Trinayani Serial Today Episode July 15: శోభనానికి రెడీ అయిన నయని.. జాస్మిన్ మరో స్కెచ్ ..ఏంటంటే!

తెలుగు సీరియల్స్ లో త్రినయని కూడా మంచి పేరు తెచ్చుకుంది.. బెంగాల్ లో సూపర్ హిట్ గా నిలిచిన త్రినయని సీరియల్ ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.. చంద్దు గౌడ, ఆషికా పడుకొనే లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Photos Courtesy: ZeeTelugu and Zee5 , ఫొటోస్ కర్టసీ : జీ తెలుగు అండ్ జీ5

నిన్న ఏమైందంటే

నిన్న ఏమైందంటే

నిజానికి నిన్నటి ఎపిసోడ్ ప్రకారం జాస్మిన్ తనకు విశాల్ కి పెళ్లి జరిపించాలని ఇంట్లో అందరి ముందు రచ్చ చేస్తుంది.. అయితే తనకు భార్య ఉండగా మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని విశాల్ తేల్చి చెబుతాడు. ఇక నయని కూడా పెళ్లి సంగతి పక్కన పెట్టి తనకు విశాల్ కి శోభనం జరిపించాలని అందరి ముందు కోరుతుంది.. నువ్వు వెళ్ళిపోతావా మా శోభనం జరిపించుకో మంటావా అని అడిగితే నేను వెళ్ళను మీరే శోభనం జరిపించుకోండి అని జాస్మిన్ చెబుతుంది.

బుల్లి బావ సరసాలు

బుల్లి బావ సరసాలు

ఇక నేటి ఎపిసోడ్ లో నయని చెల్లెలు బుల్లి బావ దగ్గరికి వెళ్లి తన టెన్షన్ తీరిపోయింది అని ఇప్పటి దాకా జాస్మిన్ నిన్ను పెళ్లి చేసుకుంటుంది ఏమో అని టెన్షన్ పడ్డాను అని ఇప్పుడు ఆ టెన్షన్ క్లియర్ అయిపోయింది అని చెబుతుంది.. బుల్లి బావని ప్రేమిస్తున్నట్టు కొన్ని హింట్స్ ఇవ్వడానికి ప్రయత్నించినా ఆయన అంతగా ఆసక్తి చూపించడు. మీరు ఎప్పటికీ నా పక్కనే ఉంటే నేను ఏదైనా చేస్తాను అంటే కచ్చితంగా ఉంటాను అని చెబుతాడు కానీ పట్టించుకోనట్టు వెళ్ళిపోతాడు.

దురంధర టెన్షన్

దురంధర టెన్షన్

ఇక మరో పక్క దురంధర జాస్మిన్ దగ్గరికి వెళ్లి అసలు ఎందుకు ఎలా ఒప్పుకున్నావు ఇప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు కాబట్టి ఏమైనా నీకు అతనికి పెళ్లి చేసే అవకాశం ఉంటుందని భావించానని, కానీ ఇలా చేయడంతో అసలు మీకు పెళ్లి అవుతుందా లేదా అని అనుమానం మొదలైంది అని అంటుంది. అదేమీ లేదని అసలు ఈ రోజు శోభనం ఎలా జరుగుతుందో చూస్తారని అంటుంది. దీంతో దురంధర జాస్మిన్ ఏదో స్కెచ్ వేసిందిలే అని కాస్త రిలాక్స్ అవుతుంది.

ఆడుతూపాడుతూ

ఆడుతూపాడుతూ

ఇక మరోపక్క హాసిని వీరిద్దరి శోభనం కోసం పూలు రెడీ చేసి మంచాన్ని సర్దుతూ ఉంటుంది. ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలో విశాల్ పిన్ని ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇవ్వడమే కాక మంచి ఉత్సాహంగా చేస్తున్నావు కదా అంటూ ఆమెను మరింత ఉత్సాహపరుస్తుంది. అయితే హాసిని ఎక్కడి నుంచి వెళ్లిపోవడంతో వీరిద్దరికీ పిల్లలు పుడితే ఆస్తి మనకి దక్కుతుందా ? దక్కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఈ కార్యం మాత్రం జరగనిద్దామని అంటుంది.

జాస్మిన్ స్కెచ్

జాస్మిన్ స్కెచ్

ఇదంతా జరుగుతున్న సమయంలో శివ విశాల దగ్గరకు వెళ్లి నయనితో జాగ్రత్త అని, ఆమె చాలా మంచిదని శోభనం రోజు జాగ్రత్తగా ఉండాలని రకరకాల జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఇక మరోపక్క హాసిని పాలు కాస్తూ బయటకు వెళ్లడంతో జాస్మిన్ పాలలో ఒక రకమైన మత్తు మందు కలుగుతుంది. ఈ మత్తుమందు ఐదు రోజుల పాటు కళ్ళు తిప్పి ఎలా చేస్తుంది అని చెబుతోంది. ఇక ఆ పాలు తీసుకుని నయని శోభనం గదిలోకి వెళ్లినట్లు చూపిస్తారు అంటే శోభనం ఫెయిల్ చేసేందుకు జాస్మిన్ వేసిన స్కెచ్ కనిపిస్తోంది. అయితే ఆ పాలు తాగుతారా లేదా అనే దాని మీద స్కెచ్ పని చేస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X