Trinayani Serial Today Episode July 16: తెల్లటి చీర మీద రక్తం..ప్లాన్ ఫెయిల్ అయినా ఆనందంలో జాస్మిన్

జీ తెలుగు చానల్లో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్లో లీడ్ రోల్ లో నటిస్తున్న త్రినాయని కి భవిష్యత్తు తెలిసే శక్తి ఉంటుంది. భవిష్యత్తు తెలుసుకునే శక్తి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది ? ఇబ్బందులను ఎలా తప్పించుకుంటుంది అనే విషయాన్ని సీరియల్ లో ఆసక్తికరంగా చూపిస్తున్నారు.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Photos Courtesy: ZeeTelugu and Zee5

నిన్నటి ఎపిసోడ్ లో

నిన్నటి ఎపిసోడ్ లో

నిన్నటి ఎపిసోడ్ ప్రకారం హాసిని నయని - విశాల్ శోభనం కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. మంచం సిద్దం చేసి పూలు చల్లుతూ ఆనందంగా ఉంటుంది. ఇంతలో పాలు కాస్తూ పక్కకు వెళ్లి వచ్చే లోపు జాస్మిన్ ఎంట్రీ ఇచ్చి పాలల్లో మత్తు మందు కలుపుతుంది. దీంతో ఆ పాలు తీసుకు వెళ్ళిన నయని - విశాల్ శోభనం అప్ సెట్ అవుతుందని జాస్మిన్ లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. అయితే మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది ? ఆ పాలు తాగారా లేదా అనేది తెలుసుకుందాం.

రొమాంటిక్ మూడ్ లో

రొమాంటిక్ మూడ్ లో

శోభనానికి సిద్ధమైన విశాల్ శోభనం గదిలోకి వెళ్లి ఎదురు చూస్తూ ఉంటాడు. నయని కూడా పాల గ్లాసు తీసుకుని శోభనం గదిలోకి వెళుతుంది. అలా లోపలికి వెళ్ళిన వారిద్దరి మధ్య సరస సల్లాపాలు మొదలవుతాయి. ఇద్దరి మధ్య అనేక రొమాంటిక్ సాంగ్స్ కూడా పెట్టి కాసేపు ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. అయితే ఈ లోపు ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందా అని బయట ఎదురు చూస్తూ ఉంటుంది జాస్మిన్.

బెట్

బెట్

హాసిని కూడా అక్కడికి వెళ్లడంతో ఈ శోభనం జరుగుతుందని హాసిని జరగదు అని జాస్మిన్ బెట్ కూడా పెట్టుకుంటారు. అది గెలిచినవారు ఓడిన వారిని ఒక కోరిక కోరుతారని ఆ కోరిక ఎప్పుడు ఎక్కడ ఎలా అడిగినా చేయాల్సిందేనని పట్టుబడుతుంది. దీంతో హాసిని కూడా ఈ బెట్ తనకి ఓకే అని బెట్ ఫైనల్ చేస్తుంది. ఇదంతా ఇలా జరుగుతున్న క్రమంలో విశాల్ అప్పుడే వాష్ రూమ్ కి వెళ్తాడు.

అనుకున్నంతా అయ్యింది

అనుకున్నంతా అయ్యింది

గ్లాసు పట్టుకున్న నయనికి భవిష్యత్తు కనిపిస్తుంది. తన తెల్లటి చీర మీద రక్తపు మరకలు పడినట్లు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురవుతుంది. షాక్ కి గురవడమే గాక అనుకోకుండా తూలి పడబోతూ ఉండడంతో చేతిలో ఉన్న గ్లాసులో కిందపడి ముక్కలవుతుంది. ఆమె వెనక్కి పడిపోతున్న క్రమంలో విశాల్ ఎంట్రీ ఇచ్చి ఆమె నడుం పట్టుకుని పడకుండా ఆపుతాడు. అయితే ఈ క్రమంలో విశాల్ పగిలిన గాజు ముక్కలు మీద కాలు వేయడంతో అనుకున్నంత అవుతుంది. ఆ రక్తం చింది తెల్లచీర మీద పడుతుంది.

Recommended Video

Farhan Aktha - Definitely Will Act If The Opportunity Arises To Act In Tollywood | Filmibeat Telugu
శోభనం క్యాన్సిల్

శోభనం క్యాన్సిల్

ఇక అలా శోభనం క్యాన్సిల్ అవుతుంది, శోభనం క్యాన్సిల్ అయిన తరుణంలో విశాల్ కి ఎలా ఉందో అని చూడడానికి వెళ్తున్నాను అని హాసిని చెప్పడంతో దురంధర, జాస్మిన్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు చూడాల్సింది విశాల్ ముఖం కాదని శోభనం ఫెయిల్ కావడంతో ఏడుస్తున్న నీ చెల్లి నయని మొఖం అని ఆటపట్టిస్తూ ఉంటారు. ఇక మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X