For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani : షాక్ లో తిలోత్తమ.. ఆ పని చేయడంతో సేఫ్, నయని మర్డర్ కేసు చిక్కుల్లో జాస్మిన్ ?

  |

  జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బెంగాలీ భాషలో త్రినయని పేరుతో తెరకెక్కిన ఈ సీరియల్ అక్కడ సూపర్ హిట్ కావడంతో దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   హత్యా ప్రయత్నం

  హత్యా ప్రయత్నం

  ఇక నిన్నటి ఎపిసోడ్ లో శంకుస్థాపన చేయడానికి వెళ్ళిన నయనీ మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. అయితే నయనీ శంకుస్థాపన చేయడం చూడాలని వచ్చిన విశాల్ ఈ వ్యవహారం అంతా గమనించి వెంటనే చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుంటాడు. అతనిని కొట్టి కింద పడేశాడు. అయితే అతనిని ఎవరు పంపారు అని చెప్పమని అడిగితే అతను అసలు నోరు విప్పడు. విశాల్ నుంచి తప్పించుకుని అతను పారిపోతాడు కానీ విశాల్ కి అతని ఫోన్ దొరుకుతుంది. దీంతో వెంటనే ఇంటికి వచ్చిన విషయం ఇంట్లో ఉన్న అందరిని పిలుస్తాడు.

   దొరికేస్తారా

  దొరికేస్తారా

  శత్రువులు తనకు మాత్రమే కాదని తన భార్య నయనికి కూడా ఏర్పడ్డారని అంటాడు. ఆమెను చంప పోతే తాను వెళ్ళాను కాబట్టి కాపాడానని లేకపోతే ఆమె తనకు దక్కేది కాదని అంటాడు. అయితే ఎవరు చంపడానికి చూశారు అనేది తాను కనిపెడతా అని వాళ్ళను మాత్రం వదిలేది లేదని హెచ్చరిస్తాడు.. అయితే బయటి వాళ్లు లోపలికి రావడానికి అవకాశం లేదని కనీసం కారు లోపలికి వెళ్లాలన్నా పాస్ చూపిస్తేనే వదులుతానని కాబట్టి ఇది బయటివారి పని మాత్రం కాదని ఇంట్లో వాళ్ళు అంటారు. అయితే అందరూ తిలోత్తమ, పరశురాం దొరికిపోతారు అని భావిస్తుండగా తిలోత్తమ, పరశురాం కూడా భయపడినట్లు కనిపిస్తూ ఉంటారు.

  మనం సేఫ్

  మనం సేఫ్

  అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి, ఇకమీదట జాగ్రత్తగా ఉండమని తిలోత్తమ అంటే అలా ఊరికే వదిలేయనని అతని ఫోన్ తనకు దొరికిందని ఆ ఫోన్ ద్వారా వాడికి ఎవరు సుపారీ ఇచ్చారు ? ఎవరు చంపడానికి ప్రయత్నించారని విషయం తెలుసుకుంటానని విశాల్ అంటాడు.. దీంతో షాక్ అవ్వడం తిలోత్తమ వంతవుతుంది. కానీ ఆమె మళ్ళీ కాస్త ధైర్యం తెచ్చుకుంది.. గదిలోకి వెళ్ళిన పరశురామ్ తిలోత్తమతో అక్క మనం దొరికిపోయినట్లేనా, ఇంకా మన పరిస్థితి అయిపోయినట్లేనా అంటే కాదని అసలు మనం రౌడీని పురమాయించ లేదని అంటుంది..

  జాస్మిన్ దొరికేసినా నమ్మరు

  జాస్మిన్ దొరికేసినా నమ్మరు

  మర్డర్ చేయిస్తున్నామని జాస్మిన్ కి చెబితే జాస్మిన్ తన స్నేహితురాలు యజ్ఞతో చెప్పి ఈ రౌడీని పెట్టింది అని అంటుంది. ఒకవేళ యజ్ఞ దొరికేస్తే, యజ్ఞ ద్వారా జాస్మిన్ దొరుకుతుంది కానీ మనం ఈ వ్యవహారంలో ఉన్నామని జాస్మిన్ చెప్పినా విశాల్ నమ్మడు అని మనల్ని ఇరికించడానికి చెబుతుందని అనుకుంటాడు అని అంటుంది.. ఇక ఇదంతా జరుగుతున్న సమయంలో విశాల్ నయని గురించి బాధపడుతూ ఉంటాడు. ఆమెకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అని భయపడుతూ ఉంటాడు.

  బోనాలు ఎవరు తీసుకు వెళ్ళాలి

  బోనాలు ఎవరు తీసుకు వెళ్ళాలి

  అయితే నయని అలా ఏమి భయపడొద్దు అని మనకు ఏమీ కాదని మనకి ఆ అమ్మవారు తోడుగా ఉంటుందని అంటుంది. ఇక వీరిద్దరి మధ్య కాస్త సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇక మరోపక్క బోనాల పండుగ రావడంతో ఇంటి నుంచి బోనాలు ఎవరు తీసుకు వెళ్లాలా అనే చర్చ మొదలవుతుంది. నయని బోనాలు తీసుకువెళ్లాలని నానమ్మ ఫిక్స్ అవుతారు. అయితే ముందు ఇంట్లో అందరినీ పిలిచి ఈ విషయం చెప్పాలని లేదంటే ఇంట్లో వాళ్ళందరూ ఆలోచనలు చేస్తారని అంటాడు విశాల్.

   ఎప్పటికీ కొత్త కోడలే

  ఎప్పటికీ కొత్త కోడలే

  దీంతో అందరినీ రమ్మని పిలుస్తారు. ఎవరు బోనాలు తీసుకు వెళ్ళాలి అంటే ఎప్పటిలాగే కొత్త కోడలు తీసుకు వెళుతుందని అంటుంది నానమ్మ.. రెండేళ్లయినా ఇంకా కొత్త కోడలు, కొత్త కోడలు అని అంటే తనకు చిరాకు వస్తోందని జాస్మిన్ అంటుంది. అయితే ఇంట్లో చెత్త బయటపడేసే ఎప్పటికప్పుడు ఇంటిని కొత్తగా ఉంచే ఆమె ఎప్పటికీ కొత్త కోడలే అని విశాల్ తండ్రి అంటారు. ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

  English summary
  Trinayani Episode ( 369 ): As Vishal decides to catch the culprit, Jasmine calls her friend Yagna and cautions her. Tilottama is confident that she won’t fall in trouble. Vishal gets concerned about Nayani, who calms him down.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X