అంటూ పరిహాసం ఆడుతుంది యజ్ఞ. అయితే వార్నింగ్ ఇచ్చిన జాస్మిన్ ఎప్పుడు అలా మాట్లాడవద్దని అంటుంది. వీళ్లు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా యజ్ఞ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది.

  యజ్ఞ పట్టేసింది

  యజ్ఞ పట్టేసింది

  దీంతో ఆమె మళ్ళీ తర్వాత చేద్దాం అనుకుంటుంది. అయితే గతంలో ఒకసారి తాను రోడ్డు మీద నిలుచుంటే గంగాధర్ గంగయ్య గా మారుతూ తగిలించుకున్న దృశ్యాలు గుర్తుకు వస్తాయి.. అప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే తాను రవీంద్రభారతిలో ఒక నాటకం ఆడుతున్నానని గంగయ్య అబద్ధం చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది. ఈ విషయాన్ని ఎలా అయినా వెంటనే జాస్మిన్ కి చేరవేయాలని ఆమె భావిస్తుంది.

  పోలీసులు పట్టేశారు

  పోలీసులు పట్టేశారు


  ఇక మరోపక్క విశాల్ నయనిని చంపడానికి వచ్చిన వ్యక్తి దగ్గర లాక్కున్న ఫోన్ పోలీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు దర్యాప్తు జరిపి యజ్ఞని కనిపెడతారు. ఆమె ఫోటో విశాల్ కి పంపి ఈమెను ఎప్పుడైనా చూశారా మీ భార్యను చంపడానికి చూసింది ఈమె అని చెబుతారు. ఎవరు అని ఆలోచిస్తున్న సమయంలో నయని లోపలికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు అంటే పోలీస్ ఆఫీసర్ తో ఉంటాడు నేను కూడా మాట్లాడతాను అని అమాయకంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కాక ఈమె నిన్ను చంపడానికి చూసింది అని ఆమె ఫోటో చూపిస్తాడు..

  Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
  అలక్ష్మీ కోసం

  అలక్ష్మీ కోసం

  అయితే చంపడానికి చూసిన విషయం అర్థం కాక పిల్ల బాగుంది పెళ్లి చేయాలా అని అడుగుతుంది. మంచి పిల్లాడిని చూడమంటే నిజమే అనుకొని సరే చూద్దాం అంటుంది అయితే ఆమె నిన్ను చంపడానికి ప్రయత్నించింది అంటూ విశాల్ కి వెల్లడిస్తాడు. దీంతో ఆమె ఆలోచనలో పడుతుంది. ఇక మరోపక్క భోజనానికి సిద్ధమైన తరుణంలో కూరలో పులుపు, కారం ఎక్కువ ఎందుకు వేసి వండావని అందరూ ఆమెను అడుగుతారు. లక్ష్మీదేవి సోదరి అలక్ష్మి దేవికి అలా ఇష్టం కాబట్టి ఆమె కోపానికి గురి కాకుండా ఇలా వండాను అని ఆమె చెబుతుంది. దీంతో పెద్దవాళ్ళు అందరూ మెచ్చుకోగా ఎప్పటి లాగే మిగతా వాళ్ళు మొహాలు మాడుస్తారు. ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది వేచి చూడాల్సిందే.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Trinayani Episode ( 373 ): Yagna notices Gangayya in Jasmine’s photo and remembers seeing him put on a disguise. Chandrashekar sends Yagna’s photo to Vishal and tells him that she had hired the killer to murder Nayani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X