Trinayani Serial July 28 Episode: నయని మర్డర్ ప్లాన్ లో ట్విస్ట్.. విశాల్ ఎంట్రీతో షాక్!

బెంగాలీ భాషలో సూపర్ హిట్ గా నిలిచిన త్రినయని అనే సీరియల్ ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ కావడంతో అదే పేరుతో కన్నడంలోకి కూడా డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో అయితే ఈ సీరియల్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. రోజురోజుకు సీరియల్ క్రేజ్ పెరుగుతోంది అనే చెప్పాలి.

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మర్డర్ ప్లాన్

మర్డర్ ప్లాన్

ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రకారం నయని తన భర్త మొదలు పెడుతున్న కొత్త కంపెనీ శంకుస్థాపన కోసం వెళుతుంది. అక్కడ ఆమె రిబ్బన్ కట్ చేస్తున్న సమయంలో ఆమె మీద బరువైన వస్తువు పడేసి హత్య చేయాలని భావిస్తారు తిలోత్తమా అండ్ కో. నిన్నటి ఎపిసోడ్ ప్రకారం ఆమె రిబ్బన్ కట్ చేసే వరకు వెళుతుంది/ ఆ తర్వాత ఆమె మీద హత్యా ప్రయత్నం జరిగిందా లేదా అనే దాన్ని ఈరోజు ఎపిసోడ్ లో చూపించారు.

 టెన్షన్ లో తిలోత్తమ

టెన్షన్ లో తిలోత్తమ

అందరి కరతాళ ధ్వనుల మధ్య నయని రిబ్బన్ కట్ చేసేందుకు ముందుకు వెళుతుంది. అయితే ఆమె మీద ఖచ్చితంగా బరువైన వస్తువు పడుతుందని తెలిసి తిలోత్తమ, జాస్మిన్, పరశురామ్ ముగ్గురు వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించారు. అందరి దృష్టి తిలోత్తమ కట్ చేసే రిబ్బన్ మీదే ఉంటుంది కాబట్టి వీళ్ల ముగ్గురిని ఎవరూ పట్టించుకోలేదు.

 ప్లాన్ కోసం సిద్ధం

ప్లాన్ కోసం సిద్ధం

వెనక్కి వెనక్కి జరుగుతూ ఇక తమ మీద పడదు అని నిర్ధారించుకున్న తర్వాత ఈ ముగ్గురు ఆగిపోయి చూస్తూ ఉంటారు. తమ మీద ఎలాంటి డౌట్ రాకుండా అందరితో కలిసి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంతలో తిలోత్తమా డబ్బులిచ్చి పెట్టిన సుపారీ కిల్లర్ నయనిని చంపబోతాడు. తన చేతిలో ఉన్న బరువైన వస్తువును కిందికి వదిలే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

విశాల్ ఎంట్రీతో

విశాల్ ఎంట్రీతో

ఇంకేముంది అది వదిలగా కింద పడిపోతుంది అని నయని చచ్చిపోతుంది అని భావిస్తున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా విశాల్ ఎంట్రీ ఇస్తాడు. ఆ బరువైన వస్తువుని పట్టుకుని ఆపుతాడు. అయితే విశాల్ ఎవరో తెలియని సుపారీ కిల్లర్ విశాల్ ని వదిలించుకుని అయినా ఆమెను చంపాలని విశ్వప్రయత్నం చేస్తాడు.

ఫోన్ లో ఏముంది?

ఫోన్ లో ఏముంది?

అయితే విశాల్ బలం ముందు ఆ సుపారీ కిల్లర్ కూడా నిలవలేక పోతాడు. కొంతసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. తర్వాత విశాల్ ధాటికి తట్టుకోలేక అతను పారిపోతాడు. అయితే అతను పారి పోతున్న సమయంలో అతని ఫోన్ కింద పడిపోతుంది అతను వెళ్ళాక ఆ ఫోన్ ని గమనించిన విశాల్ ఆ ఫోన్లో ఉన్న డయల్ నెంబర్స్ అలాగే రిసీవ్ నెంబర్ ద్వారా అతనిని ఎవరు పురమాయించారు అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి చేస్తాడు.

 దొరికిపోయామా?

దొరికిపోయామా?

అయితే అతనికి పరిచయం ఉన్న నెంబర్లు లాగా ఏవీ అనిపించవు. దీంతో వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరినీ ఒకచోట సమావేశ పరుస్తాడు. శత్రువులు తనకు మాత్రమే లేరని తన భార్య కూడా శత్రువులు ఏర్పడ్డారు అని ఈరోజు శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆమె మీద మర్డర్ చేశారు అని చెప్పి బాంబు పేల్చాడు. దీంతో తిలోత్తమా, పరశురాం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని దొరికిపోయా అన్నట్టు భయపడిపోతుంటారు.

ఎవరు చేశారు ? ఎందుకు చేశారు

ఎవరు చేశారు ? ఎందుకు చేశారు

అయితే విశాల్ మాత్రం వీరిద్దరి చేశారనే విషయం తెలియక పోవడంతో ఇలా మర్డర్ అటెంప్ట్ జరిగిందని త్వరలోనే ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? అనే విషయాలు కనిపెడతా అని అంటాడు. అయితే ఇలా నయని మీద మర్డర్ అటెంప్ట్ చేయడం జరిగింది అని తెలియగానే మిగతా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X