Trinayani Serial Today Episode July 14: తెల్లటి చీర మీద రక్తపు మరకలు.. జాస్మిన్ స్కెచ్ కి నయని కౌంటర్!

సినిమాల్లోనే కాదు సీరియల్స్ ని కూడా వదలడం లేదు. బెంగాలీ భాషలో సూపర్ హిట్టయిన త్రినయని అనే సీరియల్ ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ జీ ఫైవ్ ఛానల్ లో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతోంది.. నేటి నుంచి త్రినయని సీరియల్ గురించి కూడా వరుసగా ప్రివ్యూలలో తెలుసుకుందాం.

Photo Courtesy : Zee Telugu And Zee5

నిన్న ఏమైంది అంటే

నిన్న ఏమైంది అంటే

ఈ సీరియల్లో నయని లీడ్ రోల్ లో నటిస్తుంది. నయని జాస్మిన్ మధ్య ఆధిపత్య పోరు ఎప్పటిలాగే కొనసాగుతూ ఉంటుంది.. నిన్నటి ఎపిసోడ్ లో చూపించిన దాని ప్రకారం నయని, జాస్మిన్ ఇద్దరూ కూడా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంటారు. అయితే నయని వేసుకోవాల్సిన జాకెట్ ని జాస్మిన్ అండ్ కో నాశనం చేస్తారు. అయితే ఆపద్బాంధవుడులా వచ్చిన విశాల్ విషయం తన చొక్కా తీసి ఇవ్వడంతో ఆ గండం నుంచి గట్టెక్కడమే కాక అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

జాస్మిన్ స్కెచ్

జాస్మిన్ స్కెచ్

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నయని ఎప్పటిలాగే తన పనిలో బిజీగా ఉండగా జాస్మిన్ జైల్లో ఉన్న తన అన్నకి ఫోన్ చేసి విషయం అంతా చెబుతుంది. నయని అన్ని విషయాల్లోనూ తనకు పోటీ వస్తోందని అన్నిటిలోనూ ఆమె నెగ్గుతుందని అన్నకు చెబుతూ ఉంటుంది. అయితే జాస్మిన్ మాట్లాడుతున్న విషయాలన్నీ శివ(చిలుక) వింటూ ఉంటుంది. అయితే తన అన్న ఇచ్చిన సలహా మేరకు తనకు విశాల్ కి పెళ్లి చేయమని అడగాలని జాస్మిన్ ఫిక్స్ అవుతుంది.

తెల్లటి చీర మీద రక్తపు మరకలు

తెల్లటి చీర మీద రక్తపు మరకలు

జాస్మిన్ ఇలా ఆలోచిస్తున్న విషయం తెలుసుకున్న శివ వెంటనే వెళ్లి నయనితో విషయం అంతా చెబుతుంది.. ఇలా నీ కొంప ముంచడానికి జాస్మిన్ ప్రయత్నాలు చేస్తోందని చెప్పడంతో కాసేపు ఆలోచిస్తుంది. భవిష్యత్ తెలుసుకునే ప్రయత్నం చేయగా తెల్లటి చీర మీద రక్తపు మరకలు పడినట్లుగా కనిపిస్తాయి. దీంతో ఏదో జరగబోతోందని భావించి నిండుగా రెడీ అయ్యి కిందకి వెళుతుంది. ఆమె వెళ్లే లోపు జాస్మిన్ ఇంట్లో అందరినీ సమావేశపరిచి తనకు విశాల్తో పెళ్లి జరిపిస్తారా? లేదా అని టార్గెట్ చేస్తుంది.

ఆ సమస్యే లేదు

ఆ సమస్యే లేదు

అయితే ఎంట్రీ ఇచ్చిన నయని తాను విశాల్ కి విడాకులు ఇచ్చే ప్రస్తావనే లేదని అలాంటప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఎలా సాహసిస్తాడు అని ప్రశ్నిస్తుంది. దీంతో అసలు విషయానికి రెండో పెళ్లి అనే అవకాశమే లేదని తేల్చేస్తుంది. అయితే విశాల్ తనను పెళ్లి కూతురిని చేస్తానని మాట ఇచ్చాడు అని చెప్పగా విశాల్ అందుకుని మాట ఇచ్చిన మాట వాస్తవమే కానీ తనతో పెళ్లి జరుగుతుందని ఎక్కడా చెప్పలేదని మంచి అబ్బాయిని చూసి తానే పెళ్లి చేస్తాను అని చెబుతాడు.

రెండు నేలు అయిపోయిందిగా

రెండు నేలు అయిపోయిందిగా

ఇంతలో నయని కల్పించుకుని ఆమె పెళ్లి సంగతితో పాటు తన శోభనం సంగతి కూడా చూడాలని ఎందుకంటే రెండు నెలలు సమయం అడిగారు ఆ రెండు నెలలు సమయం పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు తనకు కూడా శోభనం జరిపించుకోవాలని ఉందని బయటపడుతుంది. అయితే ఆమె బయటకు వెళితే శోభనం చేస్తారని అందుకే తొందరగా పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలని జాస్మిన్ కి చెబుతుంది.

పెళ్ళా ? శోభనమా?

పెళ్ళా ? శోభనమా?

పెళ్లి చేసుకుని వెళతారా లేక శోభనం జరిపిస్తారా అని అడుగగా తాను ఈ ఇంట్లో ఉంటేనే తన పాచిక ఆయన భావించిన జాస్మిన్ వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కానీ తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని కానీ ఇక్కడే ఉంటాను అని చెబుతోంది.. దీంతో ఒక రకంగా నేటి ఎపిసోడ్ ముగిసినట్లు అవుతుంది. ఇక తరువాతి ఎపిసోడ్ లో నయని-విశాల్ శోభనానికి రంగం సిద్దం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X