For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani : నయనిని గాయ పరచేందుకు జాస్మిన్ స్కెచ్.. రెడ్ విత్ బ్లడ్ అంటూ టెన్షన్ టెన్షన్!

  |

  జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్ మొదలయ్యి ఏడాది కావస్తున్నా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  ఏమైందంటే

  ఏమైందంటే

  నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లో ఆడవాళ్ళూ అందరూ బోనాలు తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా చూపించారు. నయని విశాల్ మధ్య రొమాన్స్, అలాగే నయనిని గాయపరచేందుకు ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంటుంది జాస్మిన్. ముందుగా ఈ ప్లాన్ దురంధరకు చెబితే నువ్వు వేసే ప్లాన్ లు అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయని నేను నీతో కలిసి రిస్క్ తీసుకోలేను అని ముఖం మీద చెప్పేస్తుంది. అయితే తిలోత్తమ మాత్రం జాస్మిన్ వేసే స్కెచ్ మీద నమ్మకం పెట్టుకుంది. ఒకవేళ ఫెయిల్ అయితే తమకేమీ ఇబ్బంది ఉండదు అనే నమ్మకంతో ఉంటుంది.

  మంచం కింద గంగాధర్

  మంచం కింద గంగాధర్

  ఎలా అయినా తిలోత్తమకు బుద్ధి చెప్పాలని గంగయ్య వేషంలో ఉన్న గంగాధర్ తిలోత్తమ మంచం బోల్టులు, నట్లు లూస్ చేస్తే ఆ మంచం కింద పడి తిలోత్తమ నడుం విరుగుతుందని ప్లాన్ చేస్తాడు. అలా ఎవరూ లేని సమయంలో తిలోత్తమ గదిలో దూరి మంచం కింద నట్లు లూజ్ చేస్తున్న సమయంలో తిలోత్తమ, పరశురామ్ గదిలోకి వస్తారు.. తాను ఫ్రెష్ అయ్యి వస్తాను ఇక్కడే ఉండమని చెప్పి తిలోత్తమ లోపలికి వెళుతుంది. ఈ లోపు పరశురాం తన పర్స్ తీసి అందులో ఉన్న 500 కాగితాన్ని తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇంత పెద్ద కోటేశ్వరుల ఇంట్లో ఉన్న తన జేబులో ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయని బాధపడుతూ ఉంటాడు.

   అమ్మో దెయ్యాలు

  అమ్మో దెయ్యాలు

  ఈ లోపు ఆ 500 కాగితం గాలికి ఎగిరి మంచం కింద పడుతుంది. కాసేపటికి ఆ డబ్బులు ఎక్కడ పడ్డాయి అని వెతుక్కుంటూ మంచం కింద దూరుతుంటే ఎక్కడ తనను చూసేస్తాడో అనే ఉద్దేశంతో గంగాధర్ 500 రూపాయల కాగితాన్ని చేతికి అందిస్తాడు.. ముందు సైలెంట్ గా డబ్బులు తీసి జేబులో పెట్టుకున్నా ఆ తర్వాత ఎవరో తనకు అందించినట్లు అనిపించిందని ఎవరు అందించారని కిందకు చూస్తే గంగాధర్ ఈలోపు నక్కుతాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఈ ఇంట్లో దేవుళ్ళు ఎంత మంది ఉన్నారో దెయ్యాలు కూడా అన్నే ఉన్నాయ్ అని భయపడుతూ ఇక మీదట పెందలాడే పడుకోవాలని ఫిక్స్ అవుతాడు పరశురాం.

   దురంధరకి నమ్మకం లేదు

  దురంధరకి నమ్మకం లేదు

  ఇక ఆ తర్వాత సీన్ అంతా బోనాలు తీసుకువెళ్లే గుడి దగ్గరకు చేరుతుంది, గుడి దగ్గరలో ఉన్న చెట్టు కింద బోనాలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు సుమన, నయని. అయితే గుడి లోపల వరకు వెళ్లడానికి మూడు గీతలు గీసి అని అందులో ఎర్ర గీత మీద గాజు పెంకులు వేశానని జాస్మిన్ ముందుగా దురంధరకు చెబుతుంది. అలాగే ఎర్ర గీత మీద నయని నడిచేలా చేసి ఆమె కాళ్లకు గాజు పెంకులు గుచ్చుకునేలా చేస్తానని, బోనాల కుండ కిందకి దింపుతాను అంటే అలా దింపడం కుదరదు కాబట్టి ఎవరూ ఒప్పుకోరు అని తిలోత్తమ అయితే కొట్టినా కొడుతుందని ఈ దెబ్బతో నయని పని అయిపోతుందని జాస్మిన్ ఉంటుంది.

  మామూలు స్కెచ్ కాదుగా

  మామూలు స్కెచ్ కాదుగా

  ఈ దురంధర తర్వాత తిలోత్తమకు కూడా ఇదే ప్లాన్ మొత్తం వివరిస్తుంది జాస్మిన్. అయితే ఆమె ఎర్ర గీత మీద కాకుండా వేరే గీత మీద నడిస్తే సుమన లేదా నువ్వు ఆ గాజు పెంకులకి బలి కావాల్సి వస్తుందని ఈ విషయం ముందే ఆలోచించావా అని అడుగుతుంది తిలోత్తమ. అంతా ఆలోచించే ప్లాన్ చేశాం అని కచ్చితంగా నయని ఎర్ర గీత మీదే నడుస్తుందని అంటుంది. అయితే ఇలా గీతలు గీసి ప్లాన్ చేసిన సంగతి కూడా ఇంట్లో అందరికీ చెబుతారు. గాజు పెంకులు ఉన్నాయన్న విషయం తప్పించి మిగతా అన్ని విషయాలు చెప్పి అందరూ సరే అని అంటారు.

  Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
  ఏం జరగబోతోంది?

  ఏం జరగబోతోంది?

  అయితే ఇందులో ఏదో తికమక ఉందని హాసిని భావిస్తుంది కానీ సుమన నడవాల్సిన గీత మీద జాస్మిన్ నడవాలని జాస్మిన్ నడవాల్సిన గీత మీద సుమన నడవాలని చెబుతుంది. అయితే నడకను మార్చగలం గాని తల రాతను మార్చలేము కదా అంటూ జాస్మిన్ అంతుంది. ఇక ఇప్పటితో నేటి ఎపిసోడ్ అయితే ముగించారు. తర్వాత ఎపిసోడ్ లో జాస్మిన్ కాళ్ళకు పెంకులు గుచ్చుకుంటాయా ? లేదా ? నయని ఆ గీత మీద నడుస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

  English summary
  Trinayani Episode ( 371 ): Gangadhar stealthily escapes from Tilottama’s room. At the temple, Jasmine tells Durandhara and Tilottama how she planned to injure Nayani’s feet while she carries the ‘bonam’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X