For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani Serial July 27 Episode: నయని దెబ్బకు తిలోత్తమ అబ్బా.. మర్డర్ కి ప్లాన్ రెడీ

  |

  తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో త్రినయని సీరియల్ విపరీతమైన క్రేజ్ సంపాదిస్తోంది. బెంగాల్లో సూపర్ హిట్ గా నిలిచిన సీరియల్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఇక తెలుగులో రీమేక్ చేసిన దాన్ని కన్నడ భాషలో కూడా డబ్బింగ్ చేస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  నయని ఉపాయం

  నయని ఉపాయం

  గత ఎపిసోడ్ లో పోయిన డబ్బు మొత్తాన్ని నయని ఉపాయంతో కనిపెడుతుంది. నువ్వులు దిష్టి తీసి బయటకు వస్తున్న సమయంలో తిలోత్తమా ఈ డబ్బు మొత్తాన్ని పై నుంచి కిందకి విసిరేస్తుంది. దీంతో నయని ఆనందంగా ఆ డబ్బు తీసుకెళ్లి విశాల్ కు అప్పగించి డబ్బు మొత్తం వచ్చేసిందని. ఇంకా ఇబ్బంది లేదనే విషయం వెల్లడిస్తుంది. దీంతో అందరూ నయనిని మెచ్చుకుంటారు. డబ్బంతా దొరికేసింది ఇబ్బంది పడాల్సి ఉంది లేదనీ అందరూ భావిస్తూ ఉంటారు.

  ఈ టెక్నిక్ తెలియదు కదా

  ఈ టెక్నిక్ తెలియదు కదా

  నయని కేవలం తన ఉపాయంతో అపాయాన్ని నుంచి గట్టెక్కింది అని చెబుతూ విశాల్ అందరినీ ఆమెను ప్రశంసించాలని కోరతాడు. అలాగే తాను కూడా చప్పట్లు కొట్టి ఆమెను ఆనంద పరుస్తాడు. ఇక శంకుస్థాపనకు రెడీ అవ్వాలి అని చెప్పడంతో అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పోతారు. ఇక చాన్నాళ్ల తర్వాత శివతో నయని మాట్లాడుతుంది. సాధారణంగా ఇంట్లో డబ్బు సమస్యలు తీరాలంటే ఇలా నువ్వులు దిష్టి తీసి వేస్తారని తెలుసు కానీ దొంగలు పట్టించడానికి ఈ టెక్నిక్ తెలియదు కదా అని శివ అడుగుతుంది.

  ఎవరి పనుల్లో వారు బిజీగా

  ఎవరి పనుల్లో వారు బిజీగా

  దీంతో మంత్రం తెలియనప్పుడు తంత్రంతోనే పని కానించాలని తాత చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన నయని తాను కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాను అని చెబుతుంది. అయితే తిలోత్తమ డబ్బు తీసిన సంగతి తనకు తెలుసని అయితే ఆ డబ్బు ఎందుకు తీసారో తెలియదు కదా అంటుంది. అది పరశురాం బాబాయ్ తీశాడో లేక ఆమె తీయించిందో తెలియకుండా బయటకు లాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. ఇక ఇలా జరుగుతూ ఉండగా మిగతా వాళ్ళందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు.

  ఏ మొహం పెట్టుకుని

  ఏ మొహం పెట్టుకుని

  ఇక నయని శంకుస్థాపనకు సమయం దగ్గర పడటంతో విశాల్ దగ్గరకు వచ్చి బయలుదేరుతాను అని అంటుంది. అలాగే అక్కడే ఉన్న విశాల్ తండ్రి అలాగే విశాల్ నానమ్మ ఇద్దరి ఆశీర్వాదం తీసుకుని తనను దీవించమని కోరుతుంది.ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలంటూ వారంతా దీవిస్తారు.

  అయితే నేను కూడా వస్తాను అంటూ తిలోత్తమ, జాస్మిన్, పరశురామ్ అనడంతో మీరంతా ఎందుకు అని హాసిని ప్రశ్నిస్తుంది. మిమ్మల్ని బయటకి తోలేశాక కూడా ఇంకా ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తున్నారు అంటూ ఆమె ప్రశ్నిస్తుంది. అయినా సరే ఈ ఇవేవీ పట్టించుకోకుండా తమ ప్లాన్ అమలు చేయడానికి ప్రారంభోత్సవానికి వెళ్లాల్సిందే అని తిలోత్తమ ఫిక్స్ అవుతుంది.

  నయనిని చంపేందుకు స్కెచ్

  నయనిని చంపేందుకు స్కెచ్

  ఇక అలా శంకుస్థాపన ప్రదేశానికి వెళ్ళిన తరువాత నయని అక్కడ పరిసరాలను పరిశీలించడానికి వెళుతుంది. ఇంతలో ఆమెను చంపేందుకు తిలోత్తమ ఏర్పాటు చేసిన వ్యక్తి పైనుంచి సిగ్నల్ ఇస్తారు. తాను అంత సిద్ధంగానే ఉన్నానని ఆయన చెబుతాడు. అతనిని జాస్మిన్ కి పరశురామ్ కి చూపించిన తిలోత్తమ నయనిని చంపే వ్యక్తి అతనేనని మనం సిగ్నల్ ఇవ్వగానే పై నుంచి బస్తా కింద పడేస్తాడు అని చెబుతుంది.

  మనం ఉండగా పడేస్తే మన మీదకి వస్తుంది అని భయపడుతూ ఉంటే అదేమీ లేదని సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు కత్తెరతో నయని కత్తిరిస్తూ ఉండగా అదే సమయానికి ఆమె తల మీద పడటం బద్దలవడం జరుగుతుంది అని అంటుంది. అలా చెబుతూ ఉండగా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో నయని మీద హత్య ప్రయత్నం ఏమేరకు సఫలీకృతం అయింది అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  English summary
  Trinayani Episode ( 367 ): Everyone praises Nayani for finding the lost money. Later, Nayani goes to the opening of the project establishment and starts to perform the puja. Tilottama assigns a killer to murder Nayani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X