For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani Serial July 26 Episode: దొంగ కోసం నయని సూపర్ స్కెచ్.. దెబ్బకు దొరికేశారు!

  |

  తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో త్రినయని సీరియల్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. బెంగాల్లో సూపర్ హిట్ గా నిలిచిన సీరియల్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఇక తెలుగులో రీమేక్ చేసిన దాన్ని కన్నడ భాషలో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  గంగాధర్ జస్ట్ మిస్

  గంగాధర్ జస్ట్ మిస్

  శనివారం నాటి ఎపిసోడ్ లో నయని దాచిన పాతిక లక్షలు కొట్టేసిన పరశురాం ఆ డబ్బు తీసుకెళ్లి తిలోత్తమకి ఇస్తాడు తిలోత్తమ ఆ డబ్బును సుమన గదిలో దాచి సుమనను ఇంట్లోంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. మరోపక్క గంగాధర్ తిలోత్తమను చంపడానికి ప్రయత్నిస్తూ దొరికిపోతాడు అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే నయన అడ్డుకుంటుంది.

  అసలు ఏమైంది?

  అసలు ఏమైంది?

  ఇది ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో జాస్మిన్, దురంధర గంగాధర్ అసలు తిలోత్తమని ఎందుకు చంపబోయాడు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే అది మీకు తెలియదని హాసిని చెబుతుంది. ఎందుకంటే ఆ విషయం తనకు మాత్రమే తెలుసని మిగతా ఎవరికీ ఆ విషయం తెలిసే అవకాశం లేదని ఆమె అంటుంది. ఇదిలా జరుగుతుండగా శంకుస్థాపనకి బయలుదేరాలి పాతిక లక్షలు తీసుకురమ్మని విశాల్ నయనకు చెబుతాడు.

   డబ్బు మిస్సింగ్

  డబ్బు మిస్సింగ్

  విశాల్ డబ్బు తీసుకురమ్మనగానే నయని డబ్బు పెట్టిన చోటకి వెళ్లి చూడగా అక్కడ డబ్బు కనిపించదు. దీంతో బెంబేలెత్తి పరిగెత్తుకొని వచ్చి డబ్బు పెట్టిన చోట కనిపించడం లేదని చెబుతోంది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇంట్లోని అందరూ ఒక్కసారిగా హాల్లోకి వచ్చి చేరుతారు. ఆ డబ్బు ఎక్కడుందో వెతకాలి అని అందరూ భావిస్తూ ఉండగా నయని కావాలని ఆ డబ్బు సుమనకి ఇచ్చినట్లుగా భావించాల్సి వస్తుంది అంటూ మాట్లాడతాడు పరశురాం.

  దొంగకు స్కెచ్

  దొంగకు స్కెచ్

  అదే నిజమైతే అసలు మాకు బాధ లేదని కానీ నిజానిజాలు తెలియకుండా ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదని విశాల్ తండ్రి చెబుతాడు. ఇదంతా జరుగుతున్న క్రమంలో హాసిని వెళ్లి అన్ని గదులు వెతకాలని తిలోత్తమ అంటుంది. అయితే అలా చేయడం కరెక్ట్ కాదని దొంగను పట్టించే టెక్నిక్ ఒకటి తనకు తెలుసు అని నయన అంటుంది. ఇంటి పెద్ద తల చుట్టూ నువ్వులు మూడు సార్లు దిష్టితీసి ఇంట్లో ఉత్తరం వైపున పడేసి వస్తే పడేసిన 3 నిమిషాలలో దొంగకు వాంతులు అవుతాయి అని చెబుతుంది.

   తిలోత్తమ దెబ్బ

  తిలోత్తమ దెబ్బ

  ఇక తప్పక అందరూ ఇదే పద్ధతి ఫాలో అవడానికి సిద్ధమవుతారు. దీంతో నువ్వులు తీసుకొచ్చి విశాల్ తండ్రి తల చుట్టూ తిప్పబోతే నాకు వద్దని ఇంటి యజమానురాలు తిలొత్తమ అని చెప్పి పంపిస్తాడు. ఇంతలో తిలోత్తమ తలచుట్టూ నువ్వులు తిప్పి వాటిని పడేయడానికి బయటకు వెళుతుంది అలా బయటకు వెళ్ళిన సమయంలో తమ మోసం ఎక్కడ బయట పడిపోతుందో అనే భయంతో తిలోత్తమ అప్పటికప్పుడు పరిగెత్తుకు వెళ్లి గదిలో ఉన్న డబ్బులు తీసుకువచ్చి పై నుంచి విసురుతుంది. వెంటనే తప్పుకోవడంతో ఎవరు ఎక్కడి నుంచి పడేశారు అనే విషయం మాత్రం నయనకు అర్థం కాదు.

  పట్టేసిన హాసిని

  పట్టేసిన హాసిని

  అలా ఆమె డబ్బుపెట్టి తీసుకువెళ్లి విషయానికి చెప్పి డబ్బు చూపిస్తుంది. ఏదైతేనేమి డబ్బు దొరికింది అని ఆనంద పడుతూ ఉంటారు. అయితే పరశురామ్ కి వాంతి అవుతున్నట్లు అనిపిస్తోంది. ఈ విషయాన్ని హాసిని పసిగడుతుంది. వెంటనే మీ ముఖం మారిపోతోందని వాంతులు అయ్యే అవకాశం ఉందని డబ్బు మీరే తీసారా అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది చూడాల్సి ఉంది.

  English summary
  Trinayani Episode ( 366 ): Nayani panics as the money is missing. She stops Hasini from searching for the suitcase and suggests an age-old method to catch the thief. A tensed Tilottama flings the suitcase from the balcony.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X